ప్రధాన వైద్యుడు యొక్క దివ్య వాక్కు
Vol 6 సంచిక 3
May/June 2015
“ఈనాడు మానవుడు ఆందోళనతో భాధపడుతున్నాడు.ఈ ఆందోళనకు కారణం ఏమిటి? సంతృప్తి లేకపోవడమే దీనికి కారణం.ధనవంతుడకు సంపద పెర్చుకున్నప్పటికి సంతృప్తి లేదు.వర్రీ వలన హర్రీ మొదలవుతుంది.ఈ రెండు అనారోగ్యానికి దారి తీస్తున్నాయి.వర్రీ, హర్రీ మరియు కర్రీ (కొవ్వు పదార్ధాల), ఇవి మూడు హృదయ రోగాలు రావడానికి మూల కారణాలు.
కొవ్వు పదార్థాలు ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం హృదయ వ్యాధులు రావడానికి అతిముఖ్య కారణం. కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే భరువు పెరిగి హృదయ వ్యాధులు కలుగుతాయని డాక్టర్లు కొవ్వు పదార్థాలను భుజించరాధని సలహా ఇస్తున్నారు. విషపదార్థాల వల్ల కూడా చాలా హాని కలుగుతుంది.అందుకని అందరు కూడను బలమైన ఆహారాన్ని మితముగా తీసుకోవాలి మరియు ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మత్తు పానీయాలను త్రాగరాదూ. 50 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత ఆహారం తీసుకోవడం క్రమంగా తగ్గించుకోవాలి”.
–సత్యసాయి బాబా, దివ్యోపన్యాసం, 21 జనవరి 1994