డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 3 సంచిక 1
January 2012
ప్రియమైన చికిత్సా నిపుణులకు
వైబ్రియానిక్స్ చికిత్సా నిపుణులలో కొంత మంది కొత్త 108CC పెట్టెకు బదులుగా సాయిరాం హీలింగ్ వైబ్రేషణ్ పొటెంటైసెర్ (SRHVP) ను మరియు కార్డులను ఉపయోగిస్తున్నారని మీలో చాలా మందికి తెలిసిన విషయమే. వైబ్రియానిక్స్ వైద్యశాలలు మరియు శిబిరాలకు అధిక సంఖ్యలో తరళి వస్తున్న రోగులకు పొటెంటైసెర్ ద్వారా మందులను తయారు చేసి ఇవ్వడం ఇబ్బందికరంగా ఉండడం కారణంగా, నాలుగు సంవత్సరాల క్రితం, స్వామీ దీవెనలతో, ఈ నూతన చికిత్సా వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. సదృశమైన వ్యాధులు మరియు రోగ లక్షణాల చికిత్సకు ఉపయోగించబడే మందులను కలిపి, సంసిద్ధంచేసిన 108 మిశ్రమాల ద్వారా, మానవులను, జంతువులను మరియు మొక్కలను శోకే దాదాపు అన్ని వ్యాధులకు చికిత్స చేయవచ్చు. ఒకే మందు అనేక రోగ లక్షణాలను నయం చేయడం ఎలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఉదాహరణకు, CC21.2 మొటిమల నుండి బొల్లి సమస్య వరకు అన్ని చర్మ వ్యాధులను నయం చేస్తుంది. చికిత్స పొందుతున్న రోగానికి సంభందంచిన మందులు రోగంతో అనునాదం చెందడము మరియు ఇతర వైబ్రేషన్లు ఏ విధమైన హాని కలిగించకుండా రోగి యొక్క శరీరం నుండి ధాటి పోవడమే, దీనికి కారణం..108 మిశ్రమాలు భగవాన్ మనకి ప్రసాదించిన ఒక అద్భుతమైన కానుక. వీటి ద్వారా వేగంగా మరియు సులభంగా చికిత్సను అందించడానికి మాత్రమే కాకుండా సులభమైన రీతిలో శిక్షణను ఇవ్వడానికి కూడా వీలుగా ఉంది. మీరు 108CC పెట్టెను తయారు చేయడానికి ముందు శిక్షణ పొందియున్నట్లయితే లేక ఈ పెట్టెను పొందాలని ఆశించినట్లయితే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి. 108CC పెట్టెను క్రియాశీలంగా ఉపయోగిస్తూ, SRHVP యంత్రాన్ని ఉపయోగించే శిక్షణను పొందే అవసరముందని భావించే వారు, వైబ్రియానిక్స్ లో ఉన్నత తరగతి యొక్క వివరాలకు మాకు వ్రాయవచ్చు. చైతన్యవంతమైన చికిత్సా నిపుణులకు తాము ఎన్నుకున్న ఈ సేవా మార్గంలో సహాయపడడం మాకు ఎల్లప్పుడు ఆనందాన్నిస్తుంది.
కొన్ని 108 మిశ్రమాల యొక్క కొత్త శీర్షికల పై కొంత అస్పష్టత ఉన్నట్లుంది. కొత్త పుస్తకంలో (2011లో సంకలనం చేయబడింది), మిశ్రమాల సంఖ్యలలో మార్పు లేదు కాని వీటి ద్వారా నయమయ్యే మరికొన్ని రోగాల పేరులు చేర్చడం జరిగింది. మిశ్రమాన్ని తగినంతగా వివరించని శీర్షికలను మాత్రము మార్చడం జరిగింది. మీకు సందేహాలేమైనా ఉంటె కనుక, అనుక్రమణికను చూసి మీరెన్నుకున్న మిశ్రమం, మీరు చికిత్స ఇస్తున్న రోగానికి తగినదేనా కాదాయని నిశ్చయపర్చుకోవచ్చు.
క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సమయంలో, మా కార్యాలయం, కొత్త పెట్టె కోసం వచ్చిన చికిత్సా నిపుణులతో నిండిపోయింది. కొత్త పెట్టెను కొనే అవసరం లేదని మరోసారి మీయందరికీ గుర్తు చేస్తున్నాను. మీరు పర్తిని సందర్శించే సమయంలో ప్రస్తుతం మీ వద్దనున్న పెట్టెను తీసుకు వచ్చి, దీవెనలు కోసం బాబా యొక్క మహాసమాధి వద్ద పెట్టబడిన మాస్టర్ పెట్టె నుండి మీ పెట్టెను రీచార్జ్ చేసుకోవచ్చు. మీ పెట్టెలను రీచార్జ్ చేసుకోవడానికి కార్యాలయానికి వచ్చినప్పుడు, మా వద్ద నుండి కొత్త 108CC పుస్తకాన్ని(2011 సంకలనం) తీసుకోవచ్చు.
కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ఈ తరుణంలో ప్రశాంతి నిలయంలో ఉన్న ప్రకంపనలు అద్భుతంగా ఉన్నాయి మరియు ఎప్పటివలె స్వామి ఉనికి మరియు ప్రేమ భావం యొక్క అనుభూతి మాయందరికీ కలుగుతోంది. మనమందరము ఎప్పటికి స్వామి సేవను మరింత ఉత్సుకత మరియు నిస్వార్థ ప్రేమతో కొనసాగించాలని సంకల్పించుకుందాము. మీయందరికీ 2012 నిస్వార్థ సేవ మరియు ప్రేమతో నిండియుండాలని కోరుకుంటున్నాము!
ప్రేమపూర్వకంగా సాయి సేవలో
జిత్ కే అగ్గర్వాల్