డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్కు నుండి
Vol 8 సంచిక 5
September/October 2017
ప్రియమైన వైబ్రో అభ్యాసకులరా ,
అత్యంత పవిత్రమైన దసరా నవరాత్రుల సందర్భముగా ఇలా మీతో నా భావాలను పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజులు ఎంత పవిత్రమైనవో స్వామి మాటలలో ‘‘ భారతీయులు ఈ నవరాత్రులను ప్రాచీన కాలము నుండి దివ్య మాతను దేవీ గా కొలుస్తూ ఒక పండుగ గా జరుపుకుంటూ ఉన్నారు. వారు ఈ దేవీ యొక్క అంశాలను దుర్గ,లక్ష్మి,సరస్వతి గా ఈ తొమ్మిది రోజులు కొలిచి పూజిస్తారు’’. 1991అక్టోబర్ 18 నాటి శ్రీవారి దివ్యోపన్యాసము. “దుర్గ మనకు భౌతిక,మానసిక,ఆధ్యాత్మిక శక్తులను ప్రసాదిస్తే లక్ష్మి మనకు సంపదను ప్రసాదిస్తుంది. సంపద అనగా కేవలం ధనం అని అర్ధం కాదు తెలివి తేటలు సంపదే మంచి శీలము సంపదే. మంచి ఆరోగ్యము కూడా సంపదే . ఇక సరస్వతి మనకు జ్ఞానాన్ని,యుక్తా యుక్త వివేచన ను ప్రసాదిస్తుంది. ఈ నవరాత్రి ఈ దేవతల(దివ్య స్త్రీ మూర్తులు) యొక్క శక్తులను మానవాళి గ్రహించడం కోసం ఈ నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటారు.” - 1988 అక్టోబర్ లో దసరా నాటి శ్రీవారి దివ్యోపన్యాసం నుండి .
ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లు వల్ల ,వరదల వల్ల,అడవులలో దావానలం వల్ల ,భూకంపాలవల్ల,మానవాళికి అపార నష్టం వాటిల్లు తున్న తరుణంలో ఈ వార్తాలేఖ మీ చేతిలోనికి వచ్చింది. ఈ వైపరీత్యాల కారణంగా బాధలకు,నష్టాలకు గురిఐ నట్టి వారికోసం మేము హృదయ పూర్వకంగా ప్రార్ధిస్తున్నాము. మా విన్నపం ఏమిటంటే హృదయపూర్వకంగా ప్రార్ధిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అట్టి వారికోసం స్వస్థత పూర్వక మైన శక్తిని ఈ ప్రకృతి వైపరీత్యాలకు గురి యయిన వారికి ప్రసరింప జేయండి. మరియు ప్రకృతి సిద్ధ సహజ వనరుల కోసం మనిషి చేస్తున్న దురాగతాలవల్ల ,భూఉపరితల వేడిమి వల్ల భూమాతకు కష్టం కలగ కుండా ఉండడం కోసం కూడా మీ ప్రార్ధన ద్వారా శక్తిని ప్రసరింప జేయండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే మనందరికీ భగవద్భక్తీ ,ప్రేమా ఉన్నాయి. ఈ ప్రేమను మానవాళి అంతటికీ రోజంతా ప్రసరింప జేయండి.
పోలాండ్ లోని మన వైబ్రియోనిక్స్ సోదర సోదరీ మణులు అంకితభావం తో ఒక నిశ్శబ్ద విప్లవం లాగా దేశవ్యాప్తంగా తమ నిస్వార్ధ సేవలతో వైబ్రియోనిక్స్ జండాను అందలమెక్కిస్తున్నారు. 2017 మే-జూన్ వార్తాలేఖ లో మార్చ్ 24-27 మధ్య జరిగిన్ జాతీయ పోలిష్ సదస్సు గురించి గత సంచికలో ప్రస్తావించాము. కృతజ్ఞతాపూర్వక కానుక గా ఈ సంచికను పోలాండ్ మరియు సరిహద్దు యురోపియన్ దేశాలకు సంబంధించిన చికిత్సా నిపుణుల వివరాలు, కేసుల వివరాలు,మరియు పరిశోధనా వ్యాసాలతో వారికి అంకితం చేస్తున్నాము.
