Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్న జవాబులు

Vol 3 సంచిక 5
September/October 2012


1. ప్రశ్న: రెమిడీలను తయారు చేసేటప్పుడు మరియు 108 CC బాక్స్ లో ఆల్కహాల్ తో డ్రాపర్ బాటిళ్లను రీఫిల్ చేసేటప్పుడు షేక్ చేయడం గురించి నాకు అయోమయంగా ఉంది. దయచేసి స్పష్టం చేయండి.

    జవాబు: చాలామంది అభ్యాసకులు కూడా ఈ విధానం గురించి అయోమయంలో ఉన్నారు. మునుపటి వార్తాలేఖలలో మేము ఈ సమస్యను పరిష్కరించి నప్పుడు ఇది చాలా ముఖ్యమైనది అని మేము గ్రహించాము. కాబట్టి గతంలో వ్రాసిన అన్ని విషయాలను సమీక్షించడానికి మేము ఈ అవకాశాన్ని తీసుకుంటున్నాము. ప్రస్తుత పరిశోధనల ఆధారంగా, రెమిడీ తయారీ సమయంలో షేకింగుకు సరైన విధానం క్రింద వివరించాము.   

  1. ఛార్జ్ చేసిన ఆల్కహాలును మాత్రలకు జోడించే సమయంలో భూమికి సమాంతరంగా 8 ఆకారంలో బాటిల్ ను 9 సార్లు కదిలించాలి.  
  2. మాత్రల నుండి నీటికి కంపనాలు బదిలీ చేసేటప్పుడు గరిష్ఠంగా ఒక లీటర్ (1000 ml) నీటికి 5 మాత్రలు వేసి మాత్రలు కరిగి పోయేవరకు లోహ రహిత చంచాతో కలపాలి.  
  3. ఆల్కహాల్ నుండి నీటికి కంపనాలను బదిలీ చేయడానికి 200 మిల్లీలీటర్ల నీటిలో 1-2 చుక్కల ఆల్కహాల్ మాత్రమే అవసరం దీనిని తొమ్మిదిసార్లు కదిలించండి.   
  4. నీటిలో పెద్ద మొత్తంలో నివారణ చేయడానికి 100 మిల్లీలీటర్ల (3½ ఔన్సులు) చార్జి చేసిన నీటిని గరిష్టంగా 20 లీటర్లు (5 గ్యాలన్ల) నీటిలో వేసి తొమ్మిది సార్లు కదిలించాలి.  
  5. 108 CC బాక్సులో ఏదైనా డ్రాపర్ బాటిల్ లోని ద్రవం బాగా తక్కువగా ఉన్నప్పుడు డ్రాపర్ బాటిల్ను 2/3 ఆల్కహాల్ తో నింపి మీ అరచేతికి వ్యతిరేకంగా తొమ్మిది సార్లు నొక్కడం ద్వారా బాగా కదిలించండి.  
  1. రెమిడీని క్రీము/జెల్/లేదా నూనెలో తయారు చేసేటప్పుడు మీరు 50 మిల్లీ లీటర్ల క్రీం మొదలైన వాటికి కొన్ని చుక్కల చార్జ్ చేసిన ఆల్కహాల్ ను జోడించాలి మరియు లోహ రహిత చంచా లేదా కాడ వంటి దానితో బాగా కలపాలి.

_____________________________________

2. ప్రశ్న: గోలీలు కన్నా నీటిలో కలిపిన కంపనాలు ప్రభావవంతంగా ఉంటాయి అనేది నిజమేనా?  

