దివ్య వైద్యుని దివ్యవాణి
Vol 3 సంచిక 5
September/October 2012
“ప్రతీక్షణం దేవుని ధ్యానంలో గడపాలి. మరి అలా గడిపి నట్లయితే మన పని పూర్తిచేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? అని మీరు అనుకోవచ్చు. మీ పని మరియు దేవుని పని అని తేడాలను గుర్తించవద్దు. మీ పని కూడా దేవుని పనే ఎందుకంటే మీరు కూడా దేవుడే. ప్రార్థనా మందిరంలో మీరు చేసిందంతా దేవుని పనిఅనీ మరియు మందిరం వెలుపల చేసేది మీ పని అని అనుకోవడం పొరపాటు. మీరు అటువంటి వేరు భావాలు అనుసరించకూడదు. మీ హృదయం దేవుని యొక్క ఆలయం అని భావించి మీ దృష్టిని లోపలికి త్రిప్పండి. ఈ సత్యాన్ని గ్రహించి తదనుగుణంగా పని చేసేవాడే నిజమైన మానవుడు ”
-సత్య సాయి బాబా -దివ్యవాణి, గణేష్ చతుర్థి 2000
“ ప్రపంచవ్యాప్తంగా మనం చేసే సేవా సాధనలు ప్రాథమికంగా ఆధ్యాత్మిక క్రమశిక్షణ - మానసిక ప్రక్షాళన కోసమే! ఇట్టి వైఖరి లోపించి నప్పుడు మీరు సేవకు ఉపక్రమిస్తే అది నిష్ఫలం గానో, లేదా అహంకారము మరియు ఆడంబరము కోసం చేసినదిగా మారుతుంది. ఒక్క క్షణం ఆలోచించండి: మీరు దేవుని సేవ చేస్తున్నారా లేదా దేవుడు మీకు సేవ చేస్తున్నాడా?... మీరు ఆకలితో ఉన్న బిడ్డకు పాలు ఇచ్చినప్పుడు లేదా పేవ్మెంట్ మీద వణుకుతూ పడుకున్న సోదరునకు దుప్పటిని అందించినప్పుడు మీరు దేవుని బహుమతిని మరొక రూపంలో ఉన్న దేవుని చేతిలో బహుమతి పెడుతున్నారు. ”
-సత్య సాయి బాబా - సనాతన సారథి, డిసెంబర్ 1993