Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 9 సంచిక 1
January/February 2018


ప్రియమైన చికిత్సా నిపుణులకు,

ఈ క్రొత్త సంవత్సరం ఒక అద్బుతమైన సంవత్సరం. ఈ 2018 సంవత్సరాన్ని ఆశావహమైన ధృక్పధంతో ఒక ప్రత్యేకమైన సంవత్సరం కావాలని ఆకాంక్షిస్తూ ... 1970 జనవరి 14 వ తేదీన స్వామి వారందించిన సందేశం తో ప్రారంభింపదలిచాను:

కాలెండరు తయారుచేసే వారు సంవత్సరాలను లెక్కవేసి ఇదిగో ఈరోజు కొత్త సంవత్సరం మొదటి రోజు లేదా న్యూ యిఎర్ డే అని నిర్ణయిస్తారు. నిజం చెప్పాలంటే సూర్యుని చుట్టూ భూమి తిరిగిన కాలాన్ని బట్టి వారు లెక్క గడతారు. దాని కన్నా జరిగిపోయిన కాలాన్ని సాధించిన పనితో ముడిపెట్టి న్యూ ఇయర్ డే నిర్ణయించడం శ్రేయస్కరం. ప్రతీ వ్యక్తికీ ఒక న్యూ ఇయర్ డే ఉంటుంది. అది ఏమిటంటే తాను ఈ భూమి మీద ఉండి సూర్యుని చుట్టూ తిరగడం ముగిసిన నాడు (ఈ జనన మరణ చక్రం నుండి విడుదలైన నాడు), అతని జ్ఞాన నేత్రం తెరువబడిన నాడు, అతనిలో విచక్షణ ఉదయించి బంధ విమోచనం జరిగిన నాడు అప్పుడే ఆ వ్యక్తికి న్యూ ఇయర్ డే..అంతః పరిశీలన ద్వారా భగవంతుడి సంకల్పాన్ని తెలుసుకో, వారి ఆజ్ఞను శిరసా వహించు, వారికి ఏ చర్య బాగా సంతృప్తి కలిగిస్తుందో తెలుసుకో అలా నిన్ను నీవు తీర్చి దిద్దుకో. లోభ, ద్వేష, భావాలతో నీ హృదయాన్ని రాయి లా తయారు కానివ్వకు. ప్రేమతో మృదువుగా చెయ్యి. ప్రేమ పూర్వక ఆలోచనలతోనే హృదయపు మలినాలను ప్రక్షాళన చెయ్యి. నీ హృదయాన్నే ఒక ఆలయంలా తీర్చిదిద్ది దానిలో అంతర్యామిని ప్రతిష్టించు. అలా  అంతరంగంలోనే రమిస్తూ సుజ్ఞాన అనందానుభూతులను అనుభవించు.”

2017వ సంవత్సరం మనకెన్నో విజయాలను అందించింది. కొన్ని సంవత్సరాలుగా అంకిత భావంతో మనవాళ్ళు అందిస్తున్న సేవల వలన చికిత్సా రంగానికి సంబంధించి సంస్థా పరంగా మన సామర్ధ్యాలను పెంపొందించుకోవడం విశేషం. ఈ దిశలో భాగంగానే 2004 లో రూపు దిద్దుకున్న SVP ల మార్గదర్శిని పుస్తకాన్ని అప్ టు డేట్ చేయడం, వార్తాలేఖలలో ‘‘జీవనవిధానము మరియు ఆరోగ్యము’’ అన్న అంశాన్ని తిరిగి చేర్చడం, బెంగుళూరు వైట్ ఫీల్డ్ లో ఉన్న సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో సాయివైబ్రియానిక్స్ ను వారి వెల్ నెస్ క్లినిక్ లో ఒక అంతర్భాగంగా చేయడం, ప్రాక్టీషనర్ ల వివరాలను డిజిటలైజ్ చేయడం (అనగా ఇప్పుడు ప్రాక్టీషనర్ లు తమ వ్యక్తిగత వివరాలలో మార్పులు చేర్పులు చేసుకోవడం, తమ ఫోటోను కూడా అప్లోడ్ చేసుకోవడం  IASVP మెంబెర్ షిప్ కు దరఖాస్తు చేయడం, మాస నివేదికలను ఈ వెబ్సైట్ కే పంపడం వంటి వెసులుబాటు కల్పించ బడింది), అమెరికా లో మన రిమోట్ బ్రాడ్కాస్టింగ్ ను విస్తరించడం, వైబ్రియానిక్స్ శిక్షణ మరియు మెంటరింగ్ రంగాలను విస్తృత పరిచే దిశలో కూడా మార్గదర్శకాలు రూపొందించబడడం ఇవన్నీ కూడా విజయ సోపానాలే.

