Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

Vol 3 సంచిక 6
November/December 2012


ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

స్వామి యొక్క 87వ జన్మదిన వార్షికోత్సవం ఎంతో వైభవంగా ఆహ్లాదకంగా ముగిసిన అనంతరం ప్రశాంతి నిలయంలో ఒక ఆనందకరమైన వాతావరణము నెలకొంది. ఇది మన పుట్టపర్తి వైబ్రియోనిక్స్ నిపుణులకు కూడా ఎంతో బిజీగా ఉండే సమయమే కారణం ఏమిటంటే వరసగా ఈ నాల్గవ సంవత్సరము కూడా ఉచిత వైద్య శిబిరం ప్రశాంతి రైల్వే స్టేషన్ లో (ఫోటోలు చూడండి) ఏర్పాటు చేసి సేవ చేశారు. స్వామి యొక్క జన్మదిన వేడుకలు స్వామి జన్మస్థలంలో జరుపుకోవడానికి సుదూర ప్రాంతం నుండి అనేక గంటలు రైళ్లలో ప్రయాణం చేసి వచ్చిన వేయి మందికిపైగా రోగులకు వైద్యం అందించారు. ప్రతీ చిన్న విషయంలో కూడా   జాగ్రత్త తీసుకోవడం ద్వారా స్వామి యొక్క అదృశ్య ప్రేమపూర్వక అనుగ్రహం వ్యక్తమయ్యింది. అంత పెద్ద సమూహాన్ని ఊహించనందున ఒకానొక సమయంలో వెంట తెచ్చుకున్నమందు సీసాలు మొత్తం అయిపోయినాయి. కొన్ని నిమిషాల తరువాత, ఊహించని ఒక అభ్యాసకుడు వచ్చి కావలసినన్ని మందు సీసాలు ఇచ్చి వెళ్లారు. ఆ తరవాత వైద్య శిబిరం తన పూర్తి సామర్ధ్యం లో పనిచేయడం ప్రారంభించింది! ఈ సంవత్సరం క్యాంప్ లో ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి. ఒక సేవాదళ్ పాదం చాలా తీవ్రంగా కాలింది, ఇలా కాలినప్పుడు అది నయమవడానికి కనీసం వారం రోజులు పడుతుంది. మన అభ్యాసకులు    గాయం కోసం రెమెడీ ని ఎక్స్ ట్రా విర్జిన్ ఆలివ్ ఆయిల్ లో తయారుచేసి గాయం మీద రాసి నోటిలో తీసుకోవడానికి ఒక బాటిల్ గోళిల సీసా కూడా ఇచ్చారు. ఒక గంటలోనే, సేవాదళ్ ఎప్పటిలాగానే నడిచారు ఎటువంటి నొప్పి లేదా గాయం ఆనవాలు లేదు! ఇది మన స్వామి యొక్క అపారమైన ప్రేమ కి నిదర్శనం!

ఈ సంవత్సరం అక్టోబర్ లో అమెరికాలో (ఫోటో చూడండి) హార్ట్ఫోర్డ్, కనెక్టికట్లో జేవీపీ అభ్యాసకులకు వర్క్ షాప్  నిర్వహించాము. అమెరికా మరియు దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి వచ్చిన 21 భక్తులు ఆత్మ సెంటర్ వద్ద జరిగిన రెండు రోజుల వర్క్ షాప్ కు హాజరై  విజయవంతంగా కోర్సు పూర్తి చేసారు. పూర్తి అర్హత పొందిన ఒక వైబ్రియో టీచర్ ను భవిష్యత్తులో వైబ్రియో సేవ చేయడానికి ఆసక్తి చూపే సాధకులకు శిక్షణ ఇచ్చుటకు నియమించామని మీకు తెలియచేయడానికి నేను ఎంతో సంతోషించుచున్నాను. మీరు ఆ టీచర్ ను [email protected] ద్వారా సంప్రదించవచ్చు.
స్వామి అనుగ్రహంతో, వైబ్రియోనిక్స్ సేవ విస్తరిస్తోంది మరియు స్వామికి సేవ చేద్దామనే నిబద్దత ఉన్నవారందరికీ కూడా అవకాశం ఉంది. మీరు మీ దేశం కోసం ఒక సమన్వయకర్త కావడానికి ఆసక్తి లేదా టీచర్స్ శిక్షణ కోర్సు కోసం దరఖాస్తు చెయ్యాలనుకుంటే, నాకు ఒక ఇమెయిల్ పంపండి.

