ప్రశ్న జవాబులు
Vol 9 సంచిక 6
November/December 2018
ప్రశ్న 1: పరిశుద్ధమైన ఇథనాల్ 108 సిసి బాక్స్ లోని రెమిడీ లకు కలిపి షేక్ చెయ్యడం ద్వారా ఎంతకాలం వీటి యొక్క లైఫ్ స్పాన్ పెంచవచ్చు?
జవాబు: మీరు చెప్పిన విధానం లో సీసీ బాటిల్ యొక్క లైఫ్ 2-3 సంవత్సరాలు పెంచ గలిగినప్పటికీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 108 బాక్స్ రీఛార్జి చేసుకోవాల్సిందిగా మా సూచన. కారణం ఏమిటంటే మా పరిశోధనా బృందం ఎప్పటికప్పుడు సీసీ బాక్స్ ని అప్డేట్ చేస్తూ ఉన్నారు కనుక క్రమం తప్పకుండా సీసీ బాక్స్ రీచార్జ్ చేసుకోవడం తప్పనిసరి.
________________________________________
ప్రశ్న 2: 108 సిసి బాక్స్ ను విమానంలో తరలించే టప్పుడు ఎత్తయిన ప్రదేశంలో లో రేడియేషన్ నుండి పాడవకుండా చూడటానికి మరియు ఎయిర్ పోర్ట్ లో చెక్ చేసే X రే మిషన్ లను నుండి రక్షించడానికి ఈ బాక్స్ ను అల్యూమినియం రేపర్ తో తీసుకు వెళ్లడం అవసరమా ?
జవాబు: అవసరం లేదు గతంలో అల్యూమినియం ఫోయిల్ చుట్టడం ద్వారా రెమిడీ లను రేడియేషన్ నుండి కాపాడవచ్చు అని మేము భావించాము. కానీ ఇది పేషెంట్లలో ఒక తప్పుడు అభిప్రాయాన్ని పెంచుతుంది ఏమంటే వారు తమ రెమెడీలను ఈ రేపర్ తో రేడియేషన్ దగ్గరగా తీసుకురావడం ద్వారా అవి పనిచేయకుండా పోతున్నాయి. కారణం ఏమిటి అంటే పదేపదే అల్యూమినియం ఫోయిల్ ను తెరవడం ద్వారా, మరియు ఈ అల్యూమినియం పొరకు ఏర్పడే కంటికి కనపడని సూక్ష్మ రంధ్రాల ద్వారా రేడియేషన్ లోపలికి చొరబడి రెమిడీలకు హాని కలిగించవచ్చు లేదా వాటి యొక్క శక్తిని తగ్గించవచ్చు.
________________________________________
ప్రశ్న 3: విటమిన్ సప్లిమెంట్ గా లేదా మల్టీ విటమిన్ సప్లిమెంట్ గా ఇవ్వటానికి మన 108 సి సి బాక్సులో లో ఏదైనా రెమీడీ ఉన్నదా ? మధ్య ప్రాచ్య ప్రాంతాల్లో ముఖ్యంగా గా విటమిన్ డి 3 యొక్క అవసరం బాగా ఉన్న వారికి ఏమి సూచించ వచ్చు?
జవాబు: CC12.1 Adult tonic or CC12.2 Child tonic ఈ రెండు కూడా అ మీకు విటమిన్ సప్లిమెంట్ గా ఉపయోగపడతాయి. 2017 లో సీసీ బాక్స్ లో ఉండే రెమెడీలను రివైజ్ చేసి మీరు చెప్పిన పద్ధతి కి అనుగుణంగా ఉండే విధంగా చేయడం జరిగింది అయితే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ రెమిడీలు వైబ్రేషన్స్ మాత్రమే ఇవి విటమిన్లకు ప్రత్యామ్నాయం కావు. ఇవి మనం ఆహారం ద్వారా తీసుకునే విటమిన్లను పూర్తిగా సద్వినియోగం లేదా ఎక్కువగా శరీరానికి ఉపయోగ పడే విధముగా చేస్తాయి తప్ప విటమిన్లకు ప్రత్యామ్నాయంగా ఉండలేవు.
