డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
Vol 4 సంచిక 6
November/December 2013
ప్రియమైన చికిత్సా నిపుణులకు,
“మీరు మొత్తం మెట్లను చూడలే నప్పుడు (దారి సుగముగా లేనప్పుడు) మన విశ్వాసమే మొదటి అడుగు వేయిస్తుంది ... మార్టిన్ లూథర్ కింగ్
మనం అనుకున్న అంతర్జాతీయ సదస్సుకు సన్నాహాలు ప్రారంభించడమే ఆ మొదటి అడుగు. 4 నెలల క్రితం మనం మొదటి వైబ్రియానిక్స్ సమావేశానికి సన్నాహాలు ప్రారంభించినప్పుడు ఇది ఎంతో కష్టమైన పని అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన చికిత్సానిపుణులందరి నుండి సమాచారాన్ని సేకరించడం నిజంగా ఒక సవాలు. ఏదిఏమైనప్పటికీ “భవిష్యత్తులో పుట్టపర్తిలో అంతర్జాతీయ సమావేశం ఉంటుంది” అని 2007 ఏప్రిల్లో స్వామి మనకు చెప్పినట్టుగా ఆయన దైవిక మాటలు మనలను ముందుకు అడుగు వేసేలా చేశాయి. గత కొన్ని నెలలుగా మీ నుండి మాకు ఎన్నో ఈ మెయిల్స్ వచ్చాయి- చాలా అద్భుతమైన కేస్ హిస్టరీ లు, సమాచార దాయకమైన వ్యాసాలు, ఫోటోలు మరియు రోగుల టెస్టిమోనియల్స్ ఎంతో బాగున్నాయి.
ఈ విధమైన అద్భుతమైన సమాచార ప్రవాహము, మా అభ్యాసకుల ఉత్సాహము, విజయవంతమైన సమావేశం ఏర్పాటు చేయడానికి మాకు మీ అందరి సంపూర్ణ హృదయపూర్వకమైన మద్దతు ఉంది అని భరోసా ఇచ్చింది. మీ వద్ద విషయ పరంగానూ సేవా పరంగానూ మాకు ఎంతో అందించాలని భావిస్తున్న సమాచారము ఉన్న విషయం నాకు తెలుసు. మీ నుండి సమర్పణలను స్వీకరించడానికి అక్టోబర్ నెల చివరి గడువుగా నిర్ణయించినప్పటికీ ఇంకా మీ నుండి సహకారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇట్టి నిష్కాపట్య త మీరు మాతో పంచుకొనే మీ విలువైన అనుభవాలు మన వైబ్రియానిక్స్ యొక్క భవిష్యత్ అభివృద్ధికి ఎంతో ప్రధానం అని గుర్తుంచుకోండి. మీరు ఇప్పటికే సమావేశంలో ఇతర అభ్యాసకులతో పంచుకోవాలనుకుంటున్న అత్యుత్తమ కేసులు లేదా సమాచారం ఉంటే దయచేసి దానిని పంపండి. మీ నుండి లభించే సమాచారం, మీ ఆలోచనలు, అనుభవాలు మరియు అత్యుత్తమ కేసు చరిత్రలను పంచుకోవడానికి ఈ సమావేశం ఒక చక్కని వేదిక కనుక సీనియర్ అభ్యాసకులు మీ ఇన్ పుట్ ను సాధ్యమైనంత తొందరగా పంపాలి, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ 30 మించకూడదని గమనించండి. మీ నుండి లభించిన వాటిని మేము వీలైనంతవరకూ పేపర్ల రూపంలోగానీ మరియు సమావేశం కోసమే సంకలనం చేస్తున్న పుస్తకములో గానీ చేర్చడానికి ప్రయత్నిస్తాము. అయితే ఇప్పుడు చేర్చలేనివి భవిష్యత్తులో వార్తా లేఖలలో ప్రచురింప బడతాయి.
