Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 2 సంచిక 6
November 2011


ప్రియమైన చికిత్సా నిపుణులకు,

వైబ్రియానిక్స్ యొక్క కొత్త వెబ్సైట్ పూర్తిగా తయారైందని, స్వామీవారి జన్మదినోత్సవమైన ఈ రోజు ప్రారంభించబడిందని అత్యంత ఉత్సాహంతోను ఆనందంతోను తెలుపుకున్తున్నాము – www.vibrionics.org. మీకు యుసెర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో పాటు ఇమెయిల్ వచ్చియుంటుంది - లాగిన్ చేసి చూసుకోగలరు. మీ ప్రతిపుష్టికి స్వాగతం - సలహాలు, వ్యాఖ్యానాలు లేదా అభినందనలు. తద్వారా ఈ వెబ్సైట్ను మరింత ఉపయోగకరమైనధిగాను, సమాచారమందజేసేదిగాను మరియు ఉపయోగ సౌలభ్యంగల ఒక వేదికగాను తయారు చేయడానికి మాకు సహాయకరంగా ఉంటుంది.  వైబ్రియానిక్స్ కి  సంభందించిన అనుభవాలు, ప్రత్యేకమైన రోగ చరిత్రలు మరియు ఇతర వైబ్రో సంభందిత సమాచారాలు మరియు ప్రశ్నలను పాల్పంచుకోవడానికి ఈ వెబ్సైటును ఒక ఉన్నత వేదికగా తయారు చేయాలని మేము ఆశిస్తున్నాము. స్వామి యొక్క అనంతమైన దీవెనలతో వైబ్రియానిక్స్ నివారణలు ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయో మనందరికీ తెలిసినదే. ఇప్పుడు సైబర్ రైలెక్కి ఈ చికిత్సా విధానాన్ని ఇంటర్నెట్ చేరుకొనే దూరాల వరకు తీసుకెళ్ళే సమయం ఆసన్నమైంది!

మీ అందరికి ఒక ముఖ్య గమనిక - భారతదేశంలో ఉన్న మా చికిత్సా నిపుణులు కోసం మేము కొత్త సచివాలయాలు సృష్టించడం జరిగింది. మీ నెలవారీ నివేదికలను, మీరు నివసిస్తున్న రాష్ట్రం ప్రకారముగా (మీరు శిక్షణ పొందిన రాష్ట్రం ఏదైనప్పటికీ) క్రింది ఈ-మెయిల్ చిరునామాలకు మాత్రమే పంపవలసిందిగా కోరుకుంటున్నాము. మీ నివేదిక యొక్క ప్రతిని ఇతర ఈ-మెయిల్ చిరునామాలకు పంపరాదు మరియు క్రింద ఇవ్వబడిన రూపనిరూపణలో మాత్రమే మీ నివేదికలను పంపవలెను. మీ నివేదికలతో పాటు ఏ విధమైన జోడింపులను పంపవద్దు. సూచించిన రూపనిరూపణలో, మీ ఈ-మెయిల్ యొక్క ప్రధానభాగంలో మీ నివేదికను నకిలీ చేసి పంపాలి.

భారతదేశంలోనున్న సచివాలయాలు

ఆంధ్ర ప్రదేశ్ ……..[email protected]                         కర్ణాటక …..............….[email protected]

అస్సాం ……..[email protected]                           కేరళ ………….……..[email protected]

ఢిల్లీ- ఎన్ సి ఆర్.…[email protected]                     మహారాష్ట్ర & గోవా ….[email protected]

గుజరాత్............ [email protected]                            రాజస్తాన్….…………….[email protected]

హర్యానా ……….[email protected]                             సిక్కిం …………..…….  [email protected]

జె & కే …………[email protected]                               ఉపీ & ఉకె ……...……….[email protected]

భారతదేశంలోనున్న చికిత్సా నిపుణులందరు పంపవలసిన ఈ-మెయిల్ చిరునామా: [email protected]

ఇతర దేశాలలో ఉన్న సచివాలయాలు

 ఇటలీ దేశంలోనున్న నిపుణులు పంపవలసిన ఈ-మెయిల్ ఐడీ:………….…[email protected]

 పోలాండ్ దేశంలోనున్న నిపుణులుపంపవలసిన ఈ-మెయిల్ ఐడీ ………….[email protected]

 ఇతరదేశాలలో ఉన్న నిపుణులు పంపవలసిన ఈ-మెయిల్ ఐడీ ……………...[email protected]

నివేదిక యొక్క నిర్దిష్ట ఆకృతి

                                                        నెల యొక్క నెలవారీ నివేదిక    

పేరు: ___________________________నమోదు సంఖ్య: ____________      

ఈ నెలలో సేవ గంటలు: _____           

చికిత్సివ్వబడిన రోగుల సంఖ్య : పాత  ___ + కొత్త ___ + జంతువులు ___+ మొక్కలు ____అసాధారణ రోగ చరిత్ర (ఉంటే కనుక):

మీరు ఇతర ఈ-మెయిల్స్ ను పంపడానికి మేము ప్రత్యేక ఐడీలు సృష్టించాము. తాఱుమాఱును తప్పించడానికై మరియు జవాబు వేగంగా పొందడానికై మీరు సంభందిత మెయిల్స్ను తగిన ఐడీలకు పంపవలసిందిగా కోరుతున్నాము. 

