Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దివ్య వైద్యుని దివ్యవాణి

Vol 3 సంచిక 6
November/December 2012


“సేవ అంటే మీరు ఇతరులకు  చేసేది అనే కంటే మీకు మీరు చేసుకునేది అని మీరు తెలుసుకొంటారు! మీరు సేవ అనేది పరాయి వ్యక్తికి చేస్తున్నానని  భావించినప్పుడు అది సేవ అనిపించుకోదు. అది సేవ అనే పవిత్ర పరిమళాన్ని కోల్పోయి, అహంకారం అనే దుష్ట సంకల్పానికి బీజం వేస్తుంది. మీచేత సేవను పొందిన వ్యక్తి కూడా దానిని హర్షించలేడు, ఎందుకంటే అతనికి  తాను మీకంటే తక్కువ అన్న భావన కలుగుతుంది. అటువంటి సేవ, సాధన అనబడే నిజమైన సేవ కాదు”.
...సత్య సాయి బాబా, సత్య సాయి స్పీక్స్, Vol 10, Ch 20

                                                  

 

ఎన్నో జన్మల పుణ్య ఫలం వలన లభించిన ఈ మానవ శరీరం జనన మరణ చక్రమనే సముద్రాన్ని దాటగల ఒక పడవ లాంటింది. సముద్రాన్ని దాటడమంటే దేహంలో నున్న దేహిని తెలుసుకోవడమే. శరీరంయొక్క ముఖ్య ఉపయోగమిదే. అందువలన ఎంత బలమైన దేహమున్నప్పటికీ, ఎంత బుద్ధికుశలత ఉన్నా, మనసు ఎంత ఏకాగ్రతతో ఉన్నపటికీ, లోనున్న అంతర్యామిని తెలుసుకోవడానికి తప్పక ప్రయత్నించాలి. అందువలన శరీరాన్ని బలంగా, దృడంగా, రోగరహితంగా ఉంచుకోండి. ఏవిధంగా పడవ సముద్ర ప్రయాణం చేయగలిగే విధంగా ఉండాలో, దేహం కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించే విధంగా ఉండాలి. కావున మీ శరీరాన్ని చక్కగా సంరక్షించుకోండి."
...సత్య సాయి బాబా - దివ్య వాణి, ఆగస్టు 3, 1966