Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

జవాబుల కార్ర్నేర్

Vol 2 సంచిక 6
November 2011


ప్రశ్న: నిరంతరం నిద్రలేమి సమస్యతో భాదపడుతున్న రోగులకు, తగిన మందును ఇవ్వవచ్చా? ఇవ్వచ్చంటే, రోగులు రోజుకి ఈ మందును మూడు సార్లు తీసుకోవాలా లేదా నిద్రించడానికి ముందు తీసుకోవాలా?

జవాబు: దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్యున్న వారికి లేదా ఒత్తిడి కారణంగా తాత్కాలికంగా ఈ సమస్య వచ్చిన వారికి CC15.6 మందును ఇవ్వవచ్చు. మన వైబ్రో మందు అల్లోపతి మందుల వలె వ్యసనాత్మకమైనది కాదు. నిద్రించడానికి అరగంట ముందు ఈ మందును తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నిద్రపట్టన సందర్భంలో మరో సారి తీసుకోవచ్చు. ఈ విధముగా నిద్రపట్టేంత వరకు ప్రతి అరగంటకి ఒకసారి తీసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం నాలుగు సార్లు ఈ మందును తీసుకోవచ్చు. మధ్యరాత్రిలో మెలుకువ వచ్చి తిరిగి నిద్ర పట్టక పోతే కనుక మరొక సారి మందును తీసుకోవచ్చు.

సాయిరామ్ హీలింగ్ వైబ్రేషణ్ మశీనును ఉపయోగించే చికిత్సా నిపుణులు ఇవ్వవలసినవి:
NM6 Calming + NM28 Sleep + SM5 Peace & Love Alignment + SM37 Sleep + SM39 Tension + SR275 Belladonna (30C) + SR303 Opium + SR306 Phosphorus (30C) + SR309 Pulsatilla (30C).

_____________________________________

ప్రశ్న: నేను రొంప, జ్వరం నుండి ఈ మధ్యే కోలుకున్నాను కాని ఇప్పుడు నాకు జుట్టు రాలే సమస్య మొదలయింది. నేను ఏ మిశ్రమాన్ని(మందు) తీసుకోవాలి?

జవాబు:  జుట్టు రాలిపోయే సమస్యకు తీసుకోవాల్సిన మిశ్రమం CC11.1 లేదా CC11.2. జలుబు,జ్వరం వంటి లక్షణాల తర్వాత జుట్టు రాలడం కాని లేదా బలహీనత కారణంగా జుట్టు రాలడం కాని జరిగితే CC11.1 ఇవ్వాలి. దీర్ఘకాలంగా ఈ సమస్యున్న సందర్భంలో CC11.2 ఇవ్వవలెను. అస్వస్థత కారణంగా ఈ సమస్య వచ్చియుంటే కనుక CC12.1 ఇవ్వాలి. రోగికి అనీమియా (రక్తహీనత) సమస్య ఉండియుంటే కనుక CC3.1 సహాయపడుతుంది. సాయిరామ్ హీలింగ్ వైబ్రేషణ్ మశీనును ఉపయోగించే చికిత్సా నిపుణులు ఇవ్వవలసినవి ::

NM2 Blood + NM12 Combination-12 + NM22 Liver +  NM75 Debility + NM84 Hair Tonic + OM12 Hair + SM6 Stress + SM25 Hair + SM41 Uplift + SR264 Silicea + SR408 Secale Corn (30C).

_____________________________________

ప్రశ్న:  నా రోగులలో ఒకరు ఆయుర్వేద ఔషధాలు తీసుకుంటున్నారు. సాయి వైబ్రియానిక్స్ చికిత్స మొదలుపెట్టగానే అతను ఆయుర్వేద మందులను ఆపివేసే అవసరముందా?  వైబ్రో మందులను ఆయుర్వేదం లేదా హోమియోపతి మందులతో ఇవ్వరాదని శిక్షణా శిబిరంలో మా శిక్షకులు మాకు చెప్పారు.