ఈ 2018 ని మనందరి సమష్టి కృషితో ఒక మరపురాని సంవత్సరముగా మలచమని భగవాన్ బాబా వారిని ప్రార్ధిస్తున్నాను. మన మిషన్ క్రొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది. మనం ఇప్పటికే  మన ఆన్లైన్ డేటాను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడం, ఆన్లైన్ శిక్షణను ఎక్కువ స్థాయికి విస్తరించడం, పరిశోధనా రంగాన్ని అనేక వ్యాధులకు (మొక్కలు, జంతువులలో కూడా) చికిత్స నందించే దిశగా మరల్చడం, మరియు మన సంస్థను గూర్చి మన కార్యక్రమాల గురించి సమాజంలో ఇంకా వీటి గురించి తెలియని అట్టడుగు వర్గాలకు కూడా మన క్లినిక్కులు, మెడికల్ క్యాంపులను విస్తరించడం ద్వారా సమాచారం చేరవేయడం వంటి అనేక బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము. వీటన్నింటికన్నా కూడా  మన వైబ్రియానిక్స్ రంగాన్ని ఇప్పటికే సుస్థిరంగా విస్తరించి ఉన్న అలోపతి వంటి వైద్య రంగ స్థాయికి తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగడానికి వైబ్రియానిక్స్  ఎలా పనిచేస్తుందో, ఎలాంటి అద్భుత ఫలితాలను అందిస్తూ ఉందో వంటి విషయాల పట్ల మనకు సంపూర్ణ అవగాహన ఉండాలి. దీనికోసం మనం భౌతిక శాస్త్రంలో క్వాంటం మెకానిక్స్/భౌతిక శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చెయ్యాలి. కనుక దీనిపట్ల అవగాహన, అభిరుచి ఉండి నిస్వార్ధంగా సేవ చెయ్యాలనుకునే ప్రాక్టీషనర్ లు ముందుకు వచ్చి, వైద్యనిపుణుల విశ్వాసాన్ని చూరగొనే రీతిలో దీనిని ముందుకు తీసుకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

ఈ ప్రారంభాన్ని ప్రయోజనకారి గా మలచడానికి మన అంతరంగం నుండి చురుకుగా ముందుకు కదిలే సుగుణాన్ని బయటకు తీసి స్వామి అడుగు జాడలలో నడుస్తూ దేహ తత్వం నుండి దేహి తత్వం (భగవత్తత్వం) వైపు మనం ప్రయాణం సాగించాలి. దీనిని సాధించడానికి నిస్వార్ధ సేవ తప్ప మరో మార్గము లేదు అని చెప్పడానికి ఉదాహరణగా గత నెలలో స్వర్గస్థులైన మహారాష్ట్ర లోని నాగపూర్ కు చెందిన ఇద్దరు ప్రాక్టీషనర్లు అందించిన సేవలే నిదర్శనం. ప్రాక్టీషనర్11270, పి హెచ్డి మరియు వ్యవసాయ ఆర్ధిక శాస్త్రంలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ వైబ్రియానిక్స్ ద్వారా వ్యవసాయ మరియు జంతు క్షేత్ర రంగాలలో విశేష సేవలందిస్తూ తన 84వ ఏట పరమపదించారు. ప్రాక్టీషనర్10590, విశ్రాంత శస్త్రచికిత్సా నిపుణులు. 2007లో  నాగపూర్ లో మొబైల్ మెడికల్ సేవలు వంటి అనేక సేవలకు ఆద్యులు. వీరు తన 86వ ఏటి వరకూ సంక్లిష్టమైన కేసులతో సహా అనేక కేసులను పరిష్కరించి వైబ్రోరంగానికి విశేష సేవలందించారు. ఈ ఇద్దరు కూడా తమ ప్రజ్ఞతో స్థానికంగా ఉన్న ప్రాక్టీషనర్లకు సమస్యా నివారణ లో కూడా ఇతోదికంగా కృషి చేసారు. 

ఈ వైబ్రో రంగము ద్వారా మొక్కలు, జంతువులు, మానవులకు నిస్వార్ధంగా సేవలందించడం నిజంగా ఒక అధ్బుతమైన దివ్యమైన భవ్యమైన సేవ అని నా అభిప్రాయము. ఇట్టి మహత్తరమైన  సేవా రంగంలో ప్రాక్టీషనర్ లందరూ పాల్గొంటూ ప్రాంతీయం గానూ ప్రపంచవ్యాప్తంగాను దీనిని విస్తరించడానికి, కొంగ్రొత్త ప్రణాలికలతో ముందుకు తీసుకు వెళ్ళడానికి ముందుకు వస్తారని నా ఆకాంక్ష మరియు ప్రార్ధన.

ప్రేమతో సాయి సేవలో మీ

జిత్.కె.అగ్గర్వాల్