ప్రశ్నజవాబులు
Vol 9 సంచిక 4
July/August 2018
1.ప్రశ్న: అంతర్జాతీయ సాయి వైబ్రియోనిక్స్ సంస్థ (IASVP)లో నేను ఎలా చేరగలను?
జవాబు: సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ నెలవారీ రిపోర్టులు క్రమం తప్పకుండా పంపించే సాయి వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్లందరూ (AVP లు తప్ప) IASVP లో సభ్యత్వం పొందవచ్చు. మీ ఐదు అంకెల రిజిస్త్రేషన్ నంబరు మీ లాగిన్ ఐడి గా మీ పాత పాస్ వర్డ్ ను ఉపయోగించి https://practitioners.vibrionics.org సైట్ లో లాగిన్ అవ్వండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ లేకపోతే ‘‘ఫర్గెట్ పాస్వర్డ్ “ ను క్లిక్ చేయడం ద్వారా మీ పాస్వర్డ్ ను పొందవచ్చు. ఆలా లాగిన్ అయ్యిన తర్వాత మీ వ్యక్తిగత వివరాలు అప్డేట్ చేసుకోండి. దానిలో ఉన్న వివరాలను విపులంగా చదివిన తర్వాత ఇటీవలే తీయించుకున్న (భుజాలవరకు ఉన్న) ఫోటోతో పాటు ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించండి. ఫోటో 50kB నుండి 300Kb వరకూ ఉన్నది మాత్రమే అంగీకరించబడుతుంది. అనంతరం IASVP సెక్రటరీ నుండి మీరు ఐడి కార్డు ఎలా పొందగలరో సూచిస్తూ ఇమెయిల్ వస్తుంది. AVP లు మాత్రం సరళంగా ఉండే ఒక చిన్న ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్నత పొందిన తర్వాత మాత్రమే VP అవుతారు. మరిన్ని సూచనల కోసం [email protected] కు ఇమెయిల్ పంపండి.
________________________________________
2. ప్రశ్న: తాచ్ యాన్ చికిత్స తీసుకుంటున్న ఒక పేషంటుకు వైబ్రో చికిత్స చేయవచ్చా?
జవాబు: మా సూచన ప్రకారం కనీసం అరగంట తేడాతో (గంట విరామం ఉంటే ఇంకా మంచిది) ఈ రెండింటిని వాడవచ్చు. ఇలాంటి ఇతర శక్తి ప్రాధాన్యత చికిత్సల విషయంలో కూడా ఇదే సూచన వర్తిస్తుంది.
________________________________________
3. ప్రశ్న: వైబ్రియోనిక్స్ రెమిడి లను బ్రాడ్కాస్టింగ్ చేస్తున్నప్పుడు పూర్తి నిడివితో ఉన్న కలర్ ఫోటో మాత్రమే ఉపయోగించాలా లేక నలుపు తెలుపు లో ఉన్న పాస్ పోర్ట్ సైజు ఫోటో కూడా అంతే ప్రభావవంతంగా పనిచేస్తుందా?
జవాబు: పూర్తి నిడివితో ఉన్న కలర్ ఫోటో ఉపయోగించ వలసిన అవసరం లేదు. ఐతే మా ఉద్దేశంలో పూర్తి నిడివితో ఉన్న ఫోటో పేషంటుకు సంబంధించిన ఎక్కువ సమాచారాన్ని అందిస్తుంది కనుక కలర్ ఫోటో వాడవలసినదిగా సూచిస్తాము. ఈ విషయంలో ప్రాక్టీషనర్ లు ఈ రెండు రకాల ఫోటోలను ఉపయోగించి పొందిన అనుభవాలకు చెందిన సమాచారాన్ని మాకు అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సూచన.
________________________________________
4. ప్రశ్న: వ్యాధి మరియు చికిత్స విషయంలో శరణాగతి యొక్క ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు: ఎవరయినా ఒక వ్యక్తి తీవ్రమైన జబ్బుతో ఉన్నప్పుడు శరణాగతి చేయడంలో అర్ధం అతను ఈ జన్మలో గానీ గత జన్మలో గానీ చేసిన తప్పులకు, చెడు ప్రవర్తనకు కర్మ సిద్ధాంతం ప్రకారము సంక్రమించిన ఫలితంగా భావించగలగడమే. కనుక తెలిసి గానీ తెలియక గానీ చేసిన తప్పులకు క్షమార్పణ అడగడం ద్వారా మీకు సంక్రమించిన వ్యాధిని ఒక పాఠం నేర్పే అనుభవంగా మార్చుకోవడము మరియు ఇదే భగవద్ సంకల్పము గా భావించి ప్రశాంతముగా ఉండడమే శరణాగతి.
