దివ్య వైద్యుని దివ్య వాణి
Vol 9 సంచిక 1
January/February 2018
“దేహ రక్షణ కోసం మనం తీసుకొనే ఆహారం మితంగా ఉంటేనే అది మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.. అతిగా తినడం మన శరీర నిర్మాణ వ్యవస్థను విషతుల్యం చేస్తుంది. మనకు సంతృప్తిని ఇచ్చేది ఆహారమే, వ్యాధిని తెచ్చిపెట్టేది కూడా ఆహారమే ఐతే దానిని మితంగా హితం చేకురేలా తినాలి. అలాగే ఐశ్వర్యం కూడా అవసరమే కానీ అది కూడా మితం గానే ఉండాలి. ధనం ఎక్కువైన కొలదీ ఎన్నో సమస్యలు ఉత్పన్న మవుతాయి.ఈ ధనమే మనిషిని అహంకారి గా చేసి మంచి చెడు విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. దానకర్ణుడిగా కీర్తి సంపాదించుకోవాలి గానీ దుర్యోదనుడి లాగా పరమ లోభిగా మారి పతనమవకూడదు.."
... సత్యసాయి బాబా , “అవతారము మరియు భక్తులు ” దివ్యవాణి 23 జనవరి 1994
http://www.sssbpt.info/ssspeaks/volume27/sss27-31.pdf
"ఫలాపేక్ష లేకుండా కోరిక లేకుండా ప్రేమతో గానీ బాధ్యత అనే భావంతో చేసే పని యోగం అవుతుంది. అట్టి యోగము మనిషి నుండి పశు లక్షణాలు పోగొట్టి దివ్యత్వానికి కొనిపోతుంది. ఇతరులను సేవించడం,వారిలో భగవత్ స్వరూపాన్ని దర్శించడం ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడానికి దోహదపడుతుంది. ఇది సాధన వలన మీరు సాధించుకున్న స్థాయి నుండి దిగజారకుండా పదిల పరుస్తుంది. నిస్వార్ధ సేవ పుజాదికలకన్నా ఎంతో ఫలవంత మైనది. సేవ నీలో నిగూఢముగా ఉన్న స్వార్ధాన్ని తొలగిస్తుంది. హృదయాన్ని విశాలము చేసి వికసించి పరిమళించే లాగా చేస్తుంది. ."
... సత్యసాయి బాబా, “ప్రేమతో సేవ ” విద్యావాహిని అధ్యాయము 8
http://www.sssbpt.info/vahinis/Vidya/Vidya08.pdf