Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్న జవాబులు

Vol 8 సంచిక 2
March/April 2017


1. ప్రశ్న: 200 ml నీటిలో ఐదు గోలీలను కలిపి తయారు చేయబడిన మందును TDS లేక తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మందు పాసిపోతోంది. దీనికి పరిష్కారం ఉందా?

   జవాబు:  వాతావరణం మరియు పర్యావరణ పరిస్థితులను బట్టి నీరు మూడు నుండి ఏడు రోజుల్లో పాసిపోయే అవకాశం ఉంది. ఈ కారణంగా, 100 ml నీటిలో మూడు గోలీలను కలిపి మూత కప్పబడిన ఒక పాత్రలో ఉంచటం మంచిది. స్వచ్ఛమైన నీరు మరి కొంత కాలం నిలవు ఉంటుంది. వైబ్రో నీటిని ఒక నిమిషం వరకు నాలుక క్రింద ఉంచుకొని మింగవలెను.

________________________________________

2. ప్రశ్న: మందును తీసుకునే ముందు వైబ్రో గోలీలు లేదా నీరు ఉన్న సీసాను కదిలించడం (షేక్ చేయడం) ద్వారా మందు యొక్క శక్తి మరింత పెరుగుతుందా?

 జవాబు:  అవును. సీసాను కదిలించడం ద్వారా అంతర్లీనమైన శక్తి మేలుకొలుపబడుతుంది. అయితే, సీసాను జోరుగా కదిలించరాదు. జోరుగా కదిలిస్తే మందు యొక్క శక్తి మారిపోయే అవకాశం ఉంటుంది.

________________________________________

3. ప్రశ్న: కంటి చుక్కలు ( డ్రాప్స్) లేదా నేసల్ డ్రాప్స్ ను తయారు చేసేందుకు కుళాయి త్రాగు నీటిని ఉపయోగించవచ్చునా? నేను గత నాలుగు వారాలుగా వీటి తయారీ కొరకు డిస్టిల్డ్ నీటిని మాత్రమే ఉపయోగించడం జరిగింది. డిస్టిల్డ్ నీరు ఉపయోగించటం ద్వారా కాటరాక్ట్ కేసులలో మరిన్ని సఫలితాలు లభిస్తున్నాయని  తెలుసుకున్నాను.

   జవాబు: డిస్టిల్డ్ నీటిని ఉపయోగించటం మంచిది. సీసాలలో లభించే స్వచ్ఛమైన నీటిని ఉపయోగించడం కూడా మంచిది అయితే, ఇటువంటి నీరు కేవలం ఒక వారం రోజులు మాత్రమే నిలవు ఉంటుంది. కుళాయి నీటిని ఉపయోగొంచడం మంచిది కాదు. ముఖ్యంగా కంటి చుక్కల తయారికి కుళాయి నీటిని ఉపయోగొంచడం వల్ల కళ్ళు మండే అవకాశం ఉంది. ఇరవై నిమిషాలు మరిగించి చల్లార్చ బడిన కుళాయి నీటిని కంటి చుక్కల తయారికి ఉపయోగించవచ్చు.

________________________________________

4. ప్రశ్న: రోగి 100% నయం అయ్యాక మందు యొక్క మోతాదును నేరుగా TDS నుండి OW కి తగ్గించవచ్చా?

   జవాబు:  లేదు. మందు యొక్క మోతాదును నేరుగా TDS నుండి OW కి తగ్గించరాదు. రోగ లక్షణాలు తిరిగి కలగకుండా ఉండేందుకు మోతాదును క్రమక్రముగా తగ్గించడం మంచిది. TDS నుండి OD కి, ఆపై 3TW కి, ఆపై 2TW కి, చివరిగా OW కి మెల్లగా తగ్గించడం మంచిది. దీర్ఘకాలిక వ్యాధులున్న కేసులలో ఇదే విధముగా మోతాదును తగ్గించవలెను. అయితే అక్యూట్ కేసులలో TDS నుండి OD కి తగ్గించి, కొన్ని రోజుల తర్వాత ఆపవచ్చు.

________________________________________

5. ప్రశ్న:  మేము వీపు నొప్పి మరియు కండరాల నొప్పితో బాధపడుతున్న రోగులకు చికిత్సను ఇవ్వడం జరుగుతోంది. ఉపశమనం కలగడంతో రోగులు ఆనందంగా ఉన్నారు. నొప్పి పూర్తిగా తగ్గినప్పటికీ, OD మోతాదులో మందును కొనసాగించాలని పట్టుబడుతున్నారు. ఇది సరియైన పద్ధతేనా?

