దివ్య వైద్యుడి దివ్య వాణి
Vol 3 సంచిక 4
July/August 2012
"సేవ ఏ రూపంలో ఎక్కడ చేసినా ఆధ్యాత్మిక క్రమశిక్షణ తో చేయాలి, మానసిక పవిత్రత కోసం చేయాలి. ఇట్టి భావనతో సేవ చేయలేక పోయినట్లయితే అది నిష్ప్రయోజన మవడం గానీ లేదా అహంకార ఆడంబరాలను పెంపొందించుకొనేది గా కానీ మారిపోతుంది. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించండి మీరు దేవునికి సేవ చేస్తున్నారా లేక దేవుడే మీకు సేవ చేస్తున్నాడా? ఆకలితో ఉన్న ఒక శిశువుకు పాలు ఇచ్చినప్పుడో, లేక పేవ్మెంట్ పైన చలితో వణుకుతున్న సోదరునకు దుప్పటి కప్పినప్పుడో భగవంతుడు ఇచ్చిన దానిని మరొక భగవంతుని చేత సృష్టింప బడిన వానికి అందిస్తున్నారు! ఆధ్యాత్మిక నియమం ప్రకారము మీరు భగవంతుడు ఇచ్చిన దానిని తిరిగి భగవంతునికే సమర్పిస్తున్నారు! కనుక బాగా గుర్తుంచుకోండి - భగవంతుడే మీకు సేవ చేస్తున్నాడు! కానీ ఆ ఘనతను మీకు ఆపాదిస్తున్నాడు. భగవంతుడి సంకల్పము లేనిదే గడ్డిపోచ కూడా కదలదు కనుక ప్రతీ క్షణము సర్వమూ సమకూర్చిన ఆ సర్వేశ్వరుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి!”
-సత్య సాయి బాబా - దివ్యవాణి, ఫిబ్రవరి 20, 1966
"భౌతికమైన దేహ పరిశుభ్రత కన్నాఆంతరంగిక పవిత్రత కోసం మనసును పరిశుభ్ర పరచండి. గుర్తుంచుకోండి సర్వవ్యాపి ఐన భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. ఇతరులకు అనందం చేకూర్చడానికే నిరంతరం మీరు ప్రయత్నించాలి. నిజమైన పండుగ అందరూ తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకోన్నప్పుడే ఉంటుంది. కనుక మీ ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి, అప్పుడే మీరు వారినుండి స్వీకరించడానికి అర్హత ఉంటుంది. ’’ఇచ్చి పుచ్చుకో‘’ అనే దానిని పాటించండి కేవలం నేను నా కుటుంబము అనే స్వార్దాన్ని వీడి ఇతరుల సంక్షేమం కోసం పాటుపడండి.”
-సత్య సాయి బాబా - దివ్యవాణి, ఏప్రిల్ 15, 2003