    జవాబు: అవును సంవత్సరాలుగా మేము అనేక మంది అభ్యర్థులు నుండి నివేదికలు అందుకున్నాము (ఇది మా వ్యక్తిగత అనుభవం కూడా). వైబ్రియానిక్స్ రెమిడీలు నీటిలో చాలా వేగంగా పనిచేస్తాయి. మా విశ్వాసానికి కారణం ఏమిటంటే a. మనకు తెలిసిన అన్ని పదార్ధాలలో కెల్లా నీటికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. b. శరీరం దాదాపు 70 శాతం నీటిని కలిగి ఉన్నందున నీటి నుండి వేగంగా మరియు విస్తృతంగా వైబ్రేషన్లు అంతటా వ్యాపిస్తాయి. కనుక వారికి సౌకర్యవంతంగా ఉన్నప్పుడు 200 మిల్లీలీటర్ల (7 ఔన్సులు) నీటిలో 5 గోళీలు కరిగించుకొని 5 ml లేదా ఒక టేబుల్ స్పూన్  ద్రావణాన్ని తీసుకొమ్మని మీ రోగులకు సలహా ఇవ్వడం మంచిది.

మీరు ఒక గాజు గ్లాసు లేదా ప్లాస్టిక్ (లోహం కాకుండా) మాత్రమే మీ పేషంట్లు ఉపయోగించేటట్లు మరియు మొబైల్, కంప్యూటర్లు, ప్రత్యక్ష సూర్యకాంతి మొదలైన వాటినుంచి దూరంగా ఉంచడం వంటి సాధారణ జాగ్రత్తలు తీసుకొమ్మని కూడా చెప్పాలి. మీ సొంత కుటుంబ ఉపయోగం కోసం మీ నివారణను ఎల్లప్పుడూ నీటిలో చేయడానికి ప్రయత్నించండి. ఈనీటిని కొద్ది రోజులు ఉపయోగించవచ్చు. దీన్ని ప్రయత్నించండి, వీటి ఫలితాలు చూసి మీరు ఆశ్చర్యపోతారు.    

_____________________________________

3. ప్రశ్న: గర్భిణీ స్త్రీకి తన గర్భంతో సంబంధం లేని వ్యాధుల కోసం నేను సురక్షితంగా చికిత్స చేయవచ్చా? 

    జవాబు: మీరు 108 CC బాక్సు నుండి ఏదైనా కోంబో లేదా సాయిరాం పోటెమ్టైజర్ తో తయారుచేసిన నివారణను ఇవ్వవచ్చు. (అదనంగా కాబోయే తల్లులకు వారికి సహాయ పడటానికి ఒక ప్రామాణిక నివారణ ఇవ్వండి. ఉదాహరణ గర్భధారణ టానిక్) సాధారణ చెకప్ అనగా గర్భధారణకు ముందు గాని వెనుక గానీ చెకప్ కోసం రోగికి ఆమె వైద్యురాలితో సంప్రదిస్తూ ఉండాలని, సలహా ఇవ్వడం గుర్తుంచుకోండి. 

_____________________________________

4. ప్రశ్న: పేషెంటుకు రెమిడీ సూచించే సమయంలో వైద్యుడి శారీరక మరియు మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది. నేను జ్వరము, జలుబు, లేదా  మైగ్రేన్ తో ఉన్నప్పుడు రెమిడీలను సూచించవచ్చా? అలాగే ఒత్తిడికి గురైనప్పుడు, విచారంగా ఉన్నప్పుడు సూచించడం సమంజసమేనా?  

    జవాబు: ఒక అభ్యాసకుడు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటం మంచిదే. అవును మీకు బాగా లేనప్పుడు రెమిడీలు సూచించ వలసి వస్తే a. మీరు స్పష్టంగా ఆలోచించగలిగినప్పుడు b. వైద్యం ప్రారంభానికి ముందు మీరు స్వామికి మార్గదర్శకత్వం మరియు సహాయం కోరేందుకు స్పష్ట మైన మనసుతో ప్రార్ధించగలిగినప్పుడు మీరు రెమిడీలు ఇవ్వవచ్చు. ప్రేమ పూర్వక హృదయంతో అటువంటి సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు అభ్యాసకుడు తనకున్న విచారము, బాధ (ఇవి తాత్కాలికమైనవే కావచ్చు) వంటి సమస్యలను అధిగమించి బాధపడుతున్న రోగులకు సహాయం చేయగలుగుతాడు.