Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా. జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 13 సంచిక 3
మే / జూన్ 2022


ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

ఇటీవలే ఆరాధన మహోత్సవం గడిచిపోయి ఈశ్వరమ్మ దినం సమీపిస్తోంది - ఈ రెండు సందర్భాలు అత్యంత  పవిత్రమైనవి. మన సాయిమాతను మరియు వారి తల్లి మాతృశ్రీ ఈశ్వరమ్మను గౌరవించడానికి ఈ పండుగను అపారమైన భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటాము. ఆరాధన దినోత్సవం సందర్భంగా, మనము స్వామి జీవితాన్ని మరియు  ప్రేమ & సేవ మూల స్తంభాలుగా కలిగిన వారి ప్రబోధనలను గుర్తుచేసుకుందాము. స్వామి ఇలా అంటారు “మానవాళికి చేసే సేవ పవిత్రమైనప్పటికీ, అది భగవంతుని యొక్క ఉన్నతమైన ఆదర్శంలో విలీనం చేయబడి, అందరిలో అంతర్లీనంగా ఉన్న భగవంతుడిని దర్శిస్తూ, అందరి రూపంలో ఉన్న భగవంతుడిని ఆరాధిస్తే తప్ప, ఎటువంటి లాభము లేదు. మనిషికి  దైవత్వంపై పూర్తి విశ్వాసం ఉండాలి, మరియు భగవంతుని నిరంతర చింతనతో సేవ చేయాలి”...సత్యం శివం సుందరం సంపుటి 1, అధ్యాయం 14, p191. ఇదే  స్వామివారి విజన్. సేవా మార్గాన్ని చేపట్టిన వారికి ఇది స్ఫూర్తిదాయకంగా ఉండాలి. భగవంతుని తల్లి అయిన ఈశ్వరమ్మ, స్వామి సందేశంలో అత్యంత ప్రధానమైన ప్రేమ మరియు త్యాగమునకు ప్రతిరూపం. స్వామి మాట్లాడుతూ, “ఈశ్వరమ్మ చనిపోయే ముందు, నేను ఆమె కోరికలన్నీ తీర్చాను. మా సంస్థల్లో ఎలాంటి రుసుము లేదు. ప్రతీ ఒక్కరికీ విద్య పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. మా ఆసుపత్రులలో కూడా అంతా ఉచితమే”. ఈశ్వరమ్మ ద్వారానే స్వామి మనకు సేవ చేయడమే ఆరాధన అనే వైఖరిని ప్రబోధించారు. తన జీవితమే తన సందేశమని బాబా ప్రకటించారు. కాబట్టి, ‘’’వారి సన్నిధిలో ఉండటం, వారి కరుణ, వారి సరళత, వారి శ్రద్ధ, అంతర్దృష్టి, వారి ప్రేమను గమనించడం, సంపూర్ణతను మరియు స్వేచ్ఛను ఆకాంక్షించే వ్యక్తికి ఒక విలువైన అవకాశం...సత్యం శివం సుందరం వాల్యూం 3, అధ్యాయం 7, పేజి 89.

రెండు సంవత్సరాల ఆంక్షలు మరియు అనిశ్చితి తరువాత, జీవితం దాదాపు పూర్తిగా సాధారణ స్థితికి మారింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో మన వైద్య సేవా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుతున్నాయి. ఇప్పుడు మన క్లినిక్‌లు మరియు మెడికల్ క్యాంపు కార్యకలాపాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఇందులో గురువారం హైదరాబాద్‌లోని శివమ్‌లో క్లినిక్, ముంబైలోని ధర్మక్షేత్రలో శనివారం క్లినిక్, SSSIHMS వైట్‌ఫీల్డ్‌లోని వెల్‌నెస్ సెంటర్‌లో వీక్లీ క్లినిక్ మరియు ఇంటర్నేషనల్ సెంటర్  న్యూ ఢిల్లీలో ఆదివారం క్లినిక్ ఉన్నాయి. మా 108CC బాక్స్ ఛార్జింగ్ సెషన్‌లు కూడా కర్నాటకలో ఏప్రిల్ 9న ప్రారంభించబడిందని, ఆ తర్వాత ఏప్రిల్ 23న ముంబైలో ప్రారంభించబడిందని తెలపడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. పుట్టపర్తిలో, మహమ్మారి సమయంలో కూడా మనము సామాజిక దూర నిబంధనలను అనుసరిస్తూనే రీఛార్జ్ సెషన్‌లను కొనసాగించాము.

