ప్రశ్నలు సమాధానాలు
Vol 3 సంచిక 3
May/June 2012
1. ప్రశ్న: నా రోగులలో ఒకరు భారతదేశంలోని సాయి బాబా ఆశ్రమానికి వెళుతూ ఉంటారు. ఆమె భారతదేశంలో ఉన్నప్పుడు ఆమెకు మలేరియా రాకుండా ఉండటానికి నేను ఏమి ఇవ్వాలి?
జవాబు: మీ రోగికి CC 9.3...OD ఇవ్వండి. బయలుదేరే మూడు రోజుల ముందు రాత్రి OD తీసుకోవాలి. దోమల ప్రాంతంలో ఉన్నప్పుడు మరియు ఆమె తిరిగి వచ్చేటప్పుడు మూడు రోజులు 3TW తీసుకోవాలి. మీకు సాయిరాం పోటంటైజరు ఉన్నట్టయితే CC9.3. బదులుగా వీటిని ఇవ్వండి: NM116 Malaria Extra Strength + SR261 Nat Mur (CM) + SR263 Nat Sulph (CM.
_____________________________________
2. ప్రశ్న: అనారోగ్యంతో బాధపడుతున్న క్యాన్సర్ రోగులకు సాయి వై బ్రియానిక్స్ ప్రభావంపై మీ సలహాను అభ్యర్థిస్తున్నాను.
జవాబు: పూర్తి నివారణలను చూపించే క్యాన్సర్ కేసుల చరిత్రలు మరియు నివారణ కానివి కూడా మనకు ఉన్నాయి. అభ్యాసకుడు వారి రోగికి ఇచ్చిన ప్రేమ మరియు దేవునిపై నమ్మకం, విశ్వాసం యొక్క అనుభవమే స్వయంగా స్వస్థపరిచే ప్రకంపనలను ప్రసరిస్తుంది. అలాగే, రోగికి ప్రబలమైన నమ్మకం హృదయంలో ఉండి, జీవించాలనే సంకల్పం ఉంటే మరియు ప్రతిరోజూ వర్తమానంలో జీవించటంపై దృష్టి పెట్టి; గతం గురించి బాధ, భవిష్యత్తు గురించి చింతన లేకుండా ఉంటే తప్పనిసరిగా అద్భుతాలు జరుగుతాయి.
మన అభ్యాసకులలో ఒకరికి వైద్యులు ఆశ లేక వదిలి పెట్టేసిన మెదడు కణితి మొదటి కేసుగా తటస్థించింది. జీవించడానికి రెండు నెలల సమయం మాత్రమే ఉందని వైద్యులు చెప్పారు. అభ్యాసకురాలిగా అర్హత సాధించిన వెంటనే ఇంత తీవ్రమైన కేసును చికిత్స చేయాల్సిన పరిస్థితి చూసి అభ్యాసకురాలు షాక్ అయ్యారు. కానీ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న రోగిని చూడటానికి వెళ్ళింది. అతని ఆశ వదులుకోవద్దనీ, దేవునిపై విశ్వాసం ఉంచమని, సిఫార్సు చేసిన రీతిగా రెమిడీలు తీసుకోవాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, అతను తప్పనిసరిగా కోలుకుంటాడు అని ఆమె చెప్పారు. కొంతకాలం తర్వాత కుటుంబ సభ్యులు రోగి చక్కగా కోరుకుంటున్నారని చెప్పినప్పుడు భగవంతుని కృపకు ఆమెకు ఆనందభాష్పాలు కా రాయి.
రోగి కోలుకోవడానికి ఆశ ఉందని నమ్మడం చాలా ముఖ్యము. బాబా వారు చెప్పినట్టుగా అన్ని వ్యాధులు మనసు నుండే వస్తాయి కాబట్టి రోగి తీసుకునే వైబ్రియానిక్స్ ఔషధం భగవంతుని వరప్రసాదం అని రోగి తన మనసుకు నచ్చ చెప్పుకునే విధంగా ప్రోత్సహించాలి. మనం ఇచ్చే ఈ చక్కెర గోళీలు అతని అనారోగ్యాన్ని దూరం చేస్తాయని రోగి ఆశావహ దృక్పథంతో ఊహించుకోవాలి. వారు అనారోగ్యంతో ఉన్నారని వారి మనసులోని భావనను అధిగమించగలిగితే వారు త్వరలోనే ఆరోగ్యంగా మరియు బలంగా అవుతారు.
