అదనపు సమాచారం
Vol 7 సంచిక 5
September/October 2016
బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ (ప్రసరణ యంత్రాంగం) ప్రారంభించబడింది
అనేక సంవత్సరాలకు ముందు సాయిరాం హీలింగ్ వైబ్రేషన్ పొటెంటైజర్ (SRHVP) ను పొంది, రోగులు లేకపోవడం కారణంగా సేవను చేయని చికిత్సా నిపుణులను గత కొన్ని సంవత్సరాలుగా US / కెనడా సమన్వయకర్త 01339 ఉత్తేజపర్చడం జరుగుతున్నది. 2016 ఫిబ్రవరి లో US / కెనడా సమన్వయకర్త ప్రశాంతి నిలయం దర్శన హాలులో కూర్చుని ఉండగా, సీనియర్ చికిత్సా నిపుణులను (SVPs) జూనియర్ చికిత్సా నిపుణులతో (JVPs) కలపాలన్న ఆలోచన ఆమెకు హటార్తుగా కలిగింది. దీని ద్వారా దూర ప్రాంతాలు మరియు ఆసుపత్రిల్లో ఉండే రోగులకు చికిత్సను అందించే అవకాశం ఉంటుందని ఆమెకు అనిపించింది. ఇంతవరకు, దూరంలో ఉన్న రోగులకు చికిత్సను అందించాలంటే ఒకటే మార్గం తపాలు ద్వారా వైబ్రో మందులను పంపడం. ఇలా పంపేందుకు వీలుకానప్పుడు ఇటువంటి రోగులకు వైబ్రో చికిత్సను పొందే అవకాశం ఉండేది కాదు. ఇటువంటి ఆలోచన స్వామి నుండి వచ్చిందని ఆమె గుర్తించి, దీని ద్వారా వైబ్రియానిక్స్ ప్రపంచమంతా వ్యాపించే సంభావ్యత ఎంతగానో ఉందని ఆమెకు అనిపించింది. ఈ విధంగా JVP లచే సూచించబడే రోగులకు వైబ్రో మందులను ప్రసరణ చేసి సేవను అందించే అవకాశాలు SVP లకు ఎక్కువగా లభిస్తాయి. ఈ ప్రథమ యత్నం సునువుగా కొనసాగేందుకు, SVP 02877…USAను నెట్వర్క్ మానేజర్ గా నియమించడం జరిగింది. 2016 జులై 19 న, పవిత్రమైన గురుపూర్ణిమ పర్వదినం సందర్భంగా, పొటెంటైజర్ ఉన్న 16 వాలంటీర్లు తో బ్రాడ్కాస్టింగ్ నెటవర్క ప్రారంభమైంది. SVP యొక్క సహాయం కావలసిన ప్రతి JVPను అందుబాటులో ఉన్న ఒక SVPతో సంప్రదింపు ఏర్పాడు చేయడం మరియు చికిత్స యొక్క పురోగతిని తెలుసుకుంటూ ఉండడం ఈ నెట్వర్క్ మేనేజర్ యొక్క ప్రధాన విధి. ఈ పధకం క్రింది విధముగా పని చేస్తుంది: ముందుగా JVP విట్నెస్ (సాక్షి) కొరకు రోగి యొక్క పూర్తి పొడవు ఛాయాచిత్రం (లేదా సాధ్యమైతే రోగి యొక్క వెంట్రుకలు) సేకరిస్తారు. మేనేజర్ ను సంప్రదించిన తర్వాత ఈ విట్నెస్ ను రోగి యొక్క వైద్య సమాచారం మరియు ఆరోగ్య స్థితి వంటి వివరాలను SVPకు పంపిస్తారు. SVP రోగి యొక్క ఛాయాచిత్రాన్ని ఒక మంచి నాణ్యతగల ఫోటోగ్రాఫ్ పేపర్ పై తగిన పరిమాణంలో ఫోటోను ప్రింట్ (ముద్ర) చేస్తారు. దీని తర్వాత SVP చే తగిన వైబ్రో మందు తయారు చేయబడి 200C పొటెన్సీలో నమూనా వెల్ లో ఉంచబడుతుంది. విట్నెస్/సాక్షిని మందు యొక్క వెల్ లో పెట్టడం జరుగుతుంది. దీని తర్వాత హృదయపూర్వక ప్రార్థనలతో బ్రాడ్కాస్టింగ్/ప్రసరణ ప్రారంభం అవుతుంది. రోగిని లేదా రోగి కుటుంభ సభ్యులను మూడు రోజులకు ఒక సారి JVP సంప్రదించి రోగి యొక్క ఆరోగ్య స్థితిని తెలుసుకుంటారు. ఈ వివరాలను SVPకు తెలియచేయడం జరుగుతుంది. ఆపై SVP మందులో తగిన మార్పులు చేయడం జరుగుతుంది.
మొదటి నెల ఈ విధానం ద్వారా విజయవంతంగా 14 రోగులకు చికిత్స ఇవ్వడం జరిగింది. బ్రాడ్కాస్టింగ్ గురించిన ఆలోచనను కలిగించి తద్వారా అధిక సంఖ్యల్లో రోగులకు చికిత్సను అందజేసే అవకాశం ప్రసాదించిన సాయికి మా కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాము.
ఓం సాయిరాం!