దివ్య వైద్యుని దివ్య వాణి
Vol 4 సంచిక 4
July/August 2013
“మీరు తినే వన్నీ, మీరు చూసే వన్ని, మీరు విన్న వన్నీ, ఇంద్రియాల ద్వారా మీరు తీసుకునే వన్నీ, మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి”
… సత్యసాయిబాబా వాణి వాల్యూమ్ 2 పేజి 78
“… మన దృష్టిని మార్చుకుంటే మనకు శాంతి కలుగుతుంది. ప్రజలు ప్రపంచాన్ని ప్రేమ దృష్టితో చూసినప్పుడు వారికి శాంతి లభిస్తుంది. అన్ని వ్యాధులు నయమవుతాయి. చాలా వ్యాధులకు మూలము మనసులోనే ఉంటుంది. ప్రతీ దానికి మానసిక సంబంధమైన ఆధారం ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తి తనలో ఏదో తప్పు జరిగిందని భావించినప్పుడు అతను అనారోగ్యాన్ని పెంచుకుంటాడు. ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యకరమైన మనస్సు అవసరం. కానీ శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మనిషికి దేవుని అనుగ్రహం కూడా అవసరం. మీరు దేవుని దయ పొందడానికి, మీరు దేవుని ప్రేమను పెంపొందించుకోవాలి. ప్రేమ ఒక ప్రదర్శనగా మారింది. నిజమైన ప్రేమ హృదయం నుండి రావాలి. ప్రేమతో రోజునుప్రారంభించండి, ప్రేమతో రోజును గడపండి, ప్రేమతో రోజును ముగించండి. అదే దేవుని చేరే మార్గం. మీరు ప్రేమను పెంచుకుంటే అనారోగ్యం మీ చెంతకు రాదు.”
...సనాతన సారథి 1995 పేజీ 117