Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్నలు సమాధానాలు

Vol 4 సంచిక 2
March/April 2013


1. ప్రశ్న : నీటిలో రెమిడి ని ఎంత కాలం ఉంచవచ్చు? దీనిని ఫ్రిడ్జ్ లో ఉంచవచ్చా? ఈ నీటికి విభూతి కలప వచ్చా?

    జవాబు : రెమిడీ ని మూత ఉన్న సీసాలో 7 రోజుల వరకూ ఉంచవచ్చు. దీనిని ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిది కాదు. ఈ నీటికి విభూతి కలప వలసిన అవసరం లేదు.

_____________________________________

2. ప్రశ్న: పనికి వెళుతున్న వారు మధ్యాహ్నం డోస్ తీసుకోవడం కష్టం కనుక TDS బదులు ఉదయం సాయంత్రం రెండు పూటలు తీసుకోవచ్చా?

    జవాబు: అసలు తీసుకోకుండా ఉండడం కంటే రెండు పూటలు తీసుకోవడం మంచిదే. TDS గా తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి..

_____________________________________

3.  ప్రశ్న: బ్రష్ చేసుకున్న వెంటనే రెమిడి తీసుకోవచ్చా, రెమిడిల దృష్ట్యా టూత్ పేస్ట్ తో బ్రష్ చేసుకోవడం ఆహారం తీసుకున్నట్లే పరిగణిస్తారా? మింట్ ఫ్లేవర్ తో ఉన్న టూత్ పేస్ట్ మనం తీసుకునే వైబ్రో గోళీల పైన ప్రభావం చూపుతుంది కనుక దానిని వాడడం మానేయాలా ?

    జవాబు : లేదు, బ్రష్ చేసుకున్న తర్వాత 20 నిముషాలు ఆగడం మంచిది. మింట్ వల్ల ఇబ్బందేమీ లేదు టూత్ పేస్ట్ లన్నింటికి దేని వైబ్రేషన్ దానికే ఉంటుంది.

_____________________________________

4.  ప్రశ్న: నా పిల్లలకి రెమిడిలు ఇచ్చే సమయంలో వారు భోజనం చేసాక 20 నిముషాలు ఆగినప్పటికీ ఇంకా వారి నోటిలో కొన్ని ఆహారపు కణాలు ఉంటున్నాయి. అలా ఐనప్పటికీ  రెమిడిలు ఇవ్వవచ్చా?

    జవాబు: ఆహారం తీసుకున్నతర్వాత నోటిని పుక్కిలించడం కానీ నీటిని త్రాగడంగానీ చేయాలి. అలా చేస్తే నోటిలో ఆహార కణాలు చిక్కుకోవు. అన్నిటి కంటే భోజనానికి 20 నిమిషాల ముందు రెమిడి ఇవ్వడం శ్రేయస్కరం.

_____________________________________

5.  ప్రశ్న: గోళీలు ఉన్న బాటిల్ ను ఒకటి కంటే ఎక్కువ కోంబోలను వేసే సందర్భంలో ప్రతీసారీ షేక్ చెయ్యాలా?

    జవాబు: ప్రతీ ఒక్క డ్రాప్ వేసిన తర్వాత స్వల్పంగా షేక్ చెయ్యండి. చివరి డ్రాప్ వేసిన తర్వాత 8 ఆకారంలో 9 సార్లు షేక్ చెయ్యండి. కొందరు ప్రాక్టీ షనర్ లు డ్రాప్స్ అన్ని కూడా ఖాళి బాటిల్ లో వేసి తర్వాత గోళీలు వేసి షేక్ చేస్తారు.

_____________________________________

6.  చర్మానికి రాసుకునే ఆయింట్ మెంట్ పైన వివిధరకాల ప్రశ్నలు:

a. ప్రశ్న: పేషంటు ఆయింట్ మెంట్ ను చర్మము పైన రాసుకోవడం జరుగుతుంది కాబట్టి తన చేతిని క్రీం తయారుచేసిన కంటైనర్ లో ఉంచి నట్లయితే వైబ్రేషన్ పోతుంది కనుక కంటైనర్ నుండి క్రీం బయటకు తీయడానికి ప్లాస్టిక్ స్పూన్ వాడడం మంచిదేనా?

