డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 9 సంచిక 2
March/April 2018
ప్రియమైన వైబ్రో అభ్యాసకులరా,
రాబోయే కొద్ది రోజులలో ఉగాది, రామ నవమి, గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలు ఒకదాని తరువాత మరొకటి వస్తున్న అత్యంత పవిత్రమైన సమయాన్ని పురస్కరించుకొని మీతో ఇలా నా భావాలను పంచుకొనడం ఎంతో ఆనందాన్ని అందిస్తోంది. ఇట్టి పవిత్రమైన పండుగల యొక్క ప్రాముఖ్యతను గురించి సాక్షాత్తు భగవంతుడే వివరించగా విని ధన్యుల మైన మనం మరొక్కసారి వాటిని పునరావలోకనం చేసుకొనడానికి శ్రీవారి ఉపన్యాసములలోని కొన్ని మధుర వాక్యాలను మననం చేసుకొందాం:
"నేడు ఉగాది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నూతన సంవత్సరం. ఈ క్షణం నుండి, చెడు ఆలోచనలు మరియు చెడు లక్షణాలను విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మీ హృదయాన్ని పరిశుద్ద పరుచుకోండి. అప్పుడు మాత్రమే మీ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మీరు ఒక్కక్షణం కూడా వేచి ఉండవలసిన అవసరం లేదు. సాయి చెప్పేది ఏదియో అది జరిగితీరుతుంది. సాయి భక్తులుగా ఉన్న మీరు స్వార్ధపరత్వం వీడి సమాజ సంక్షేమం కోసం మీ జీవితాలను అంకితం చేయాలి... " సత్య సాయి స్పీక్స్, వాల్యూమ్ 35
"ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి పండుగ వస్తూనే ఉంటుంది. కానీ దాని నిజమైన ప్రాముఖ్యత ఇప్పటివరకు మనకు అర్థం కాలేదు. మీరు రాముడిని ఒక రూపము గానే గుర్తించారు. కానీ రాముడు ఏ ప్రత్యేకమైన రూపానికి పరిమితం కాదు. అందరి హృదయాలలో ప్రతిఫలిస్తున్న ఆత్మయే రాముడు. రాముడు ఒక సాధారణ వ్యక్తి కాదు. మానవజాతి సంక్షేమం కోసం భూమిపై అవతరించిన దేవుడే రాముడు”...సత్య సాయి స్పీక్స్, వాల్యూమ్ 40
"ఈస్టర్ పవిత్ర పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ జరుపుకుంటారు. ఈ సమయంలో, యేసు యొక్క అనుచరులు శిలువపై అయన త్యాగాన్ని మూడు రోజుల తరువాత అతని పునరుత్థానమును ఎంతో కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకునే పండుగ ఇది "... ది ట్రెజర్ ఆఫ్ లైఫ్, సత్య సాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. (http://www.sathyasai.org/events/festival/easter-2017)
స్వామి యొక్క ప్రేమపూర్వక అనుగ్రహం ద్వారా. వారి యొక్క మిషన్ సాయి వైబ్రియోనిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులకు చికిత్స నందించడంలో భారీస్థాయిలో గణనీయమైన సంఖ్యతో అద్భుతంగా సాగుతోంది. ఐనప్పటికీ కొన్ని ప్రాంతాలలో రోగికి అందుబాటులో ప్రాక్టీషనర్ లేకపోవడం గమనించవలసిన విషయం. అటువంటివారి కోసం ఫోన్ లేదా స్కైప్లో రిమోట్ సంప్రదింపులకు సిద్ధంగా ఉండటానికి మరియు సిద్ధంగా ఉన్నవారికి వైబ్రియానిక్స్ ఒక చక్కని అవకాశాన్ని అందిస్తోంది. మేము అభ్యాసకుల నిమిత్తం రెండు నెట్వర్క్ లను ప్రారంభించాలనుకుంటున్నాము:
a. తమ దేశ పరిధిలోనే గుర్తించిన పేషంట్లకు తమ సేవలో భాగంగా రెమిడి బాటిళ్ళను పోస్టు చేయడం
b SVP లు తమయొక్క SRHVP ఉపయోగించి నివారణలు ప్రసారం చేయడం .ఐతే వారు రోగి యొక్క కలర్ ఫోటోను ప్రింట్ చేసి దానిని ఉపయోగించి బ్రాడ్కాస్టింగ్ చేయవలసిన అవసరం ఎంతయినా ఉంది. అలా సేవచేయడానికిగాను సిద్దంగా ఉన్న అభ్యాసకులు [email protected] ద్వారా మాకు తెలియజేయండి.