కష్టకాలంలో కూడా అవకాశాలను గుర్తించడమే చాలా ప్రధానం. క్రమము మరియు గందరగోళం అనే ధృవాల మధ్య జీవితం తిరుగుతూ ఉంటుందనేది వాస్తవం. కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన గందరగోళం మరియు రుగ్మతకు మన వైబ్రియానిక్స్ మిషన్ యొక్క క్రమానుగత అనుసరణ ఈ ఉన్నత దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది జీవిత పరిణామ క్రమంలో అవసరమైన భాగం. రోగనిరోధక శక్తి బూస్టర్ (IB) యొక్క అభివృద్ధి మరియు భారీ-స్థాయి పంపిణీ, మన ప్రసార నమూనా యొక్క విజయం మరియు విస్తరణ, మొదటి అంతర్జాతీయ వైబ్రియానిక్స్ కాన్ఫరెన్స్‌తో సహా అన్ని కేసు చరిత్రల పూర్తి డిజిటలైజేషన్, https://vibrionics.org/?page_id=4046 మరియు భారతదేశంలోని మన పోస్టల్ నెట్‌వర్క్‌ని 8 నుండి 43 ప్రాక్టీషనర్‌లకు పెంచడం వంటివి అన్నీ చెప్పుకోదగ్గ కార్యక్రమాలు. ఇవి మన సంస్థాగత మరియు ఆపరేటింగ్ మోడళ్ళు  మహమ్మారి నుండి బలంగా బయటకు వచ్చి మరింత సమర్థవంతంగా ఎలా అభివృద్ధి చేయబడ్డయో చూపుతాయి.  

మాతృభాషలో మన AP శిక్షణా కార్యక్రమం అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది. మొత్తం తొమ్మిది APలు (ఐదుగురు హిందీ మరియు నలుగురు తెలుగు మాట్లాడేవారు) వారి సంబంధిత మెంటర్‌ల ఆధ్వర్యంలో తమ ప్రొబేషనరీ పీరియడ్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. వారు ఇప్పుడు మారుమూల గ్రామాలు మరియు కమ్యూనిటీలలో అట్టడుగు స్థాయిలో ప్రభావం చూపడానికి సిద్ధంగా ఉన్నారు. AP నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడానికి ఫీడ్‌బ్యాక్ మరియు సమాచారాన్ని పంచుకునే సాధారణ వ్యవస్థ అమలులో ఉంది. సమీప భవిష్యత్తులో, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల నుండి AP అభ్యర్థుల కోసం మరిన్ని వర్క్‌షాప్‌లను ప్లాన్ చేస్తున్నాము. మాకు అందిన సమాచారం ప్రకారం ప్రవేశ ప్రక్రియ మరియు శిక్షణ వ్యవధి తక్కువగా ఉన్నందున ఈ శిక్షణా కార్యక్రమం విస్తృతంగా ప్రశంసించబడుతున్నట్లు తెలుస్తోంది. మేము ఇప్పుడు అంకితభావం గల వ్యక్తులకు వారి మాతృభాషలో శిక్షణ ఇవ్వగలుగుతున్నాము. ఇది భవిష్యత్తులో గరిష్ట సామాజిక ప్రభావంతో వైబ్రియానిక్స్ యొక్క వృద్ధికి మార్గం సుగమం చేస్తుందని మేము ధృఢంగా విశ్వసిస్తున్నాము.

ప్రశాంతి నిలయంలో IB పంపిణీ మార్చి 2020లో ప్రారంభించబడింది మరియు ఫిబ్రవరి 2021 నుండి ప్రతీ సేవాదళ్ సభ్యుడు IBలను పొందాడు. అయితే, కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గిన దృష్ట్యా, ఈ పంపిణీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇటీవల నిర్ణయించారు. అవసరం వచ్చినప్పుడు ఇది పునఃప్రారంభించబడుతుంది.

స్వామి మనల్ని శాంతి స్వరూపులుగా సంబోధిస్తారు, ఎందుకంటే వారు మన ప్రతీ ఒక్కరిలోని అంతర్గత స్వరూపాన్ని చూస్తారు. నిజానికి స్వామి మనలో ఒక అంతర్భాగమే. "అందరిలో సాయి ఉన్నాడు; కాబట్టి, ప్రతి ఒక్కరికీ, శాంతి ప్రధానమైనది”...ప్రొఫెసర్ కస్తూరి 108 విలువైన రత్నమాల 4వ ఎడిషన్, 1979, పేజీ 107-8. ఈ బోధనను ఆచరణలో పెట్టడానికి, భారతదేశానికి చెందిన 18 మంది SVPల బృందం 6 మార్చి 2022న రష్యా మరియు ఉక్రెయిన్‌లో యుద్ధములో -దెబ్బతిన్న ప్రాంతాలకు రోజువారీ దైవిక స్వస్థత ప్రకంపనలను ప్రసారం చేయసాగడం విశేషం. మనము ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలను కూడా ప్రసారం చేస్తున్నాము. ప్రేమ, సామరస్యం మరియు సహకారముతో కూడిన యుగం త్వరలోనే యుద్ధం, ద్వేషం మరియు దురాశలతొ నిండిన పరిస్థితిని తొలగింప చేస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. అన్నింటికంటే ముఖ్యం అలా చేయగలిగేది మరెవరో కాదు మన సాయి మాత మాత్రమే అని గ్రహించాలి. "ఈ ప్రపంచంను రక్షించడానికి భగవంతుని నామం కంటే శక్తివంతమైనది ఏదీ లేదని గుర్తుంచుకోండి. ప్రపంచాన్ని రక్షించేది ఆయుధాలు, బాంబులు కాదు. భగవంతుని దయ మాత్రమే ప్రపంచాన్ని రక్షిస్తుంది."...సత్యసాయి ప్రసంగం సంపుటం 24 p34.

మీ ఆచరణలో మరియు జీవితంలో మీకు అపారమైన ప్రేమ మరియు శాంతి ఉండాలని  

ప్రేమతో

సాయిసేవ లో మీ

జిత్ కె అగర్వాల్