    జవాబు: ఔను, అదే మంచిది.

b. ప్రశ్న: మొదటి సారి వైబ్రో గోళీని నోటికి ఇచ్చినట్లు ఆయింట్ మెంట్ కూడా మొదటి సారి పేషంటుకు స్వయంగా రాయాలా? ఒకవేళ ఆ చర్మ వ్యాధి అంటువ్యాధి ఐతే మార్గం ఏమిటి?

    జవాబు: లేదు, మనం పేషంటు ను ముట్టుకో కూడదు తనంతట తానే రాసుకోవాలి.

c. ప్రశ్న: డోసేజ్ TDS – అనేది గోళీలకు కూడా వర్తిస్తుందా? పేషంటు ఆయింట్ మెంట్ ను బాగా రుద్దవలసి ఉంటుందా? పేషంటు బ్యాండేజ్ లేదా బ్యాండ్ ఎయిడ్ చర్మమును మూసి ఉంచే దాని కోసం ఉపయోగించాలా ?

    జవాబు: ఔను డోసేజ్ TDS. గానే తీసుకోవాలి. క్రీమును రుద్దాలా వద్దా అనేది చర్మము యొక్క సహజ పరిస్థితి పైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు  బయటకు కనిపించే పుండు మాదిరిగా ఉంటే ఆయింట్ మెంట్ వ్రాసి కట్టువేయవచ్చు. చర్మము పరిస్థితి బాగా ఉంటే  కొన్ని సార్లు రుద్దవలసి ఉంటుంది. ఒక్కొక్క సారి రెమిడి ని నీటిలో కలుపుకొని అ నీటిని కాటన్ గుడ్డతో గాయం మీద అద్దుకోవడం ద్వారా కూడా గాయం  త్వరగా తగ్గి పోయే అవకాశం ఉంది.

d. ప్రశ్న: క్రీము లేదా జెల్లీ రూపంలో ఉన్న వాటికి రెమిడి కలపడం ఎలా, క్రీమును వేడి చేసి అది ద్రవ రూపంలోకి మారిన తర్వాత దానిలో కొంబో చుక్కలు వేసి ఆ తర్వాత దానిని ప్లాస్టిక్ స్పూన్ తో కలపాలా?

    జవాబు: లేదు, వేడి చేయవలసిన అవసరం లేదు. క్రీము లోనికి ఒక చుక్క కొంబో చుక్క వేసి ప్లాస్టిక్ లేదా కట్టె స్పూన్ తో బాగా కలపాలి. తర్వాత మరో చుక్క వేసి బాగా కలపాలి. క్రీము చిక్కగా ఉన్నట్లయితే ఇలా 3 లేదా 4 సార్లు కొంబో డ్రాప్స్ జెల్లీ మొత్తం కలిసాయి అని సంతృప్తి చెందే వరకూ కలపవలసి ఉంటుంది.

e. ప్రశ్న: కంటిలోనూ చెవిలోనూ వేసే చుక్కల మందులు ఒకేసారి తయారుచేసుకో వచ్చా? ఐతే ఎలా తయారుచేసుకోవాలి?

    జవాబు: ఒకేసారి రెండింటికి ఉపయోగపడే విధంగా కంటికి, చెవికి లేదా చర్మములకు మందు తయారు చేయాలనుకోవడం మంచి ఆలోచనే. కంటికి చుక్కల మందు తయారు చేయడానికి 200 మీ.లి. డిస్టిల్ వాటర్ లేదా రోజ్ వాటర్ లో ఒక చుక్క కొమ్బో వెయ్యాలి. తర్వాత 20/30 మి.లీ. డ్రాపర్ బాటిల్ లోనికి దీనిని మార్చాలి.

 

హెచ్చరిక : మీరు 20/30, మి.లీ బాటిల్ లోనికి కొంబో చుక్కను వేస్తే అది కంటిలో గాయాన్ని లేదా మంటను  కలిగించవచ్చు. అలాగే CC డ్రాప్ ను నేరుగా పేషంటు నోటిలోనికి వేయరాదు.  అలాగే చెవికి చుక్కల మందు కోసం 20/30 మి.లీ. డ్రాపర్ బాటిల్ లో ఎక్స్ట్రా విర్జిన్ ఆలివ్ నూనె ను తీసుకుని దానిలో ఒక చుక్క కొమ్బో ను వేసి బాగా కలపాలి.

వైబ్రో అభ్యాసకులారా: డాక్టర్ అగ్గర్వాల్ గారితో మీకేమైనా ప్రశ్నలున్నాయా? ఐతే ఈ వెబ్సైట్ [email protected] కు పంపండి.