దివ్య వైద్యుని దివ్యవాణి
Vol 4 సంచిక 3
May/June 2013
“సేవ అనే ఆధ్యాత్మిక సాధన ప్రత్యేకమైనది. సేవలో మీరు మీ శక్తిని మరియు శ్రద్ధను చేస్తున్న పనిమీద లగ్నం చేస్తారు. ఎందుకంటే ఇది భగవద్దత్తమైన పని. మీరు మీ శరీరాన్ని మరిచిపోయే దాని కోరికలను విస్మరిస్తారు. మీరు మీ వ్యక్తిత్వాన్ని మరియు ప్రతిష్టను అవసరాలను పక్కన పెడతారు. మీరు మీ అహాన్ని దాని మూలము నుండి త్రుంచివేసి దూరంగా పారద్రోలుతారు. మీరు మీ హోదాను, దర్పాన్ని, మీ పేరు మరియు రూపాన్ని, ఇలా ఇతరుల అవి కోరుకొనే అన్నింటినీ వదులుకుంటారు. ఈ ప్రక్రియ మనసును స్వచ్ఛంగా చేస్తుంది .”
-సత్యసాయి వాణి . 1977.06.03
“సేవ అనేది జీవితకాల కార్యక్రమం; దీనికి అలసట లేదా విశ్రాంతి తెలియదు. ఈ శరీరం మీకు ఇవ్వబడినందుకు మీరు మీ శక్తిని, మీ నైపుణ్యాలను సోదర - మానవుల సేవకే అంకితం చేయలి. మీరు మనుషులందరిలో భగవంతుని చూసే వరకు మనిషికి సేవ చేయండి; అప్పుడు, మీరు చేసింది ఆరాధన గా మారుతుంది .”
-Sathya Sai Speaks. 1975.01.06
“ మీరు ఒకరికి సహాయం చేయగలిగినప్పుడు, మీరు గర్వ పడటానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే మీ నైపుణ్యం లేదా మీ సంపద లేదా మీ బలం లేదా ధైర్యం లేదా అధికారము లేదా మీకు సేవ చేయడానికి అవకాశం మీరు గుర్తించినా గుర్తించక పోయినా భగవంతుని నుండి బహుమతిగా వచ్చింది. మీరు భగవంతుడిచ్చిన ఈ బహుమతిని భగవంతుడే ప్రసాదించిన సహాయం కోరే పేదలు, నిరక్షరాస్యులు, బలహీనులు, రోగులు, దుఃఖంతో ఉన్నవారు, నిరాశా హృదయులు, వీరికి సేవ రూపంలో ఆ బహుమతి అందిస్తున్నారు. మానవత్వం యొక్క పురోగతి సాధించడానికి, వంటరిగా పని చేస్తే సరిపోదు, ప్రేమ, కరుణ, సరైన ప్రవర్తన, నిజాయితీ, సానుభూతితో మీ పని ముడిపడి ఉండాలి. పై లక్షణాలు లేకుండా నిస్వార్థ సేవ చేయలేము.
-సత్యసాయి దివ్యవాణి