వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 4 సంచిక 2
March/April 2013
“ఈ దేహము అనేది అనేక జన్మలు గా మీరు చేసిన మంచి చెడులకు ఫలితంగా జనన మరణ చక్రాన్ని, ఈ భవసాగరము ను దాటడానికి భగవంతుడు ఇచ్చిన పనిముట్టు లేదా ఒక నావ వంటిది. ఇట్టి భవసాగరాన్ని దాటడానికి దేహంలో ఎవరయితే ఉన్నారో ఎవరు మీరు చేసే చర్యలన్నింటికీ కర్త గా ఉంటారో వారిని గూర్చి తెలుసుకోవడం ముఖ్యం. ‘’దేహము” యొక్క ప్రధాన ప్రయోజనము దేహములో ఉన్న ‘’దేహిని’’ గురించి తెలుసుకోవడం. కనుక దేహము ధృఢమైన స్థితిలో ఉన్నప్పుడు, మనసు జాగరూకతతో ఉన్నప్పుడు, జ్ఞానము పదునయిన స్థితిలో ఉన్నప్పుడే దేహము లోపల ఉన్న దేహిని తెలుసుకొనడానికి ఎంతయినా సాధన చేయాలి. దాని నిమిత్తం దేహాన్ని సరియయిన స్థితి లో ఉంచాలి. ఏ విధంగా ఐతే ఏరు దాటడానికి నావ ను అనుకూలంగా ఉంచుతామో అదేవిధంగా దేహము కూడా యోగ్యమైన రీతిలో ఉండాలి. దాని కోసం దేహము పట్ల ఎంతో జాగ్రత్త తీసుకోవాలి.”
-సత్యసాయిబాబా దివ్యవాణి, ఆగస్టు 3, 1966
“ఇతరులు నీ గురించి పొగడినా తెగడినా నీవేమీ పట్టించుకోవద్దు. ఇతరుల పొగడ్తలకు పొంగి పోయేకన్నా నీలో ఉన్న దుర్గుణాలను గుర్తించి వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించు. కేవలం నోటికే పరిమితమయ్యే విధంగా దయ, ప్రేమ, సహనం, సానుభూతి, సమానత్వం, లౌకికం వీటి పైన ప్లాట్ ఫార్మ్ స్పీచ్ లు ఇవ్వడం కన్నా చెప్పిన వాటిలో ఏ ఒక్కటయినా ఆచరించడానికి ప్రయత్నించు. నీ ప్రక్కనున్న వారు బాధలోనూ, వ్యాదులతోను ఉంటే నీకేమీ పట్టనట్టు సుఖంగా విశ్రాంతి తీసుకోవడం మానవత్వం కాదు. ఏఒక్కరు బాధననుభవిస్తున్నా నీవు సుఖంగా ఉండలేవు.
ఒక విషయం గుర్తుంచుకో! ఏ ప్రాణికి నీవు ఆహారం ఇచ్చినా అది భగవంతుడికే చేరుతుంది. ఈ భూమి మీద ఎక్కడయినా ఎవరికి నీవు సేవ చేసినా భగవంతుడిని ఆనందపరుస్తుంది.”
-సత్యసాయిబాబా దివ్యవాణి, 25 ఫిబ్రవరి 1964
“మీరనుభవించే సుఖ దుఃఖం లకు మీ స్వయంక్రుతాలే కారణం కానీ దీనిలో దేవుని ప్రమేయం ఏమాత్రం లేదు. ”
-సత్యసాయిబాబా , రేడియో సాయి 18 ఫిబ్రవరి 2013