వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 3 సంచిక 2
March 2012
"ఆహ్లాదకరమైనపని చేయడం సులభమే కానీ ప్రయోజనకరమైన దానిలో నిమగ్నం కావడం చాలా కష్టం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆహ్లాదకరమైనదంతా లాభదాయకం కాదు. గులాబీలతో నిండిన మార్గాన్ని వదులుకొని ప్రమాదకరమైన మార్గం ఎంచుకొని సుత్తి దెబ్బలు (వంటి బాధలు) భరిస్తూ కత్తి పోట్ల(వంటి కష్టాలను)ను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగిన వానికే విజయం వరిస్తుంది. వాస్తవానికి గులాబీ రేకులతో ఏ రహదారి కూడా ఉండదు. జీవితం ఒక ధర్మక్షేత్రం. ఇక్కడ విధులు మరియు కోరికలు ఎల్లప్పుడూ వివాదంలో ఉంటాయి. మీ హృదయాలలో ఎగిసిపడే కోరిక, ద్వేషం, మరియు కోపం యొక్క జ్వాలలను సున్నితంగా తగ్గించండి. మిమ్మల్ని జంతువులు గా మార్చే ఈ శత్రువులకు లొంగిపోవడం పరిపూర్ణ పిరికితనం. అన్ని అడ్డంకులను ధైర్యంతో ఎదుర్కోండి. కష్టాలు మిమ్మల్ని ధృఢంగా మరియు శక్తివంతంగా ఉండేలా తీర్చిదిద్దుతాయి."
- సత్యసాయిబాబా - దివ్యవాణి, 1965 ఫిబ్రవరి 20
"భగవత్ సేవ కంటే మీ తోటి వారికి సేవ చేయడం చాలా అవసరం. వాస్తవానికి ఒక వ్యక్తికి సేవ చేయడం భగవంతుని సేవించిన దానితో సమానము. అదే నిజమైన భక్తి మార్గం. భగవంతుడికి తన పిల్లలను సంతోషపెట్టడంకంటే మించినది ఏముంటుంది. పురుష సూక్తం భగవంతుడికి వెయ్యి తలలు, కళ్ళు మరియు కాళ్ళు కలిగి ఉన్నట్లు వర్ణిస్తుంది. అంటే ప్రతీ జీవి దేవుడే. ఇక్కడ వెయ్యి తలల ప్రస్తావన ఉన్నప్పటికీ వెయ్యి హృదయాల ప్రస్తావన లేదు కనుక హృదయం ఒక్కటే. ఒకేరక్తం తల, కళ్ళు, కాళ్ళు ఇంకా ఇతర అవయవాలకు చేరుతుంది. అవయవానికి ఏదైనా అది వ్యక్తికే చెందుతుంది. అలాగే మీరు ఎవరికి సేవ చేసినా అది దేవునికే చేసినట్లు అవుతుంది. మీ లక్ష్యం దేవునికి సేవ చేయడం మరియు ఆరాధించడంగా మారితే మీ ప్రతీ అడుగు నవ వసంతం అవుతుంది. ప్రతీ అవకాశము భగవంతుని నుండి లభించిన విలువైన బహుమతే అవుతుంది."
- సత్యసాయిబాబా – దివ్యవాణి 1965 మార్చినెల