   జవాబు:  వృద్ధావస్థలో ఉన్న రోగులు మందును OD మోతాదులో కొనసాగించవచ్చును. చిన్న వయసు గల రోగులకు మందు యొక్క మోతాదును క్రమక్రమముగా OW కి తగ్గించడం మంచిది.

________________________________________

6. ప్రశ్న: మొదటి రకమైన పుల్ అవుట్ కారణంగా రోగ లక్షణాలు తీవ్రమైన సందర్భంలో రోగి ఉపశమనం కొరకు అల్లోపతి మందును తీసుకోవడం మంచిదా?

   జవాబు: అవును, మంచిదే. అల్లోపతి మందులు వైబ్రో మందులకు అనుకూలంగా పనిచేస్తాయి. వైబ్రో మందులు సూక్ష్మ స్థాయిలోను మరియు అల్లోలపతి మందులు శారీరిక స్థాయిలో ను పని చేస్తాయి.

________________________________________

7. ప్రశ్న: అక్యూట్ రోగ లక్షణాలు ఉన్న కేసులలో, వైబ్రో మందును ప్రారంభించిన వెంటనే రోగ లక్షణములు తీవ్రమవ్వటం పుల్ అవుట్ ను సూచిస్తుందా?

   జవాబు: సాధారణంగా అక్యూట్ రోగ కేసులలో పుల్ అవుట్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అక్యూట్ రోగ లక్షణాలు శరీరంలో ప్రవేశ పెట్టిన వెంటనే రోగ లక్షణాలు చికిత్స చేయని సందర్భంలో  తీవ్రమైపోతాయి. తగిన వైబ్రో మందును ఇచ్చినప్పటికీ, వైబ్రో మందు పని చేసేందుకు కొంత సమయం పట్టడం కారణంగా లక్షణాలు తీవ్రమవుతాయి. ఖచ్చితంగా దీనికి కారణం పుల్ అవుట్ కాదు.

________________________________________

8. ప్రశ్న: మయాసం మందును తీసుకుంటున్న సమయంలో మరొక వైబ్రో మందును ఇవ్వవచ్చునా?

జవాబు: దీర్గకాలిక సమస్యలకు మయాసం తీసుకుంటున్న సమయంలో, మయాసం తీసుకునే మూడు రోజులు ముందు మరియు తీసుకున్న మూడు రోజులు తర్వాత వరకు మరొక వైబ్రో మందును ఇవ్వ రాదు. అక్యూట్ వ్యాధులకు చికిత్సను అందించే సమయంలో మయాసం ను ఇవ్వరాదు.

________________________________________

9. ప్రశ్న: వద్దనున్న 108CC పెట్టెను రెండేళ్లకు ఒకసారి ప్రశాంతి నిలయం లో ఉన్న మాస్టర్ పెట్టెతో రీచార్జ్ చేయవలెనని నేను ఎరుగుదును. రెండేళ్ల సమయం  ధాటి పోయిన తర్వాత, నేను పర్తికి ప్రయాణించడం వీలుకాని  సందర్భంలో సాయి రామ్ హీలింగ్ వైబ్రేషన్ మశీనును ఉపయోగించి 108 మిశ్రమాలను  తయారు చేసుకోవచ్చునా?

   జవాబు: సాయిరాం పొటెంటైజర్ ఉన్న చికిత్సా నిపుణులు 108 కాంబోలను (మిశ్రమాలను) తాము తయారు చేసుకోవచ్చును. అయితే, ప్రతియొక్క మిశ్రమంలోను అతిముఖ్యమైన మరియు ఉన్నతమైన అంశం ఒకటి చేర్చబడియుంది- అదియే భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి యొక్క దివ్య శక్తి. మొట్ట మొదట 108 మిశ్రమాల తయారు చేసిన సమయంలో భగవాన్ మిశ్రమాల పెట్టెను దీవించటం జరిగింది. అప్పటినుండి ప్రశాంతి నిలయం లో ఉన్న మాస్టర్ పెట్టెలో ఉన్న మిశ్రమాలు క్రమం తప్పకుండా నవీకరించబడడము మరియు బాబా యొక్క శక్తివంతమైన శక్తి క్షేత్రములో తిరిగి ఎనెర్జయిస్ చేయబడడము జరుగుతున్నది. చికిత్సా నిపుణుల ద్వారా మాకు అందుతున్న అద్భుతమైన రీతిలో పూర్తిగా నయమైన  లెక్కలేనన్న కేసులు దీనికి రుజువు. ప్రశాంతి నిలయానికి ప్రయాణం చేయలేని చికిత్సా నిపుణులు తమ మిశ్రమాల పెట్టె యొక్క రీచార్జ్ కొరకు తమ స్థానిక సమన్వయకర్తను సంప్రదించవలెను.