________________________________________
ప్రశ్న 4 : నేను తరచుగా నా నెలవారీ రిపోర్టును ఆన్లైన్ చేయడం మర్చిపోతున్నాను. మరి నేను ను మా కోఆర్డినేటర్ కు పంపించడం లేదా మంత్లీ రిపోర్ట్ ఈ మెయిల్ సైటుకు నా రిపోర్ట్ లను పంపించవచ్చా ?
జవాబు: మంత్లీ రిపోర్ట్ ఆన్లైన్ చేయడానికి కావలసిన వెబ్సైట్ తయారుచేయడానికి ఎంతో సమయము ప్రయత్నము వెచ్చించ వలసి వచ్చింది. ఈ సైట్ రూపొందించడంలో ప్రధాన ఉద్దేశ్యము చికిత్సా నిపుణులు ఎప్పటికప్పుడు తమ సేవా గంటలను పేషెంట్ల వివరాలను అప్ టు డేట్ గా ఉంచుకొనే వెసులుబాటు కల్పించడం. గతంలో మాదిరిగా ఐదు రకాల నంబర్లను ఫీడ్ చేసే బదులు ఇప్పుడు కేవలం రెండు రకాల నెంబర్లను అనగా సేవా గంటలు పేషెంట్ల సంఖ్య ఇంత వరకు మాత్రమే ఫీడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు మీ సెల్ ఫోన్, ట్యాబ్లెట్, లాప్టాప్ దేని నుండైనా నెలవారి వివరాలు నమోదు చెయ్యవచ్చు. మీరు చెయ్యవలసిందల్లా ఇంటర్నెట్ ద్వారా https://practitioners.vibrionics.org, సైట్ కు వెళ్ళి సైన్ చేసి వివరాలు నమోదు చెయ్యడమే. మీ సమాచారము అప్డేట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. మీ ఫోన్ లో క్యాలెండర్ ఉంటే ఒకటో తారీకుకు మీకు మీరే అపాయింట్మెంట్ సెట్ చేసుకొని ఆ సైట్ లో వివరాలు నమోదు చేయవచ్చు. అందుచేత సాధ్యమైనంత వరకూ ఈ మెయిల్ ద్వారా మాత్రం రిపోర్టులు పంపకండి.
________________________________________
ప్రశ్న 5: అనివార్య కారణాలవలన నేను నెలలో 1 వ తేదీన నా మంత్లీ రిపోర్టును అప్డేట్ చేయలేకపోతే ఆ తర్వాత సైట్ బంద్ అయిపోయినట్టుగా భావించి తర్వాత నెల వరకు ఏమీ చేయకుండా ఉండాలా ?
జవాబు: లేదు మీరు ఏ సమయంలో నైనా సైట్ కు వెళ్లి మీ మంత్లీ రిపోర్టును అప్లోడ్ చేసుకోవచ్చు. ఒక వినయపూర్వక విన్నపం ఏమిటి అంటే మీరు ప్రాక్టీషనర్ ఓత్ తీసుకున్నప్పుడు ప్రతి నెల 1 వ తేదీన రిపోర్టు సబ్మిట్ చేస్తానని భగవంతుడికి ప్రామిస్ చేసి ఉన్నారు ఒకవేళ మీకు ఆ నెలలో పేషెంట్ల సంఖ్య సున్నాగా ఉన్నట్లయితే సున్నా అనే అప్డేట్ చేయండి. ఒక శుభవార్త ఏమిటంటే ఈ విధంగా చేయడం వలన మా హీలర్ ఇన్ఫో టీం మీకు కొత్త పేషంట్లను సూచిస్తుంది.