అదనపు సమాచారం
Vol 5 సంచిక 5
September/October 2014
అభ్యాసకులు పంచుకున్నచిట్కాలు
ఎలక్ట్రానిక్ పరికరాలతో జీవించడం
సెల్ ఫోన్ రేడియేషన్ కు వ్యతిరేకంగా అల్యూమినియం ఫాయిల్ ను కవచంగా ఉపయోగించడం 01644...USA
నేను నా 108 cc బాక్స్ కిట్ ను అల్యూమినియం ఫోయి ల్ తో మూసి వేస్తాను. ఇప్పుడు చాలామందికి సెల్ ఫోన్లు ఉన్నాయి కనుక నేను నివారణలు ఇచ్చేటప్పుడు అల్యూమినియం ఫాయిల్ తోనే ఇస్తాను. కొంతకాలం ఈ ఫాయిల్ ను ఉపయోగించిన తర్వాత దాన్ని కాంతి వైపు తిప్పి చూస్తే దానిలో సన్నని రంద్రాలు ఉన్నాయని నేను గమనించాను. నేను నా సెల్ ఫోనును రంధ్రాలు ఉన్న అల్యూమినియం ఫాయిల్ లో ఉంచి కాల్ చేయగా దాని ధ్వని బయటకు వినిపించింది. కానీ కొత్త ఫాయిల్ లో ఉంచి కాల్ చేయగా ధ్వని వినిపించలేదు. కనుక దళసరిగా ఉన్న ఫాయల్ ఎక్కువకాలం మన్నుతుందేమో చూసి దానితో కొనసాగించడానికి ప్రయత్నిస్తాను.
విద్యార్ధులకు నిద్ర మరియు పరిశుభ్రత 11483…ఇండియా
స్కూల్ మరియు కాలేజీకి వెళ్లే పిల్లలు తమకు తరచుగా తలపోటు మరియు నిద్ర వస్తుందని చెబుతూ ఉంటారు, కనుక అటువంటి పిల్లలకు మనం ఇచ్చే నివారణతో పాటు వారు నిద్రించేటప్పుడు తమ మొబైల్ మరియు లాప్టాప్ దూరంగా ఉంచమని సలహా ఇవ్వాలి .