దివ్య వైద్యుని దివ్య వాణి
Vol 9 సంచిక 2
March/April 2018
“ప్రతి జీవి దేవునిచే సృష్టింపబడినదే అనే ధృడ విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకొని ఆ ప్రకారం నడుచుకోవాలి. ప్రతీ జీవిలోనూ దేవుడు ఉంటాడు. మన హృదయమే దేవుని కోవెల. దయను కలిగి ఉంటేనే అది హృదయమని పిలవ బడుతుంది. అందువలన దయను పెంచుకోండి. దయ గల హృదయముతో సేవ చేస్తే అది పవిత్రమవుతుంది. కనిపించే ప్రతీ మానవుని నడయాడే దేవుడని భావించండి. దేవుడు సర్వత్రా ఉన్నాడు. అట్టి దేవుని విడిచి అల్పమైన శారీరక ఆనందాల కోసం కాంక్షించడం అవివేకం. వాస్తవం ఏమిటంటే మనం నిజమైన ఆనందాన్ని శరీరముతో ఎన్నడూ పొందలేము, హృదయముతోనే అనంత ఆనందాన్ని పొందగలము."
-సత్యసాయిబాబా, “మానవ సేవే మాధవ సేవ ” దివ్య ప్రవచనము,1 జనవరి 2004
http://www.sssbpt.info/ssspeaks/volume37/sss37-01.pdf
‘‘ఆహారం మరియు వినోదపు అలవాట్లు అనారోగ్యమునకు రెండు ప్రధాన హేతువులు. హానికర ధోరణులు ఈ రెండింటినీ ప్రభావితం చేయకుండా ఉండటానికి ఎంతో శ్రద్ధ వహించడం అవసరం. ప్రస్తుతం, ఔషధాలు విస్తృతంగా వ్యాపించి ఆసుపత్రులు ప్రతీ వీధిలోనూ వాడలోనూ స్థాపింపబడినప్పటికినీ వ్యాధులు కూడా ఆ విధంగానే విస్తరించాయి. అసంబద్ధమైన ఆహారపు అలవాట్లు, కాలక్షేపమే ఈ పరిస్థితికి కారణము’’
-సత్యసాయిబాబా, “ఆసుపత్రులు మరియు వైద్యము ” దివ్యప్రవచనము, 28 ఆగస్టు 1976
http://www.sssbpt.info/ssspeaks/volume13/sss13-22.pdf