డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 11 సంచిక 1
January/February 2020
ప్రియమైన చికిత్సానిపుణులకు,
మరొక అద్భుతమైన సంవత్సరం గడిచిపోయింది. 2019 సంవత్సరంలో మనం నేర్చుకున్న జ్ఞానానికి మనం పొందిన అనుభవానికి మనం సాధించిన ప్రగతికి మన ప్రభువైన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. నూతన సంవత్సరంలో ప్రవేశించిన ఈ శుభసందర్భంలో అందరికీ ఆనందం, ఆరోగ్యం మరియు విజయం కలగాలని భగవంతుని ప్రార్థిద్దాం. అయితే కొంతమందికి ఈ వసుదైక ప్రార్థనలో ఉన్న అసలు రహస్యం అర్థంకాక అవగాహన లేక దాని గురించి ఆలోచించడంగానీ అర్థం తెలుసుకోవాలనే ప్రయత్నంగానీ చేయరు. ప్రయోజనకరమైన జీవనానికి కావలసిన మూలము ఆ ప్రార్థనలోనే ఉంది. భగవాన్ బాబావారు ఆంతరంగికముగా లోతుగా విచారించి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ప్రోత్సహిస్తూ అర్థవంతమైన జీవితం గడపటానికి వారు మనకు అనేక ఆధారాలు ఇచ్చారు. స్వామి మాటల్లో “మీరు సేవను చేపట్టాలి. నిజానికి తోటి మానవులకు సేవ చేయడానికే మీకు చేతులు ఇవ్వబడ్డాయి…. మీరు మంచిపనిని చేపట్టినప్పుడు మీరు మీ జీవితంలో శాంతిని పొందుతారు.... భగవంతుడు నీవుచేసే ఆరాధన మరియు ఇతర సాధనాలపై (ఆధ్యాత్మిక పద్ధతులపై) ఆసక్తి చూపడు…. భగవంతుడు ప్రేమ మరియు సేవ పట్ల మాత్రమే ఆసక్తి కలిగి ఉంటాడు. మీరు గుర్తించగలిగితే ఈ రెండింటి యొక్కగొప్పతనాన్ని గుర్తించి తదనుగుణంగా ప్రవర్తించండి ఇంతకంటే మహత్తరమైన సాధనం మరొకటి ఉండదు ....శ్రీ సత్య సాయి బాబా నూతన సంవత్సర దివ్యవాణి, 2004 జనవరి 1
2019 సంవత్సరంలో వైబ్రియానిక్స్ సంస్థను బలోపేతం చేస్తూ దీర్ఘకాలిక లక్ష్యాల పట్ల పురోగతి సాధిస్తూ ఉన్నత శ్రేణికి సంబంధించి కఠినమైన నాణ్యతా ప్రమాణాలను అమలు పరుస్తూ సేవాసాధనలోనాణ్యతనుపాటిస్తూ కొన్ని అద్భుత కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. చేపట్టిన అనేక కార్యక్రమాలలో కొన్నిటిని పూర్తి చేయడం జరిగింది. ఈ క్రింద కొన్ని కార్యక్రమాల సమాచారం ఇవ్వబడింది.
1. వెబ్సైట్లు సమాచార సేకరణ: మా అడ్మిన్ కోర్ గ్రూపులోనికి కొత్తగా వచ్చిన చికిత్సానిపుణుడు 03560 మొత్తం మూడు సైట్లలోని విషయాలను మిళితంచేసి 2 కొత్త వెబ్సైట్లుగా ఒకటి ప్రజలకు మరొకటి అభ్యాసకులకు ఉపయోగపడే విధంగా క్రమబద్ధీకరించే అద్భుతమైన పనులు చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఈ శాఖలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ ప్రాక్టీషనర్లు ఈపనిలో వీరికి సహాయపడుతున్నారు.
2.నూతన అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియ మరియు ప్రస్తుతం కొనసాగుతున్న శిక్షణా విధానము: ప్రవేశ విధానాన్ని సరళతరం చేసి నూతన అభ్యర్థులకు సహాయపడటానికి వీలుగా అసిస్టెంట్ ప్రాక్టీషనర్ AP అనే కొత్త విధానాన్ని రూపొందించడం జరిగింది. కంప్యూటర్ జ్ఞానముపై అవగాహన లేనివారు మరియు ఆన్లైన్ కరస్పాండెన్స్ కోర్సు లేనివారు కోసం కొత్త సంక్షిప్త మాన్యువల్ సంకలనం చేయబడింది. పునశ్చరణ తరగతులకు హాజరు కావాలనుకునే వారికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. మేము కొత్త దరఖాస్తుదారుల కోసం వీడియో ఇంటర్వ్యూలను కూడా ఉపయోగించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెంటర్ లకు మరియు ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాము.
3. AVP మ్యాన్యువల్ ఇప్పుడు హిందీ మరాఠీ కన్నడ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉన్నది. మరియు108సిసి పుస్తకం మరాఠీ మరియు తెలుగు భాషలోనికి అనువదించబడింది.
4. అంకితభావం గల మా అభ్యాసకులు రోటావ్యవస్థ ద్వారా ప్రశాంతి నిలయంలోని లేడీస్ మరియూ జెంట్స్ సేవాదళ్ భవనాలలో రెగ్యులర్ వైబ్రియానిక్స్ క్లినిక్ లను నిర్వహిస్తున్నారు 2019లో మొత్తం 12714 మంది రోగులకు చికిత్స చేయడం జరిగింది.
