ప్రశ్నలు సమాధానాలు
Vol 3 సంచిక 6
November/December 2012
1. ప్రశ్న : ఒక స్నేహితురాలికి తొందర్లో కాన్పు అవుతుంది. అందువలన ఆవిడ నన్ను ప్లాసెంటా యొక్క నోసోడ్ చేయమని అడిగింది. కాన్పు అయిన తరువాత ఎంతసేపటికి నేను నోసోడ్ చేయవచ్చు? దీనికి కాల వ్యవధి ఏమైనా ఉందా?
జవాబు : ఏ శరీర భాగం యొక్క కచ్చితమైన వైబ్రేషన్ పొందాలంటే అది ఆరోగ్యంగా ఉండాలి. కానీ ప్లాసెంటా (మావి) అన్ని జీవ పదార్దాల్లాగే బాక్టీరియా తో మలినం చెంది కొంతకాలానికి కుళ్లిపోవచ్చు ముఖ్యంగా ఫ్రిజ్ లో ఉంచకపోతే. అందువలన కాన్పు అయిన వేంటనే ప్లాసెంటాను పొటెంటైజ్ చేయడం ఉత్తమం
డెలివరీ తర్వాత ప్లసేంటా వాడుక గురించి తరువాత వార్తాలేఖలో వివరించడం జరుగుతుంది.
_____________________________________
2. ప్రశ్న : 6 వారాల పసి పాప యొక్క తల్లి బాటిల్ పాలు తాగలేని ఇంకా మంచి నీరు కూడా పట్టని తన పాపకు వైబ్రియో మందులు ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలనుకొంటోంది.
జవాబు : ముందుగా పసి పిల్లలకు కూడా వైబ్రియో పిల్స్ ఏ విధమైన హాని చేయలేవని మీరు గ్రహించాలి. కొన్ని పిల్స్ ను స్వచ్ఛమైన నీటిలో వేసి ఒక నీటిచుక్కను తల్లి చనుఁమ్రోలు పైన పాప పాలు తాగే ముందు ఉంచాలి. లేదా రెమెడీని ఆర్గానిక్ కొబ్బరి/ఆల్మండ్/ఆలివ్ నూనెలో చేసి పాప చర్మం పైన రుద్దవచ్చు. ఏమైనా పాప చర్మం పై నూనె రాయడం మంచిదే కదా.
_____________________________________
3. ప్రశ్న : నా తల్లి వయసు 89 సంవత్సరాలు మరియు ఆమె అల్జీమర్ వ్యాధితో బాధ పడుతోంది. ఆవిడ చాల బలహీనంగా ఉంది తాగడానికి తినడానికి తిరస్కరిస్తోంది . అంటే ఆవిడ తొందర్లో చనిపోబోతోందా? ఆలా అయితే నేను ఎలా ఈ మార్పును ఆవిడకు సులభతరం చేయగలను?
జవాబు : ఈ మార్పును సులభతరం చేయడానికి రెమేడీ SR272 Arsen అల్బ్ (CM). ఇది చివరి రోజులలో మనసును శాంతంగా ఉంచుతుంది. సమయం దగ్గర పడిందని మీకు తోచినప్పుడు రెమేడీ ని నీటిలో చేసి ఒక బొట్టును నోటిలో లేదా పెదాలపై వేయండి ... OD
బాక్స్ ఉన్న అబ్యాసకులు CC15.6 Sleep disorders ను ఉపయోగించండి ఇందులో SR 272 Arsen అల్బ్ ఉంది.
_____________________________________
4. ప్రశ్న : ఒక బాటిల్ పిల్స్ కి మనం గరిష్టంగా ఎన్ని కంబోలు కలపచ్చు? దానికేమైనా పరిమితి ఉందా? ఎక్కువ కంబోలు కలిపితే పిల్స్ ప్రభావం తగ్గే అవకాశముందా? ఈ కాంబోలలో ఏవైనా ఒకే బాటిల్ లో మిగిలిన కాంబోలతో కలిపి ఇవ్వకూడనివి ఏవైనా ఉన్నాయా ( నిద్ర లేమి కాంబో మినహాయించి )?
జవాబు : మీరు మీ ప్రాక్టీస్ ప్రారంభించిన కొత్తలో సంబంధిత సమస్యలకు సంబంధ మిశ్రమాలను మాత్రమే జోడించడానికి మేము సిఫార్సు చేస్తున్నాము. అయితే మీరు ఏ కాంబోకైనా CC10.1, CC12.1 (లేదా CC12.2), CC15.1 లేదా CC17.3 జోడించవచ్చు. కొన్నేళ్ల అనుభవం తర్వాత, మీరు వివిధ సమస్యలకు వివిధ మిశ్రమాలను కలిపి ఇవ్వవచ్చు. అయితే, 4 లేదా 5 సంబంధ మిశ్రమాల కంటే ఎక్కువ కలిపి ఇవ్వకపోవడం ఉత్తమం. లేకపోతె మీరు డైల్యూషన్ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. దీనివలన కలపబడిన ఏ కాంబో ప్రభావమైన తగ్గవచ్చు.
_____________________________________
5. ప్రశ్న : మాన్యువల్ లో బాటిల్ లోని పిల్స్ వైబ్రేషన్స్ 6 నెలలపాటు ఉంటుందని ఇవ్వబడింది. కానీ వర్క్ షాప్ లో అవి 2 నెలలు వరకే ఉంటాయని విన్నట్టు గుర్తు.- కావున పిల్స్ లో వైబ్రేషన్స్ ఎంత కాలం నిలిచి ఉంటాయి? బోటిల్ ను అరచేతిపై 9 సార్లు కొట్టడం వలన పిల్స్ తిరిగి శక్తివంతం అవుతాయా?
జవాబు : అవన్నీ కూడా రోగి తన పిల్స్ బోటిల్ ను ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్త కోసం పిల్స్ కాల పరిమితి 2 నెలలని చెప్తాము. అయితే వేసుకోబోయేముందు బోటిల్ ను అరచేతి పై 9 సార్లు కొట్టడం ఉత్తమం. ఎందుకంటే ఇలా చేయడం వలన పిల్స్ మరింత ప్రభావవంతంగా పని చేస్తాయి.
_____________________________________
6. ప్రశ్న : 108 CC బాక్స్ ను ఏ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి? మనతో పాటు ప్రయాణంలో తీసుకెళ్లేటప్పుడు (ఉదాహరణకి కారు ట్రంక్ లో) అది అతి శీతల లేదా అతి వేడి (ప్రత్యక్ష సూర్య రశ్మి కాకుండా ) ఉష్ణోగ్రతను తట్టుకోగలదా?
జవాబు : 108 CC బాక్స్ ను చల్లని చీకటి ప్రదేశంలో ఉంచడం మంచిది. మండు వేసవిలో దానిని కార్ ట్రంక్ లో తీసుకెళ్లడానికి మేము సిఫారసు చేయము. ఆలా వేళ్ళ వలసి వస్తే ఇన్సులేటెడ్ కూలర్ బాక్స్ లో ఉంచి తీసుకెళ్లడం ఉత్తమం.