నవంబర్ 24న, త్రిచూర్  జిల్లా, కేరళ, భారతదేశం కు చెందిన వైబ్రియోనిక్స్ అభ్యాసకులు ఒక శాశ్వత వైబ్రియోనిక్స్ స్వస్థత శిబిరం సమాజంలోని ఆనారోగ్యపాలైన దీనుల కోసం రోజూ సేవ చేయడానికి స్థాపించారు. ఇది అద్భుతమైన ముందడుగు మరియు గొప్ప సేవ ముఖ్యంగా ఇది ఆ గ్రామ ప్రజలకు అందునా డబ్బులేని  పేద ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశం. భారతదేశం యొక్క ఇతర రాష్ట్రాలు, వారి నుండి ప్రేరణ పొంది త్వరితంగా భారతదేశం లో ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్రాలు ఏర్పడాలని మేము ఆశిస్తున్నాము.

నవంబర్ 25న, భారతదేశం లో బెంగుళూర్ వద్ద క్యాన్సర్ ప్రత్యామ్నాయ చికిత్సలు గురించి కార్డ్ రోడ్ హాస్పిటల్లో ఒక సదస్సు నిర్వహించారు. ఆరుగురు నిపుణులు వివిధ రకాల క్యాన్సర్ శక్తివంతమైన చికిత్సలు గురించి సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి నుండి వచ్చిన ముగ్గురు శస్త్ర చికిత్స నిపుణులు, శక్తి చాలన చికిత్సలు వలన లబ్ది పొందిన రోగుల అద్భుతమైన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. వైబ్రియోనిక్స్ గురించి క్యాన్సర్ రోగులతో, వైద్యులతో మాట్లాడేందుకు నన్ను ఆహ్వానించడం గౌరవంగా ఉంది. నేను ఆరు వివిధ రకాల క్యాన్సర్ కేసులు వైబ్రియోనిక్స్ ద్వారా పూర్తిగా ఎలా నయమైనవో వివరించాను. స్వామి కృప వలన నా ఉపన్యాసాన్ని అందరు చక్కగా ఆదరించారు.

ఎప్పటికప్పుడు, అభ్యాసకులు, 2012 డిసెంబర్ 21గురించి స్వామి ఏమైనా చెప్పారా అని నన్ను అడుగుతుంటారు. బాబా దీని గురించి ప్రత్యేకంగా చెప్పినట్లు నా దగ్గర సమాచారం లేదు. కానీ, మనం మానవ చరిత్రలో ఒక ముఖ్యమైన అభివృద్ధి ప్రారంభ దశ వద్ద ఉన్నామని నిస్సందేహంగా చెప్పగలను. నిస్సందేహంగా, చెప్పబడుతున్న ప్రతిదీ మనందరికి ఒక మేలుకొలుపు నిస్తుంది. కొంతమంది ఒక అద్భుతమైన సంఘటన విశ్వంలో 21-23 డిసెంబర్ 2012, సమయంలో 8 నిమిషాలు పాటు జరుగుతుంది అని నమ్ముతున్నారు. ఈ 8 నిమిషాల పాటు అత్యంత అధిక పౌనఃపున్యం గల శక్తి ప్రవాహం ఈథర్ మీద ప్రసరించబడుతుంది. మనలో సూక్ష్మ శక్తులను గ్రహింపగల జ్జ్ణానులు గతంలో అనుభవించిన దేనికైనా మించి  ఆకళింపు చేసుకోగల సంపూర్ణ అవగాహన ఉన్నవారు దీని గురించి తెలుసుకొనగలరు. మరింత సమాచారం త్వరలో మా వెబ్ సైట్ లో పోస్ట్ చేయబడుతుంది, కాబట్టి www.vibrionics.org కు లాగ్ ఆన్ అవడం మరిచిపోకండి.

సాయికి ప్రేమపూర్వక సేవలో  
జిత్ అగర్వాల్

PN రైల్వే స్టేషన్, పుట్టపర్తి వద్ద మెడికల్ క్యాంప్ 21-23 నవంబర్ 2012

 

 

 

 

 

 

 

                                                                                     హార్ట్ఫోర్డ్ CT USA లో JVP శిక్షణ క్లాస్ 20-21 అక్టోబర్ 2012