మన మిషన్ విజయానికి కారణాలు, చికిత్సలో మనం అనుసరిస్తున్న ఉన్నత ప్రమాణాలు అలాగే మనవద్దకు వచ్చే పేషంట్లందరికీ సాధ్యమైనంత వరకూ సేవ చేయడానికి ప్రయత్నించడం. దీనిని మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి అనుగుణంగా, కొత్త AVP లను ప్రవేశపెట్టడం, ప్రస్తుతం ఉన్నవారికి తిరిగి ఆధునిక పద్ధతులలో శిక్షణ నివ్వడం, మరియు నిష్క్రియాత్మకమైన వారిని ఉత్తేజపరచడం చాలా అవసరం. భారత దేశం లో ఎక్కువమంది అభ్యశకులు ఉన్నట్టి మహారాష్ట్ర రాష్ట్రంలో మన భారతీయ అభ్యాసకులు 10355&10001 ప్రేమతో మన AVP మాన్యువల్ ను మరాఠీభాష లోనికి అనువదించారు. ఈ విధంగా అక్కడి నిపుణులకు వారి స్థానిక భాషలో పఠనం మరింత సౌకర్యవంతమైనది గానూ ప్రయోజనకరముగానూ ఉంటుంది. మాన్యువల్ యొక్క ముద్రిత నకలును [email protected] ద్వారా పొందవచ్చు.
అన్ని విధులు సజావుగా నిర్వహిం చడానికి సంస్థ నిర్మాణమును పది విభాగాలుచేసి ఒక ప్రధాన బృందాన్నిఈ విభాగాలు నిర్వహించడానికి ఏర్పాటుచేయడం జరిగింది. ఈ విభాగాలు: IASVP సభ్యత్వం, డేటాబేస్ నిర్వహణ, టీచింగ్, అడ్మిషన్స్, ప్రమోషన్లు, వార్తాలేఖల తయారీ, అనువాదాలు, పరిశోధన, వెబ్సైట్ ఉత్పత్తి మరియు నిర్వహణ, మరియు సాధారణ పరిపాలన. ఐతే ఈ విభాగాలలో ఒకటి గానీ అంతకంటే ఎక్కువ విభాగాలలో సేవలందించడానికి మరియు ఎన్ని గంటలు ఈ సేవలో పాల్గొంటారో అనే విషయం 2018 ఏప్రిల్ 7 వ తేదీ నాటికి మన వెబ్సైటు [email protected] కు ఈమెయిల్ ద్వారా తెలియజేయ వలసిందిగా అభ్యర్థిస్తున్నాము.
నెలవారీ నివేదికలను మరింత సమర్థవంతంగా మరియు సౌకర్యవంతంగా సమర్పించడానికి అభ్యాసకులు వెబ్ సైట్లోనికి నేరుగా ప్రవేశించి వారి సేవా గంటలను నమోదుచేయడానికి వీలుగా ఏర్పాటుచేయడం జరిగింది. ఈ సౌకర్యాన్ని పొందడానికి [email protected] కు ఈమెయిల్ పంపడం ద్వారా మీకు కొన్ని సూచనలు వస్తాయి. వాటిని అనుసరించడం ద్వారా మీ సమాచారం అప్లోడ్ చేయబడుతుంది. అంతేకాకుండా మీ యొక్క వ్యక్తిగత సరికొత్త సమాచారాన్ని నమోదు చేయడానికి మీ కలర్ ఫోటోను అప్లోడ్ చేయడానికి కూడా దీనిలో అవకాశం కల్పింప బడింది. కనుక ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవలసిందిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాము.
ఇప్పుడు VP మరియు పై స్థాయి లో ఉన్నవారందరికీ IASVP లో సభ్యత్వాన్ని పొందడం తప్పనిసరి చేయబడింది. మీరు సభ్యత్వం కోసం అవసరమైన చర్యలు పూర్తి చేసి సంతకం చేసిన ఫారం పంపిన తర్వాత, మీరు ప్రాక్టీసు చేసుకోవడానికి చాలా సహాయకారిగా ఉండే ఒక ID కార్డును అందుకుంటారు. దయచేసి IASVP దరఖాస్తును నేరుగా అభ్యాసకుల వెబ్సైట్లో సమర్పించవచ్చని గమనించండి.
మీ అందరికీ ఆనందకరమైన ఉగాది, రామ నవమి మరియు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ,
ప్రేమతో స్వామిసేవలో,
మీ జిత్.కె.అగ్గర్వాల్.