దివ్య వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 2 సంచిక 6
November 2011
“దైవానుగ్రహాన్ని సంపాదించదానికి మూడు రకముల క్రియలు చేయాలి: (1) నిస్వార్థంగా చేసే క్రియలు (2) నిస్వార్థ ప్రేమ (3) పరిశుద్ధమైన/స్వచ్చమైన హృదయాల నుండి వెలువడే ప్రార్థనలు. ఇటువంటి క్రియలు నేరుగా దైవాన్ని చేరుకుంటాయి. మిగిలిన క్రియలు అధ్యక్షత వహించే వివిధ దేవతలచే అనుగ్రహింపబడతాయి. అందువల్ల ప్రార్థనలు నిస్వార్థమైనవిగాను, ప్రేమపూరితంగాను ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు మన దృష్టి ఫలితాల పై ఉండకూడదు.”
-సత్య సాయి బాబా, "థాట్ ఫర్ ది డే", జులై 23, 2011, ప్రశాంతి నిలయం
“అహంకారం అధికంగా ఉన్న వ్యక్తులు ఇతరుల పై అధికారం చెలాయించడానికి ఇష్టపడతారు. ఇటువంటి వ్యక్తులు ప్రపంచాన్ని స్వార్థం మరియు స్వీయ ప్రేమను దృష్టిలో పెట్టుకొని చూస్తారు." నా మాటలు నిజమైనవి", " నా అభిప్రాయమే సరియైనది", "నేను చేసే పని సరియైనది", ఇటువంటి ప్రవర్తన ఆధ్యాత్మిక సాధకులకు హానికరమైనది. సాధకులు, విమర్శలు మరియు సలహాల కోసం ఆత్రుతతో ఎదురుచూడాలి. అంతే కాకుండా, సాధకులు, కోపానికి, ప్రతీకారానికి దారితీసే చర్చలు మరియు వాగ్వాదాలు వంటివి చేయరాదు. ప్రపంచం నుండి గౌరవం సంపాదించడానికి పోరాడవద్దు. ఈ ప్రపంచం నుండి మీకు, మీ గొప్పతనానికి గుర్తింపు లేకపోతే, నిరాశ చెందడం లేదా కోపించడం సరికాదు. ఆధ్యాత్మిక మార్గంలో విజయాన్ని సాధించాలంటే, ఈ సంగతిని మీరు అన్నిటికంటే ముందు నేర్చులోవాలి. మీచే దారి మళ్ళించి, మీ పురోగతికి ప్రమాదం కలిగిస్తుంది కనుక, ఎవరైనా మిమ్మల్ని స్తుతించినప్పుడు పొంగిపో రాదు."
-సత్యసాయి బాబా , "థాట్ ఫర్ ది డే", అక్టోబెర్ 28, 2011, ప్రశాంతి నిలయం