దివ్య వైద్యుని దివ్యవాణి
Vol 6 సంచిక 2
March/April 2015
“సేవ నిన్ను నా దరికి చేరుస్తుంది. నీ హృదయం అనే పూజాపుష్పము సేవద్వారా పరిమళాన్ని చేకూర్చుకొని నాకు మరింత ప్రీతి పాత్రమవుతుంది.”
… సత్యసాయిబాబా, సత్యసాయిబాబా వారి 80 వ పుట్టినరోజు, 2005 సందర్భంగా విడుదలయిన అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు శీర్షిక నుండి
"రోగాలను తప్పించుకొనే ఉద్దేశ్యంతో మీరు మందులెన్నో వేసుకుంటారు. కానీ మీ ఆనందాన్ని హరించి మిమ్మల్ని సామాజిక పరంగా ప్రమాదకరమైన స్థాయికి నెట్టే రోగాలైన అసూయా, డంబము, అహంకారము, కోరిక వంటి వాటి గురంచి మీరు తెలుసుకోలేక పోతున్నారు. ఈ రోగాలను మటుమాయం చేయడానికి దైవమనే ఔషధం తీసుకోండి. భగవంతుడు అన్ని జీవుల హృదయవాసియై ఉన్నాడని గ్రహించండి. మిరెవరినైనా మానసికంగా కానీ భౌతికంగా కానీ దూషించినా, కష్టపెట్టినా మీరు భగవంతుని బాధించిన వారే ఔతారు. మీ హృదయంలో ద్వేషము, పగ వంటి వాటికి స్థానం కల్పించవద్దు. మీ ఆగ్రహాన్ని వ్యక్తపరచడానికి జాగ్రత్తగా ఎన్నుకున్న పదాలను ఉపయోగించండి. కానీ చేతలు రూపంలో మాత్రం చూపకండి. మీ తప్పులు మీరు తెలుసుకొని పశ్చాత్తాపము తో మరలా అటువంటి తప్పులు జరగకుండా ఉండడానికి శక్తినిమ్మని భగవంతుని ప్రార్ధించండి."
…సత్యసాయిబాబా దివ్యవాణి, 14 అక్టోబర్ 1964