అయితే అనివార్య కారణాల వల్ల రోగి మన సహాయానికి మించి తన శరీరాన్ని విడిచి పెట్టే దిశగా కదులుతూ ఉన్నట్లయితే అతనికి ఇవ్వడానికి ఉత్తమ పరిష్కారం SR272 Arsen Alb (CM) లేదా సాయిరాం హీలింగ్ మిషన్ లేనివారు Mental & Emotional tonic దీనిని ఇవ్వవచ్చు. ఇది జీవితపు చివరి క్షణాలను నిశ్శబ్దంగా మరియు తేలికగా చేస్తుంది. దీనిని BD గా తీసుకోవాలి మరియు నీటిలో కరిగించిన గోళీలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. ఐదు మిల్లీలీటర్ల నీరు త్రాగడానికి ముందు ఒక నిమిషం నాలిక క్రింద ఉంచాలి.
_____________________________________
3. ప్రశ్న: చాలా అధిక ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో వడదెబ్బకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తికి ముందస్తుగా నేను ఏమి ఇవ్వవచ్చు?
జవాబు: వడదెబ్బ లేదా వేడి వాతావరణం యొక్క అసౌకర్యం అనిపించే పరిస్థితి ఉన్నప్పుడు CC21.3 Skin allergies. ఇవ్వవచ్చు. ఇది ముందస్తుగా ఇచ్చేటప్పుడు 3TW గా లేదా వేడి వాతావరణం ఉండి వేడిని భరించలేకపోతే OD గా ఇవ్వాలి. సాయిరాం హీలింగ్ మిషను ఉపయోగించేవారు : NM6 Calming + NM34 Water Balance + NM63 Back-up + SR270 Apis Mel + SR298 Lachesis + SR309 Pulsatilla (30C) + SR317 Sulphur (30C) ఇవ్వవచ్చును. వేడి వాతావరణంలో బయటకు వెళ్లేటప్పుడు తల భాగంకప్పి ఉంచడం ముఖ్యం. వాతావరణంలో వేడి ఎక్కువ ఉన్నప్పుడు శారీరక వ్యవస్థను చల్లబరచటానికి ప్రకృతి అందించిన మార్గం చెమటలాగా పట్టడం. అటువంటి వేడిలో, పుష్కలంగా నీరు త్రాగడం చాలా ముఖ్యం. అయినప్పటికీ ఐస్ వాటర్ తాగితే శరీరం చల్లబడినట్లు అనిపిస్తుంది కానీ ఇది తాత్కాలికం మాత్రమే. ఐస్ వాటర్ శారీరక వ్యవస్థకు తప్పుడు సంకేతాలు అందిస్తుంది. అందుచేత శరీరం తన ఉష్ణోగ్రతను అలాగే నిలుపుకుంటుంది. పొట్టలో చేరిన ఐస్ వాటర్ తన చల్లదనాన్ని 30 నిమిషాల్లో కోల్పోయినప్పుడు, మనం మునుపటి కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ను అనుభవించ వలసి వస్తుంది!
_____________________________________
4. ప్రశ్న: ను క్రమం త నేను గత మూడు నాలుగు నెలలుగా బొంగురు పోయిన స్వరం లేదా మాట రాకపోవడం తో బాధపడుతున్నాను. ఇది ప్రధాన గొంతు అలసటగా నిర్ధారణ చేసి మరియు పూర్తిగా మాట్లాడకుండా రెస్ట్ తీసుకోవటమే మంచిదని అల్లోపతి వైద్యులు సలహా ఇచ్చారు. నేప్పకుండా CC19.7 + CC12.1 తీసుకుంటున్నాను కానీ మార్పు జరగలేదు నేను ఏమి చేయాలి?
జవాబు: మీ సమస్యకు CC19.7 సహాయం చేయనందుకు బాధగా ఉంది, అయితే, వీలైనంతవరకూ మీ డాక్టర్ సలహా పాటించడం ముఖ్యం. ఏదేమైనా, ఈసమస్యకు మానసిక సంబంధమైన ఉద్రిక్తత, ఒత్తిడి లేదా ఆందోళనతో ఏదైనా సంబంధం ఉందా అని తెలుసుకోవడం మంచిది. అటువంటి సందర్భాలలో CC19.7 + CC15.1…TDS తీసుకోమని సూచిస్తున్నాను. ఒక నెల పాటు తీసుకుంటూ స్వామి సహాయం కోసం ప్రార్థించండి.
_____________________________________
అభ్యాసకులారా: మీకు డాక్టర్ అగర్వాల్ గారిని అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ? ఉంటే [email protected] కు రాయండి