సంస్థ యొక్క నిరంతర కార్య కలాపాలను డిజిటైజేషన్ చేసే ప్రయత్నంలో భాగంగా మేము ఒక క్రొత్త అంతర్జాల ఆధారిత పోర్టల్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాము. దీనిలో ప్రాక్టీ షనర్ లు వ్వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు మరియు అంతర్జాలం ద్వారా తమ IASVP దరఖాస్తులను పంపేందుకు ఉపయోగ పడుతుంది. ఇంకా ప్రాక్టీ షనర్ లు తమ నెలవారీ రిపోర్టులను ఈ మెయిల్ లో పంపడం ద్వారా తమ కో ఆర్డినేటర్ లకు పంపే శ్రమ తప్పుతుంది .ఒక నెల రోజులలో ఈ ప్రక్రియను పూర్తీ చేయాలనీ ప్రాక్టీషనర్లందరికి తమ రిజిస్టర్ చేసిన ఈ మెయిల్ ద్వారా సమాచారం పంపడం జరుగుతుందని తెలియ జేస్తున్నాము .
ఈ వైబ్రియోనిక్స్ పట్ల ప్రపంచవ్యాప్త అవగాహన కల్పించడంలో మనం ఇంకా చాలా వెనుకబడే ఉన్నట్లు నా అభిప్రాయం. కనుక ప్రతీ ఒక్క ప్రాక్టీ షనర్ ప్రతీ వారము ఒక క్రొత్త వ్యక్తికి వైబ్రియోనిక్స్ పట్ల కొంత సమాచారము అందించాలి ( ఇది మన AVP మరియు SVP మాన్యువల్ లోని నియమావళిని అతిక్రమించకుండా ఉండాలి)మరియు వారికి క్రింది లింక్ ను కూడా https://www.youtube.com/watch?v=roXS0_WcU28&feature=youtu.be తెలియ చేయండి. అలాగే వైబ్రియోనిక్స్ అంటే ఏమిటి అనే విడియో కూడా వారికి చూపించండి . ఇది వారిలో వైబ్రియోనిక్స్ పట్ల అవగాహన పెంచడానికి మన మిషన్ భూమండలం అంతా వ్యాపించడానికి దోహద పడుతుంది దీనివల్ల వైబ్రో మందుల ఫలితాలను ఎక్కువ మందికి అందించే అవకాశం కలుగుతుంది. అటువంటిఅనుభవాలతో కూడిన కథానికలను మాకు ప్రచురణార్ధం పంపిస్తే అవి ఎంతో మందికి స్పూర్తి దాయకంగా ఉంటాయి.
మన వైబ్రియోనిక్స్ మిషన్ అద్భుత ఫలితాలతో ముందుకు వెళుతున్న కొలదీ పరిపాలనా విభాగానికి సంబందించిన అవసరాలు కూడా అదే నిష్పత్తిలో ఇతోధికంగా పెరుగుతూ వస్తున్నాయి. కనుక ప్రపంచ వ్యాప్తంగాను,ప్రాంతీయ పరంగానూ,స్థానిక అవసరాల దృష్ట్యా ప్రాక్టీషనర్ ల వద్దనుండి మరింత సహకారము అవసరము, కనుక మీరు ఏ రూపంలో మాతో చేయి కలిపినా కొండంత సహాయం చేసిన వారవుతారు. దయ చేసి [email protected] కు రాయండి,లేదా మీ ప్రాంతీయ లేదా మీ దేశపు కోఆర్డినేటర్ ను మరింత సమాచారము కోసము,మరిన్ని సేవ అవకాశాల కోసం సంప్రదించండి.
కేరళ వైబ్రియో టీం అంతటికీ ప్రాక్టీషనర్ లు అందరి తరఫునా ఓణ౦ పండుగ శుభాకాంక్షలు. ఒకసారి స్వామి ఈ కేరళ వాసుల గురించి ఏం చెప్పారంటే , “కేరళ సత్యసాయి సంస్థలోని సభ్యులు మహిళలు,పురుషులు కూడా వారు ఏ కార్యక్రమం చేసినా భారీ ఎత్తున చేస్తారు కనుక కేరళ భక్తులు భవిష్యత్తులో చేసే సేవాకార్యక్రమాలలో కూడా ఇదే ఒరవడిని కొనసాగించాలని ఆశీర్వదిస్తున్నాను’’!!
ప్రేమతో సాయి సేవలో మీ
జిత్ కె అగ్గర్వాల్