Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్న జవాబులు

Vol 3 సంచిక 4
July/August 2012


1. ప్రశ్న: గోళీల రూపంలో ఉన్న వైబ్రేషన్ ను నీటి రూపం లోనికి మార్చుకొనడానికి ఏ నిష్పత్తి పాటించాలి?

    జవాబు: నిష్పత్తి అనేది ఇక్కడ అప్రధానమైన విషయం. దీనికి ఖచ్చితమైన నిష్పత్తి ఏమి లేదు! సాధారణంగా 200 మి.లీ. నీటిలో 4 గోళీలు వేయమని చెపుతాము. ఐతే ఒక లీటర్ నీటిలో 5 గోళీలు వేసుకున్నా సరిపోతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలా కలిపిన దానిని108 సార్లు బాగా కదపాలి. ఇలా తయారు చేసుకున్న రెమిడిని ప్లాస్టిక్ స్పూన్ తో 5 మి.లీ. తీసుకుని మింగటానికి ముందు నాలిక క్రింద ఒకనిమిషం ఉంచుకొని అనంతరం మింగాలి.

_____________________________________

2. ప్రశ్న: నేను గమనించిన విషయం ఏమిటంటే నా 108 CC బాక్సులో ఉన్న రెమిడిల ద్రవ పరిమాణము నేను ఉపయోగించక పోయినా తగ్గిపోతోంది. ఎందుకిలా జరుగుతోంది?

    జవాబు: ఇది చాలా సాధారణం. మనం రెమిడిలకు ఉపయోగించే వైద్య పరమైన ఆల్కహాల్ చాలా స్వచ్చమైనది, దీనియొక్క బాష్పీబవన స్థానం చాలా తక్కువ. అందుచేత మనం మూత గట్టిగా పెట్టినప్పటికీ రెమిడి సీసాల నుండి ద్రవం ఆవిరయి పోతూ ఉంటుంది.
_____________________________________

3. ప్రశ్న: రెండు నెలల పాటు నేను వేరే ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు నా పేషంట్ల నిమిత్తం ఎలాంటి ఏర్పాటు చేసుకోవాలి?

    జవాబు: మీ కుటుంబ సభ్యులలో గానీ లేదా మీ పేషంట్ల నుండి గానీ రెమిడి లు తయారు చేయగల సమర్ధత ఉన్నవారిని ఎన్నుకొని వారిని మీ సహాయకుడిగా తర్ఫీదు ఇవ్వవలసిందిగా సూచన. అదేవిధంగా మీ ప్రాంతంలో ఉన్న మరొక ప్రాక్టీషనర్ తో సంప్రదింపులు జరుపుతూ మీరు స్థానికంగా లేనప్పుడు మీ పేషంట్లు వారిని సంప్రదించే విధంగా ఏర్పాటు చేసుకోండి. అటువంటి వారు ఎవరి గురించి మీకు తెలియ నట్లయితే సమాచారము కొరకు [email protected] కు రాయండి.

_____________________________________

4. ప్రశ్న: 108CC బాటిల్ రీఫిల్ చేసిన తర్వాత దానిని షేక్ చేసే విధానము పైన నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి నివృత్తి చేయగలరు.

జవాబు: 108CC రెమిడి బాటిల్ ను పైన పట్టుకొని అరచేతిలో 9 సార్లు తడుతూ బాగా కదపాలి. ఇలా చేస్తూ మన ఇష్ట దైవాన్ని   “ఓ భగవంతుడా ఈ రెమిడి నయం చేసే నీ దివ్య ప్రేమతో శక్తివంతం కావాలి అని ప్రార్దించాలి. మనసును కేంద్రీకరించి ఈ విధంగా చేసి నట్లయితే ఆ రెమిడికి అదనపు శక్తి జోడింప బడుతుంది.
_____________________________________

5. ప్రశ్న: 108CC బాటిళ్ళను ప్రతీ రెండు సంవత్సరాల కొకసారి కదిపితే (షేక్ చేస్తే) మరలా అవి శక్తివంతం అవుతాయని నేను విన్నాను. ఇది సరియయినదేనా?

    జవాబు: ఇదమిద్ధం గా ఇదే చేయాలి అంటూ ప్రత్యేకమైన నియమాలు ఏమీ లేవు. మనం రెమిడి ఉపయోగించేటప్పుడు, రీఫిల్ చేసే టప్పుడు షేక్ చేస్తూనే ఉంటాము. ఐతే ముందు జాగ్రత్తకోసం మేమేమి సలహా ఇస్తామంటే ప్రతీ బాటిల్ ను 9 సార్లు అరచేతి పైన తట్టాలి అలా చేస్తే కొమ్బో లు మరలా శక్తివంతం అవుతాయి.  

_____________________________________

6. ప్రశ్న: మహిళా ప్రాక్టీషనర్ ఋతు సమయంలో రెమిడి లను పేషంట్లకు ఇవ్వవచ్చా?

    జవాబు:
ఔను, నిరభ్యంతరంగా ఇవ్వవచ్చు; మహిళలకు కానీ పురుషులకు కానీ ప్రధానంగా ఉండవలసింది ఏమిటంటే ఆలోచనలలో పవిత్రత, పేషంట్లకు రెమిడి ఇచ్చేటప్పుడు ప్రశాంత చిత్తము తో ఇవ్వాలి.

చికిత్సా నిపుణులారా: మీకు డాక్టర్ అగ్గర్వాల్ గారితో పంచుకొనేందుకు ఏమయినా ప్రశ్నలున్నయా? ఐతే ఈ వెబ్సైట్ కు మెయిల్ మ పంపండి [email protected]