ప్రశ్నలు జవాబులు
Vol 4 సంచిక 3
May/June 2013
1. ప్రశ్న: పేషెంట్ యొక్క మొదటి సందర్శనకు ముందు నేను ఏదైనా ఫారం వారికి ఇవ్వాలా?
జవాబు: రోగితో మాట్లాడటం చాలా ముఖ్యం కాబట్టి ఇది అవసరం లేదు. అయినప్పటికీ రోగి మరియు వైద్యుడికి రోగి యొక్క దీర్ఘకాలిక సమస్యల గురించి వ్రాతపూర్వక వివరాలను మరియు అతను తీసుకున్న ఇతర చికిత్సలను తెలుసుకోవాలంటే ఇది సహాయపడుతుంది.
_____________________________________
2. ప్రశ్న: వైబ్రియానిక్స్ మాన్యువల్ లో రోగి యొక్క దీర్ఘకాలిక వ్యాధికి మూల కారణాన్ని తెలుసుకోవడానికి అనేక ప్రశ్నలు అడగాలని తెలుపుతుంది. అయినప్పటికీ ప్రారంభంలో ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే నేను చేయగలిగింది ఏదైనా ఉందా?
జవాబు: అవును, చాలా సందర్భాలలో సిసి 15.1 జోడించడానికి ఇది సహాయ పడుతుంది. ఎందుకంటే రోగానికి మూలకారణం విచారము, మానసిక గాయము వంటి మానసిక అవాంతరాలు తరచుగా ఉంటాయి. అయితే రోగితో మాట్లాడేటప్పుడు మీ స్వంత కుటుంబ సభ్యునిగా భావించినట్లయితే మీ ప్రశ్నలకు అతను జవాబు చెప్పడానికి అవకాశం ఉంటుంది.
_____________________________________
3. ప్రశ్న: ఒక అభ్యాసకునిగా నేను పోస్టు ద్వారా నా రెమిడి అందుకున్నప్పుడు, ఆ సీసా నిండుగా ఉంది. కానీ మన మాన్యువల్ సీసాలో 2/3 వంతు మాత్రమే నింపాలని చెబుతుంది దీనికి ఏం చేయాలి?
జవాబు : సీసాలో 2/3 భాగం నింపి ఆపై సాధారణ పద్ధతిలో కదిలించడం సరియయిన పద్దతి. అయితే మీరు మరి కొన్ని మాత్రలు వేసి మరలా షేక్ చెయ్యవచ్చు.
_____________________________________
4. ప్రశ్న: దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగి OW నిర్వహణ మోతాదు ప్రారంభించాలంటే రోగి ఎంత కాలం వ్యాధి లక్షణాలు లేకుండా ఉండాలి?
జవాబు: రోగి యొక్క వ్యాధి లక్షణాలు పూర్తిగా పోయినప్పుడు అతని మోతాదును ఎక్కువ కాలం (చికిత్సా సమయంలో 1/3 నుండి 2/3 భాగం) వరకూ నెమ్మదిగా OW కి తగ్గించండి. ఈ మోతాదును జీవితాంతం కొనసాగించవచ్చు.
_____________________________________
5. ప్రశ్న: రోగి సమక్షంలో రెమిడీ తయారుచేయడం సముచితమైన చర్యేనా? 8 ఆకారంలో రెమిడీ బాటిల్ ని త్రిప్పడం అభ్యంతరకరం గానో లేక ఆచారం గానో రోగీకి అనిపిస్తుందా?
జవాబు: ఇది సమస్యగా మేము భావించడం లేదు. ఐతే అవసరం మేరకు కోంబో బాటిల్ నుండి ఒక చుక్క గొళీల బాటిల్లోనికి వేసి దీనిని షేక్ చెయ్యడం ద్వారా వైబ్రేషన్ గోళీలు అన్నింటికీ వెళ్తుంది అని మీరు రోగికి వివరించవచ్చు.
_____________________________________
6. ప్రశ్న: రోగి నాలుగు వేర్వేరు నివారణలు తీసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి రెండిటి మధ్య 20 నిమిషాలు వేచి ఉండవలసిన అవసరం ఉందా?
జవాబు: లేదు, వాస్తవానికి మాత్రల మధ్య ఐదు నిమిషాల వ్యవధి మాత్రమే అవసరం. రోగికి ఏ సమయంలోనైనా మూడు కంటే ఎక్కువ వేరు వేరు సీసాలు ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు అతన్ని ఎక్కువ కోంబోలతో ముంచి వేస్తే నిమగ్నం కాలేక చికిత్సను మానివేయవచ్చు.
_____________________________________
7. ప్రశ్న: నేను నా రోగులకు లేదా మన సాయి పేషెంట్లకు అవగాహన కల్పించడానికి వైబ్రియానిక్స్ సైట్ లింక్ తో ఇమెయిల్ పంపడానికి అనుమతి ఉందా? స్కైప్ మొదలైన వాటితో వైబ్రియానిక్స్ గురించి నేను వారితో మాట్లాడవచ్చా?
జవాబు: తప్పకుండా, మీరు స్కైప్, ఇమెయిల్, లేదా ఫోన్ ద్వారా సాయి వైబ్రియానిక్స్ గురించి వారికి చెప్పవచ్చు. మరియు వార్తాలేఖలు చదవమని వారిని ప్రోత్సహించవచ్చు. మన వెబ్సైట్ అందరికీ చదవటానికి ఉచితంగా లభిస్తుంది. మీరు మీ రోగులకు మరియు సాయి భక్తులకు మరింత సమాచారం పంపాలనుకుంటే మా వద్ద ఫ్లైయర్ కూడా అందుబాటులో ఉంది.
_____________________________________