డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 7 సంచిక 3
May/June 2016
ప్రియమైన చికిత్సా నిపుణులకు,
సహాయం కొరకు మార్చ్/ఏప్రిల్ వార్తాలేఖలో మేమిచ్చిన పిలుపుకు అద్భుతమైన ప్రతిస్పందన లభించిందని అపారమైన ఆనందంతో తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా భారతదేశం, UK మరియు USA నుండి అధిక సంఖ్యలో చికిత్సా నిపుణులు వైబ్రియానిక్స్ సాధనకు అత్యవసరమైన పరిపాలనా సంభందిత కార్యక్రమాల కోసం వారి సేవలను అందచేయుటకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంలో నేను, పరిపాలనా సంభందిత సేవను అందచేయడానికి నూతన మరియు అనుభవంగల స్వచ్ఛంద సేవకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతా భావాన్నితెలుపుకుంటున్నాను.
మన వైబ్రియానిక్స్ సమూహంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ చికిత్సా విధానంపై అవగాహన కూడా పెరుగుతున్న కారణంగా, పరిపాలన(అడ్మిన్) సంభందిత సేవలను అందచేయడానికి మాకు అధిక సంఖ్యలో స్వచ్చంద సేవకుల అవసరం ఉండవచ్చు. ప్రత్యేక సేవల గురించి కనుగొనడంలో ఆశక్తి ఉన్న చికిత్సా నిపుణులు [email protected] ను సంప్రదించవలసిందిగా కోరుతున్నాను.
సహకారం యొక్క శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని మేము ప్రపంచ వ్యాప్తంగా రెండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించాము:
- చికిత్సా నిపుణులకు అవసరమైన ప్రేరణ మరియు ప్రోత్సాహాన్ని అందచేసే ఉద్దేశంతో మేము వార/ నెలవారీ సమావేశాలు, వ్యక్తిగతంగా లేదా/మరియు వీడియో సమావేశం (స్కైపు ద్వారా). రోగ చరిత్రలను మరియు సందేహాలు/ప్రశ్నలను ఇతర నిపుణులతో చర్చించడానికి, భారత దేశం, UK మరియు USA లో చికిత్సా నిపుణుల సమూహాలు ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ స్థానిక బృందాలు, సభ్యుల సమస్యలు/సందేహాలు తీర్చడానికి మద్దతు అందచేయడమే కాకుండా పరిశోధన కూడా నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమం అందరికి ముఖ్యంగా, అనుభవయుక్త చికిత్సా నిపుణుల సహాయం ఎక్కువ అవసరమున్న నూతన చికిత్సా నిపుణులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతున్నాను.
- రెండవ నూతన పదకమైన, వైబ్రియానిక్స్ ప్రసరణ నెట్వర్క్, మన USA మరియు కనడా సమన్వయకర్తచే 01339 ప్రారంభించ పడుతోంది. SRHVP మశీను ఉన్న స్వచ్చంద చికిత్సా నిపుణులు AVP లు మరియు VP లతో కలిసి, స్వస్థముచేసే(హీలింగ్) వైబ్రేషన్లను, వైబ్రో మందులను తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న రోగులకు (ఆశ్పత్రిలో అడ్మిట్ అయ్యున్నవారు, అపస్మారక స్తితిలో ఉన్నవారు, దుర్బల స్థితిలో ఉన్నవారు లేదా సుదూర ప్రాంతాలలో ఉన్నవారు) ప్రసరణ ద్వారా అందచేస్తారు.
సహభాగిత సమావేశాలు నిర్వహించేందుకు మరియు ప్రసార నెట్వర్క్ సంభందించిన ప్రక్రియ మరియు ఫలితాలను తెలుసుకొనేందుకు అవసరమైన మార్గదర్శకాలను అభివృద్ధి చేసే పని ప్రారంభమైనది. ఈ ప్రథమ యత్నం నుండి ఆసక్తికరమైన మరియు అత్యంత లాభదాయకమైన ఆలోచనలు పుట్టుకొస్తాయని మము బలంగా నమ్ముతున్నాము.
ఇది వైబ్రియానిక్స్ కి ఒక ఉత్తేజకమైన సమయము మరియు వైబ్రియానిక్స్ లో జరుగుతున్న పరిణామాలను మీయందరికీ తెలియచేయడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. ఇతర దేశాల్లో నకలు చేసే ఉద్దేశంతో, పైనిచ్చియున్న కార్యక్రమాల పురోగతిని, తదుపరి వార్తాలేఖలో నివేదించడానికి నేను ఎదురుచూస్తున్నాను.
శాశ్వతంగా మా సారథియై యుండాలని ప్రియమైన స్వామిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.
మీ అందరికి ప్రేమను మరియు కాంతిని పంపిస్తూ,
ప్రేమపూర్వకంగా సాయి సేవలో,
జిత్ కే అగ్గర్వాల్