జవాబుఅవును. ఆ రోగి ఆయుర్వేద మందులను ఆపితే మంచిది. సాధారణంగా, సాయి వైబ్రియానిక్స్ మందులు ఆయుర్వేదం లేదా హోమియోపతి మందులతో పాటు ఇవ్వడం సురక్షితం కాదు. అయితే వైబ్రేషన్లు అల్లోపతి మందులతో కలిసి అనుకూలంగా పనిచేస్తాయి కనుక అల్లోపతి మందులతో పాటు ఇవ్వవచ్చు. మరింత వివరమైన సమాధానం కొరకు "మాన్యువల్ ఫర్ వైబ్రియానిక్స్ ప్రాక్టీశనెర్స్" (చికిత్సా నిపుణులకైన చిన్నపుస్తకం) పుస్తకాన్ని చూడండి.

_____________________________________

ప్రశ్న:  ఒక సాయి భక్తుడి 23 సంవత్సరాలు వయసుగల కుమారత్తేకు, మెదడులో అంటురోగం శోకితే అల్లోపతి వైద్యం చేసారు. ఆ మహిళ కోలుకుంది కాని తరచు విపరీతమైన తలనొప్పితో భాధపడుతోంది. ఆమె వైబ్రో మందు కొరకు నన్ను సంప్రదించింది. ఆమెకు ఏ మిశ్రమాల కలయిక ఇవ్వాలని నాకు ఖచ్చితంగా తెలియలేదు.

జవాబు: ఆ రోగికి CC11.4 Migraines + CC18.1 Brain & Emotional tonic ఇవ్వవలెను. ఎందుకంటే ఈ రెండు మిశ్రమాలలోను మెదడుకి సంభందించిన మందులు ఉన్నాయి. మీ వద్ద సాయిరామ్ హీలింగ్ వైబ్రేషణ్ మశీనుంటే కనుక మీరు ఇవ్వవలసినవి: NM5 Brain TS + NM6 Calming + NM44 Trigeminal Neuralgia + NM85 Headache-BP + OM13 Trigeminal + SR275 Belladonna (30C) + SR273 Aurum Met + SR295 Hypericum (30C) + SR359 Zincum Met + SR458 Brain Whole + SR468 CN5: Trigeminal.

_____________________________________

ప్రశ్న:  నా భర్త రెండుసార్లు గుండెపోటు వచ్చిన ఒక గుండె రోగి. అతనికి మధుమేహ సమస్య కూడా ఉంది. నేను అతనికి  CC3.1 Heart tonic + CC6.3 Diabetes ఇస్తున్నాను. అతనికి CC3.4 కూడా ఇచ్చే అవసరముందా? ప్రతి వ్యక్తికి రెండు మిశ్రమాల కన్నా అధికంగా ఇవ్వరాదని మాకు సలహా ఇవ్వబడింది, అందువల్ల మరొక మిశ్రమం చేర్చవచ్చా? నా భర్తకు సాయి వైబ్రియానిక్స్ పై విశ్వాసం లేదు కనుక నేను వైబ్రో మందులను నీటిలో కలిపి ఇస్తున్నాను. ఇలా చేయడం అతనికి సహాయపడుతుందా? దయచేసి సలహా ఇవ్వండి.

జవాబు: మీ భర్తకు CC3.1 Heart tonic ఇవ్వడం కొనసాగించండి. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే, CC3.4 ఇవ్వవలెను. CC6.3 Diabetes కూడా కొనసాగించండి, అయితే అతను క్రమం తప్పకుండా రక్తంలో చక్కర స్థాయిని పరీక్ష చేసుకుంటూ ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే మధుమేహం సంభందించిన వైబ్రో మందును తీసుకుంటున్న రోగులలో కొన్ని సార్లు వారు తీసుకొనే ఇన్స్యులిన్ మోతాదును తగ్గించ వలసియుంటుంది. రెండు కన్నా ఎక్కువ మిశ్రమాలను, కేవలం అధిక అనుభవమున్న చికిత్సా నిపుణులు మాత్రమే ఇవ్వవలెను మరియు అవసరముంటే మాత్రమె ఇవ్వవలెను. మీ భర్తకు వైబ్రియానిక్స్ పై నమ్మకం లేనప్పటికీ, ఈ మిశ్రమాలు అతనికి ఖచ్చితంగా సహాయపడతాయి మరియు మీకున్న ధృడ విశ్వాసం ద్వారా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. వైబ్రియానిక్స్ చికిత్సా విధానాన్ని బాబా పలు మార్లు దీవించారని మరియు నయంచేసేది బాబానే కనుక అత్యద్భుతమైన ఫలితాలు ప్రతిరోజు లభిస్తూనే ఉన్నాయని మీరు గుర్తుంచుకోవాలి.