Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 4 సంచిక 5
September/October 2013


ప్రియమైన అబ్యాసకులకు,

గత వార్త లేఖ విడుదలై రెండు నెలలు గడిచి పోయింది. మన అభ్యాసకులు అందరూ  స్వామి మనకిచ్చిన ఈ అద్భుతమైన వైబ్రియో చికిత్సా విధానమనే సేవా భాగ్యం ద్వారా ప్రేమ సందేశాన్ని నలు దిశలా చాటుతున్నారు. నిజం చెప్పాలంటే ఇటీవల మేము పాల్గొన్న యూకే, ఇటలీ, పోలాండ్ మరియు గ్రీస్ లో జరిగిన శిక్షణ /పునశ్చరణ శిబిరాలు మా కళ్ళు తెరిపించాయనే చెప్పాలి. మనకు తెలియకుండానే ఇటువంటి ఎన్ని మంచి కార్యాలు జరుగుతున్నాయో తెలుసుకున్నాము. దీనికి లండన్ లోని సౌథాల్ పార్క్ లో జరిగిన యూనిటీ అఫ్ ఫెయిత్స్ ఫెస్టివల్ ఒక చిన్న ఉదాహరణ. ఇక్కడ నిర్వహింప తలపెట్టిన రెండవ వైబ్రియోనిక్స్ అవగాహనా మరియు చికిత్సా క్యాంపుకు  నిర్వాహకులు మమ్మల్ని ఆహ్వానించారు. తొమ్మిది మంది అభ్యాసకులు పాల్గొన్న ఈ కార్యక్రమం లో ఆరోజు 123 మంది రోగులకు వైబ్రియో చికిత్సచేయడం జరిగింది! చిన్న చిన్న చర్చలు మరియు వీడియో ప్రదర్శనల ద్వారా  వైబ్రియోనిక్స్ మరియు దానియొక్క ప్రయోజనాల గురించి వివరించారు. అది విని అక్కడకు వచ్చిన వారంతా మంత్రముగ్ధులు అయ్యారు.

సాయి వైబ్రియనిక్స్ సదస్సు జనవరి 2014 ఆదివారం 26న జరగవలసి ఉందనే విషయం మీ అందరికీ తెలిసిందే. మనం కాలంతో పరుగు పందెం వేసినట్లుగా ఉంది, ఎందుకంటే ఈ సదస్సుకు ఇక నాలుగు నెలలు కంటే తక్కువ సమయం ఉంది, మరియు మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం వైబ్రియోనిక్స్ కు సంబందించిన సమాచారం, అనుభవాలు, మరియు విజ్ఞానాన్ని అందరితో పంచుకోవడానికి ఇది ఒక ప్రపంచ వేదిక కావాలి.  మనకు ఈ విషయంలో సహాయం అందించడానికి ప్రపంచం నలుమూలల నుంచి మన అబ్యాసకులు ముందుకు వస్తున్నారని తెలియజేయడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను విన్న దాని ప్రకారం ప్రతీ ఒక్క అభ్యాసకుడు కూడా ఈ సదస్సు ఒక అద్భుతమైన మరిచిపోలేని అనుభవాన్ని మనకందరికీ ఇస్తుందని భావిస్తున్నారు! 

వైబ్రియోనిక్స్ చరిత్రలో జనవరి 26, 2014 ఒక గొప్ప మైలు రాయిగా చేయుటకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి మరియు ఇండియాలోని వివిధ రాష్ట్రాలనుంచి క్షేత్ర స్థాయిలో విజయం సాధించిన వైబ్రియో గ్రూప్స్ “వైబ్రియోనిక్స్ ఇన్ యాక్షన్” అనే ఒక ప్రదర్శన చేస్తారు. ఇంకా ఈ సదస్సులో వైబ్రియోనిక్స్ చరిత్ర మరియు అభివృద్ధి, హోమియోపతి మరియు వైబ్రియోనిక్స్, చికిత్సలో ఆహారం యొక్క పాత్ర, వ్యాధి మరియు చికిత్సలో మనసు యొక్క పాత్ర, దేశ విదేశాలలో నిర్వహించాల్సిన చికిత్సా క్యాంపులు, మొక్కలు మరియు జంతువులలో సాదించిన విజయాలు, విశిష్టమైన అరుదైన రోగ చరిత్రలు మొదలగు అనేక అంశాలపై కూలంకుషంగా చర్చిస్తారు. వైబ్రియోనిక్స్ యొక్క భవిష్యత్ ప్రణాళికలు, సమిష్ఠిగా ముందుకుసాగడం లాంటి విషయాలపై అంతర్గత ప్యానెల్ చర్చ కూడా ఉంటుంది.  

