దివ్య వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 7 సంచిక 5
September/October 2016
"సేవను అందించే సమయంలో మీకున్న సామర్థ్యాలను తలచి అహాన్ని పెంచుకోరాదు. వినయపూర్వకంగా ఉండండి మరియు భగవంతుడు మీకు సేవను చేసే అవకాశం ప్రసాదించారని గుర్తుంచుకోవాలి. ఇతరులకు మీరు ఏ సేవ చేసినప్పటికీ అది మీకు మీరే చేసుకునే సేవ అన్న సత్యాన్ని మీరు గుర్తుంచుకోవాలి... ఈ రోజు మీరు చేసే సేవ యొక్క ఫలితం భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు లభిస్తుంది."
-సత్యసాయి బాబా, "మానవ సేవే మాధవ సేవ" సమ్మర్ షవర్స్, 1973 బృందావన్
http://www.sssbpt.info/summershowers/ss1973/ss1973-08.pdf
“చెడు ఆలోచనలు అనారోగ్యానికి దారి తీస్తాయి. ఆందోళన, భయం మరియు ఒత్తిడి కారణంగా ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఇవ్వనిట్టికి మూల కారణం దురాశ. దురాశ, భాధ మరియు నిరాశలకు దారి తీస్తుంది. ఆధ్యాత్మిక మార్గం మాత్రమే సంతృప్తిని ప్రసాదిస్తుంది. ప్రాపంచిక విషయాల పై వ్యామోహాన్ని విడిచిపెట్టాలి. ఇది మా పని మరియు అది దైవం యొక్క పని అని వేరు చేయరాదు. మీరు చేసే ప్రతి పని ఒక ఆరాధనగా మారాలి. బహుమతి ఏదైనా గాని అది దేవుడిచ్చిన వరమే అవుతుంది. భగవంతుడు అన్ని మన మంచికే చేస్తాడు. ఇటువంటి వైఖరిని కలిగియున్నప్పుడు భాధ మరియు దుఃఖం మనందరినీ మరింత బలపరచి దివ్యత్వం వైపు నడిచేందుకు సహాయపడతాయి.”
-సత్యసాయి బాబా, "మంచి ఆరోగ్యం మరియు మంచితనం" దివ్యోపన్యాసం, 30 సెప్టెంబర్ 1981
http://www.sssbpt.info/ssspeaks/volume15/sss15-21.pdf