వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 8 సంచిక 3
May/June 2017
“మానవ జీవితములో ఇతరులు నీకు నీవు ఇతరులకు పరస్పరం సేవలందించకుండా మనుగడ సాగించలేని విషయం నీవు గ్రహించాలి. నాయకుడు-సేవకులు, పరిపాలకులు-పరిపాలితులు, గురువు-శిష్యులు, యజమాని-ఉద్యోగి, తల్లిదండ్రులు-పిల్లలు వీరంతా కూడా ఒకరి సేవలపైన మరొకరు ఆధారపడ్డవారే. ప్రతీ ఒక్కరూ సేవకుడే. నీవు సేవించే రైతు మరియు కూలివాడు ప్రతిఫలంగా నీకు ఆహారము, దుస్తులకు కావలసిన ప్రత్తిని ఎంతో శ్రమతో పండించి సేవ రూపంలో ఇస్తున్నారు. భగవంతుడు ప్రసాదించిన ఈ దేహము, బుద్ధి, ఇంద్రియాలు, మనసు, నిర్భాగ్యులకు సేవ చేయడానికే. కాబట్టి భగవత్ అనుగ్రహం సాధించడానికి సేవకు మించిన ఉత్తమ సాధనా మార్గం లేదు అని గ్రహించండి.
...సత్యసాయి బాబా, "సేవకు సమాన మైనది." 21 నవంబర్ 1986
http://www.sssbpt.info/summershowers/ss1973/ss1973-08.pdf
ఎక్కువ మొత్తంలో మనం త్రాగే నీరు మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దానిలో చాలా సూక్ష్మమైన భాగము ప్రాణ శక్తిగా మారుతుంది. అలాగే ఆహారం కూడా. కనుక మనం తినే ఆహారము, నీరే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. మనం తినే ఆహారము త్రాగే
నీరు సరియయిన రీతిలో నియంత్రించగలిగితే మనం దివ్యత్వానికి చేరువ కాగలుగుతాము. కనుకనే ఫుడ్ ఈజ్ గాడ్ అన్నారు. కనుక ఆహారమును వృధా చేస్తే దైవమును వృధా చేసినట్లే. కనుక ఆహారము వృధా చేయక తగినంత ఆహారమే తీసుకోవాలి, సాత్వికఆహారమే తీసుకోవాలి. అవసరం కన్నా ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అవసరమైన వారికి ఇచ్చివేయాలి.
...సత్యసాయి బాబా, " సత్యసాయి బోధ –సంచిక 1
https://www.sathyasai.org/publications/TeachingsOfBSSSB-Vol01.html