మాకు ఇంకా అనేక రకరకాల పనుల గురించి, వనరుల గురించి, అందించ దలచిన సహాయం గురించి ఆఫర్లు వచ్చాయి. ఇంకా చేయవలసింది ఎంతో ఉంది అని చెప్పటం ఒక సాధారణ విషయమే. మన ప్రియతమ సాయి మాతను సంతోష పెట్టడానికి మరియు మన సాయి వైబ్రియానిక్స్ సమావేశాన్ని విజయవంతం చేయడానికి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి మరియు విభిన్న నేపథ్యాల నుండి చాలామంది ప్రజలు పూర్తి సామరస్యంతో కలిసి పనిచేయడం నిజంగా హృదయాన్ని ద్రవీభవింప చేస్తోంది.
అభ్యాసకులు అందరూ ఈ కాన్ఫరెన్స్ నిమిత్తము భౌతికంగా పుట్టపర్తి రావడానికి తమ సుముఖతను తెలియజేస్తూ ఈ విషయంలో సానుకూలంగా స్పందించి నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సమావేశం సందర్భంగా మాకు మీ అందర్నీ చూడాలని ఎంతో కోరికగా ఉన్నప్పటికీ ప్రజల జీవితాలను పరిమితం చేసే అంశాలను అర్థం చేసుకుంటున్నాము. కనుక మీరు మీపని మరింత ఉత్సాహంతో చేయటానికి అంతర్ముఖులై స్వామి మార్గదర్శకత్వం మరియు ఆశీర్వాదాలు పొందాలని అందరినీ కోరుతున్నాను.
పూర్తిగా భిన్నమైన విధానంలో వరుసగా రెండవ సంవత్సరం నడుస్తున్న బెంగళూరులో జరిగిన “హీల్ యువర్ క్యాన్సర్” కు మమ్మల్ని ఆహ్వానించారు. అక్కడ చేరిన కొంతమంది ప్రముఖ క్యాన్సర్ నిపుణులు మరియు ప్రత్యామ్నాయ చికిత్సకులు క్యాన్సర్ చికిత్సకు సంపూర్ణమైన విధానం పై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సదస్సును ప్రారంభించిన కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి గారి ప్రోత్సాహకరమైన ప్రసంగంలో క్యాన్సర్ చికిత్సకు వివిధ పద్ధతులను సమగ్రపరచడం గురించి చెప్పారు. బెంగళూరు నుండి అనుభవజ్ఞులైన మన ఇద్దరు అభ్యాసకుల ప్రదర్శనకు మంచి ఆదరణ లభించింది.
లండన్ లోని సౌతల్ పార్క్ లో యూనిటీ ఆఫ్ ఫెయిత్స్ ఫెస్టివల్ వ్యవస్థాపకులు ఈ సంస్థ ప్రారంభించి రెండవ సంవత్సరం నడుస్తున్న సందర్భంగా వైబ్రియానిక్స్ అవగాహన మరియు వైద్య శిబిరం నిర్వహించడానికి మమ్మల్ని ఆహ్వానించారు. 11 మంది అభ్యాసకులు పాల్గొని 123 మంది రోగులకు చికిత్స చేశారు. చిన్న ఉపన్యాసాలు మరియు వీడియో ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో చోటుచేసుకున్నాయి చాలామంది ఈ కార్యక్రమంపై ఆసక్తిని చూపించి మన ఫ్లై యర్ ను కూడా తీసుకెళ్లారు.
బాబా వారి 88వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే పుట్టపర్తి రైల్వే స్టేషన్లో ఈ 5 వ సంవత్సరం కూడా మూడు రోజులపాటు ఏర్పాటుచేసిన వైబ్రియానిక్స్ వైద్య శిబిరంలో ముగ్గురు అభ్యాసకులు పాల్గొని 719 మంది రోగులకు చికిత్స చేసారు. ఇటువంటి సేవలు మరిన్ని చేయడానికి అవకాశాలు ప్రసాదించాలని స్వామి వారిని కోరుకుందాం.
ఫ్రేమతో సాయి సేవలో మీ
జిత్ కె అగర్వాల్