“శరణాగతి అనగా: మన ఆలోచనలను మనం అనుభవించే బాధలనుండి, కష్టాలనుండి మళ్లించడమే శరణాగతి. ప్రతీ ఒక్కటి దేవుని సంకల్పము గానే భావించి ఆ ప్రేమ మూర్తి చేతిలో అంతా ఉంచి ఇలా ప్రార్ధించాలి. ‘’భగవంతుడా సర్వమూ మీ చేతిలో ఉంచాను నాకేది మంచిదో అదే ప్రసాదించండి."
________________________________________
5. ప్రశ్న: నేను ఇటీవలే AVP గా శిక్షణ పొంది యున్నాను. వైబ్రియోనిక్స్ గురించి అందరికీ తెలియజెప్పాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నాను. దీనికోసం నేను ఎలా ముందుకు సాగగలను? భగవాన్ బాబానే స్వయంగా ఈ చికిత్సా పద్దతిని ఆశీర్వదించినప్పటికీ సత్యసాయి సేవా సంస్థ వారు వైబ్రో చికిత్సా విధానానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు?
జవాబు: వైబ్రో చికిత్సా విధానము గురించి ప్రచారము చేయమని మేము సిఫారసు చెయ్యము. ఐతే దీని గురించి ముఖతః వెల్లడించదానికి అభ్యంతరం లేదు. సాయి భక్తులకు, ఆధ్యాత్మిక పిపాసులైనవారికి చికిత్స చేయడం మీకు సానుకూలంగా ఉంటుంది. ఆసక్తి ఉన్న వారికి ఫోన్ ద్వారా, స్కైప్ ద్వారా, ఈమెయిలు ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలియజేయవచ్చు.అలాగే వారికి మన వార్తాలేఖలను మెయిల్ చేయడం కూడా మీకు ఉపయోగపడుతుంది.
సత్యసాయిబాబావారు వైబ్రియానిక్స్ చికిత్సా విధానాన్ని పరిపూర్ణంగా ఆశీర్వదించారన్నది నూటికి నూరుపాళ్ళు సత్యము. అలాగే స్వామి ఆశీర్వాదాలు ఇప్పటికీ మనం అందుకుంటూనే ఉన్నాము. ఐతే సాయి సెంటర్ లలో లేదా వారి సమావేశాలలో మన క్యాంపులను అనుమతించనప్పటికీ సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షులు మన కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ భారత దేశంలోని సాయి సెంటర్ లలో వర్క్ షాప్ నిర్వహించుటకు అనుమతి నిచ్చారన్న విషయం డాక్టర్ అగ్గర్వాల్ గారు ఎంతో ఆనందంతో మనకు తెలియజేస్తున్నారు. వారు పంపిన లెటరు యొక్క కాపీని [email protected] కు రాయడం ద్వారా పొందవచ్చు
________________________________________
6. ప్రశ్న: CC17.2 క్లెన్సింగ్ కొంబో ద్వారా చికాకు, కోపము, భయము, ఆందోళన వంటి వాటికి మనం చికిత్స చేయవచ్చా ?
జవాబు: ఇటువంటి వ్యతిరేక భావోద్వేగాలకు అత్యంత ఫలప్రదమైన కొంబో CC15.1 Mental & Emotional tonic. ఇటీవల కాలంలో ఈ వ్యతిరేక భావనల బారిన పడి జీర్ణ సమస్యలతోను, అనిశ్చిత ఆహార అలవాట్ల తోనూ బాధపడుతూ ఉన్నారు. చాలామందికి ఆకలి లేకపోవడమో లేక శక్తి కోసం ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడడమో జరుగుతోంది. ఐతే ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. కనుక వారికి వారి భావోద్వేగాలు స్థిమిత మయ్యేవరకు CC4.10 Indigestion + CC15.1 Mental & Emotional tonic ఇచ్చి అనంతరం CC17.2 Cleansing ను ఒక నెలరోజుల పాటు ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ వారికి నిద్రలేమి సమస్య ఉంటే CC15.6 Sleep disorders. తో చికిత్స చేయడం మంచిది.