5. వై బ్రియానిక్స్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్: స్వామి తమ భౌతిక దేహం చాలించే ముందు నేను మన వార్షిక నివేదికతో పాటు మన వైబ్రియానిక్స్ యొక్క విజన్ స్టేట్ మెంట్ కూడా స్వామికి సమర్పించాను. భగవాన్ ఆశీర్వాదం మరియు అనుగ్రహంతో ప్రతీ గ్రామంలోనూ ప్రతీ సాయి సెంటర్ లోనూ ఉచితముగా వైబ్రియానిక్స్ వైద్యం అందుబాటులో ఉండాలని మన మాతృభూమి లోనేకాక ఇతర దేశాలలోనూ వైబ్రియనిక్స్ విస్తృతంగా వ్యాపించాలని మనం కోరుకుంటున్నాము. అలాగే అభ్యాసకులు మరియు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి మరియు వైబ్రియానిక్స్ నివారణల యొక్క మరింత అభివృద్ధి కోసం పరిశోధనలు నిర్వహించడానికి విద్య మరియు పరిశోధనా కేంద్రాన్ని పుట్టపర్తిలో ఏర్పాటు చేయాలని స్వామిని ప్రార్థిస్తున్నాము. స్వామి మనకోసం నిర్దేశించిన లక్ష్యాలు మరియు పనులను నెరవేర్చడానికి స్వామి చేతిలో పరిపూర్ణ సాధనములుగా మారాలని స్వామిని ప్రార్ధిస్తున్నాను. భగవాన్ బాబా యొక్క ఆశీర్వాదాలను అందుకుంటూ ధ్యానంలో వారి మార్గదర్శకత్వం పొందిన తర్వాత పుట్టపర్తిలో వైబ్రియానిక్స్ కేంద్రాన్ని నిర్మించడానికి భూమి సేకరించబడింది. త్వరలో నిర్మాణాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రణాళిక కోసం దరఖాస్తును సమర్పించే ప్రక్రియలో ఉన్నాము కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్దిష్ట పనుల కోసం స్వచ్ఛందంగా పనిచేయాలనుకునే అభ్యాసకులను [email protected].కు ఈ మెయిల్ ద్వారా నేరుగా నన్ను సంప్రదించమని ఆహ్వానిస్తున్నాను.
6.అంతర్జాతీయ సమావేశము: తగినంత వాలంటీర్లు ఉన్నట్లయితే రెండవ అంతర్జాతీయ లేదా యూరోపియన్ వైబ్రియానిక్స్ సదస్సును 2020లో నిర్వహించాలని ఆశిస్తున్నాము.
7. మన వార్త లేఖలోని ‘‘అదనంగా” విభాగములో వివరించినట్లుగా కొంతమంది అభ్యాసకులు అవగాహన మరియు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇటువంటి శిబిరాల ప్రభావము స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు అందరూ తమ అభ్యాస అవకాశాలను విస్తృతం చేసుకోవచ్చు అలాగే వివిధ సంస్థలు, ఫోరమ్లు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు మొదలైన వాటిలో ఇలాంటి శిబిరాలను నిర్వహించడం ద్వారా వైబ్రియానిక్స్ ను వ్యాప్తి చేయవచ్చు. [email protected] నుండి సూచనలు, మార్గదర్శకత్వం తీసుకున్న తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సహాయంతో సీనియర్ అభ్యాసకులు ఇటువంటివి నిర్వహించవచ్చు. వైబ్రియానిక్స్ ప్రయోజనాలు మరియు నివారణల గురించి మాత్రమే కాక వైబ్రియానిక్స్ యొక్క విధి విధానాలు, అభ్యాసకునిగా మారడానికి ఉన్న అవకాశాలు దాని విధానము కూడా వివరించాలి. అంతేకాక ప్రతీ అభ్యాసకుడు (ఉత్సాహవంతులైన తనపేషంట్లకు ప్రాధాన్యత ఇస్తూ) ఆసక్తిగల వ్యక్తిని అభ్యాసకునిగా మార్చడానికి ప్రయత్నించాలి. 2020 మనకుమరువలేని సంవత్సరంగా మార్చడానికి ప్రణాళికలు వేసుకుందాం. నిస్వార్ధ వైద్యం కోసం సేవా సరిహద్దులను దూరం జరపడానికి కట్టుబడి ఉందాం.మనమంతా ఒక జట్టుగా రూపొందితేనే ఇది సాకార మవుతుంది. 2003 జనవరి 1న స్వామి మాట్లాడుతూ... “ఆధ్యాత్మికత అనేది వ్యాపార కార్యకలాపం కాదు. ఆధ్యాత్మికత ఒక దైవిక భవనం ఇది ఐక్యతతో ముడిపడి ఉంది. వైవిధ్యంలో ఐక్యతే మీకు ఆనందాన్నిస్తుంది ఐక్యత యొక్క ఈ సూత్రాన్ని మీరు పెంపొందించు కోవాలని నేను కోరుకుంటున్నాను, అప్పుడే మీరు చేపట్టిన సేవ విలువనూ,పవిత్రతనూ పొందుతుంది” https://saispeaks.org/article/244.ఈ వ్యాఖ్యను స్వామి మాటలతోనే ముగించాలని అనుకుంటున్నాను ‘’మీ జీవితాన్ని ప్రేమ భాషలో నిశ్శబ్దంగా మాట్లాడే గులాబీని చేయండి,సర్వ జీవరాశికి దాని పరిమళాన్ని పంచండి”
మీ అందరికీ పవిత్రమైన మరియు ఆనందకరమైన 2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు
సాయికి ప్రేమపూర్వక సేవలో
జిత్. కె. అగర్వాల్