  • సదస్సు యొక్క విషయములు విశదీకరిస్తూ మేమొక పుస్తకం కూడా విడుదల చేస్తామని మీకు తెలుపుటకు నేను చాల సంతోషించుచున్నాను. ఈ పుస్తకంలో సదస్సులో జరిగిన అన్ని సమర్పణలు, విశిష్ట రోగ చరిత్రల సారాంశాలు ఉంటాయి.  మీరు ఈ పుస్తకంలో భాగస్వాములు కాదలిస్తే మీ యొక్క కేసెస్ (వార్తా లేఖలలో ఇచ్చిన విధంగా అన్ని వివరాలతో) రోగి యొక్క ఫొటోతో పాటు అతని వ్యాఖ్యానం జత చేసి మాకు పంపండి. మేము వీటిని ప్రదర్శనలో ఉంచే అవకాశం కూడా ఉంది. వీటితో పాటుగా అభ్యాసకుని బయో డేటా (పేరు, వయసు, వృత్తి, సంవత్సరాలలో     వైబ్రియో అనుభవం మరియు మీరు చెప్పదల్చిన మరే విషయమైనా) మరియు ఫోటో (అధిక రెసొల్యూషన్ కలది) పంపండి. కేసెస్ పంపడానికి ఆఖరు తేదీ 31 అక్టోబర్ 2013.
  • మీకు ఏదైనా ప్రత్యేక అంశము మీద వ్యాసం వ్రాసి సమావేశంలో ప్రదర్శించాలని అభిరుచి ఉంటే నిర్దిష్ట అంశంపై ఒక 1-2 పేజీ వ్యాసం రాసి ఆ వివరాలను నాకు ఇమెయిల్చేయండి. మీరు ఇప్పటికే ఒక నిర్దిష్ట అంశంపై రాయడానికి ఒక నిర్ణయము చేసుకొని మాకు వ్రాసి ఉన్నట్లయితే ఆ విషయం చర్చించడానికి ఇప్పుడు మాకు ఇ మెయిల్ పంపండి.   
  • మీరు వైబ్రియో వైద్య శిబిరాలు నిర్వహించడం/పాల్గొనడం చేస్తూ ఉంటే మీకు నా హృదయపూర్వకమైన విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి ఆ వివరాల్నిచిన్న వ్యాఖ్యతో  ఫొటోలతో పాటు పంపండి. మేము వీటిని ప్రదర్శనలో ఉంచుతాము.    
  • మీ నుండి లభించే ఏ సహాయమైనా ఎంతో అభినంద నీయము అంతేకాకుండా అట్టి సహాయం అందించే వాలంటీర్లందరినీ నేను వ్యక్తిగతంగా సంప్రదిస్తాను. ప్రస్తుతం, మాకు ఈ క్రింది నైపుణ్యాలను అందించే వాలంటీర్లు అవసరం:

1. ప్రచురణ కోసం వచ్చిన వ్యాసాలు మరియు కేసులు సవరించడానికి- ఆంగ్ల భాష మీద మంచి పటుత్వం ఉన్నవారు.

2. సదస్సులో చెప్పాల్సిన రాత పూర్వక విషయాలను మరియు సంబంధిత ఆన్లైన్ చిత్రాలను పవర్ పాయింట్ ప్రదర్శనలుగా తయారు చేయగలిగిన వారు.

3. సరఫరా చేయబడిన టెస్ట్ మరియు చిత్రాలను భారీ పోస్టర్లుగా తయారు చేయగలిగేవారు. 

త్వరలోనే వైబ్రియానిక్స్ వెబ్సైట్లోని  అభ్యాసకులు పోర్టల్ లో ఈ కాన్ఫరెన్స్ కోసం అభ్యాసకుల ఆన్లైన్ నమోదు ప్రారంభిస్తామని మీకు ఆనందంగా తెలియచేయుచున్నాను. సమావేశ సంబంధిత అప్డేట్స్  మేము దానిలో ఉంచుతాము కనుక క్రమం తప్పకుండా వాటిని పరిశీలించండి.  

ప్రేమ పూర్వక సాయి సేవలో
జిత్. కె. అగర్వాల్