రోగ చరిత్రలు. ఈ శీర్షక క్రింద అత్యుత్తమ ఫలితాలు లభించిన రోగ చరిత్రలు మాత్రమే మాకు పంపవలెను. ఇటువంటి చరిత్రలు పంపే సమయంలో రోగులలో రోగం లేదా రోగ లక్షణాల యొక్క కాలవ్యవధి మరియు చికిత్స పొందే సమయంలో, రోగ లక్షణాల లేదా వ్యాధి యొక్క మెరుగుదల(శాతం) వంటి వివరాలను పంపవలెను. చర్మ సమస్యలకు చికిత్సను అందిస్తున్న సమయంలో, చికిత్సకు ముందు మరియు తర్వాత, చర్మ రోగంతో ప్రభావితమైన ప్రాంతాలను (తగిన సందర్భాలలో) ఫోటో తీసి పంపడం మంచిది. ఇతర రోగ చరిత్రలలో వైద్యుడిచే ఇవ్వబడిన నివేదికను పంపవలెను. మీరు భారతదేశంలో నివసిస్తుంటే కనుక, రోగ చరిత్రలను  [email protected]కు పంపవలెను. మీరు ఇతర దేశాలలో నివసిస్తుంటే కనుక, [email protected] కు పంపవలెను.

మేము మన వైబ్రియానిక్స్ వెబ్సైట్ కొరకు రోగ చరిత్రలను నిర్మిస్తున్నాము, కాబట్టి రోగ చరిత్రలను వెబ్సైట్లో ప్రచురణకు సమర్పించాలని మీరు భావిస్తే కనుక, పైన ఇవ్వబడిన చిరునామాకు పంపవలెను.

రోగుల సందేహాలు: మీరు భారతదేశ నివాసియైతే, రోగుల సమస్యలకు సంభందించిన సలహాలు, వాళ్లకి ఇవ్వవలసిన మిశ్రమాలు మరియు నివారణలు వంటి వివరాలు క్రింది ఈ-మెయిల్ చిరునామా వద్ద, మా ప్రత్యేక బృందం నుండి మీరు పొందవచ్చు: [email protected]

విదేశాలలో నివసించేవారు సలహాల కొరకు సంప్రదించవలసిన ఈ-మెయిల్ చిరునామా: [email protected]

చికిత్సా నిపుణుల వివరాలు: విదేశాలలో ఉన్న చికిత్సా నిపుణుల చిరునామాల కొరకు,   [email protected] వద్ద సంప్రదించండి. భారతదేశంలోనున్న చికిత్సా నిపుణుల చిరునామాల కొరకు [email protected] ను సంప్రదించండి.

మరోసారి మీయందరికీ ఒక జ్ఞాపిక: మేము మిమ్మల్ని సులభంగా గుర్తించడానికి వీలుగా, మాకు పంపే ప్రతియొక్క ఈ-మెయిల్ యొక్క విషయ సూచిక లైన్లో మీ ప్రత్యేక నమోదు సంఖ్యను వ్రాసి పంపవలసిందిగా కోరుతున్నాము. ఇలా చేయడం ద్వారా మీరు మా వద్దనుండి ప్రత్యుత్తరాన్ని వెంటనే పొందవచ్చు. వైబ్రియానిక్స్ సేవా రంగంలో ప్రస్తుతం 4000 వేలకు పైగా చికిత్సా నిపుణులు ఉన్నారు (రోజురోజుకి ఈ సంఖ్య పెరుగుతోంది), ఈ కారణంగా  భవిష్యత్తులో మేము అనామిక ఈ-మెయిల్స్ కు ప్రత్యుత్తరాలు ఇవ్వక పోవచ్చు.  ప్రత్యేక నమోదు సంఖ్య లేన ఈ-మెయిల్స్ అన్ని కూడను అనామిక ఈ-మెయిల్స్ అని భావించబడతాయి.

ఇటీవల, పోలిష్ చికిత్సా నిపుణులు పోలాండ్లో ఉన్న సోబోట్కాలో పునరధ్యయన శిబిరంలో పాల్గొన్నారు. రెండు దినాలు జరిగిన ఈ శిబిరంలో అమోఘమైన ప్రతిపుష్టి లభించింది. అరవైకి పైగా చికిత్సా నిపుణులు ఈ శిబిరంలో పాల్గొని, వైబ్రియానిక్స్ మిశ్రమాలతో వాళ్ళ అనుభవాలను పాల్పంచుకున్నారు. వీళ్ళల్లో కొంతమంది అత్యద్భుతమైన కొన్ని రోగ చరిత్రలను వివరించారు. ఇటువంటి చరిత్రలను మేము తదుపరి వార్తాలేఖల్లో మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాము. ఇటువంటి సదస్సులు ఉపయోగకరమైన సమాచారం అందచేసివిగాను, అందరిని ఉత్తేజపర్చేవిగాను ఉంటాయి - మీరుంటున్న ప్రాంతంలో ఇటువంటి సదస్సును ఏర్పాడు చేయాలని మీరు ఆశిస్తే కనుక, మాకు తెలియ చేయగలరు. మేము ఇతర చికిత్సా నిపుణులను సంప్రదించి సదస్సు ఏర్పాడు చేయడానికి సహకరిస్తాము.

చివరిగా ఒక చిన్న గమనిక...మేము వైబ్రియానిక్స్ సాధనను 1994 నుండి చేస్తునప్పటికి, 2011లో అధికారికంగా వైబ్రియానిక్స్ అన్న పేరును మన శ్రేయోభిలాషియైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గౌరవార్ధం, సాయి వైబ్రియానిక్స్ గా మార్చబడింది.. స్వామి ప్రసాదిస్తున్న అత్యంత ప్రేమకు, అపారమైన కృపకు, మార్గధర్శకత్వానికి మరియు మనమందరము నిస్వార్థ సేవనంధించే మానవులను నయం చేస్తున్నందుకు స్వామికి మేము నిత్యము కృతజ్ఞతతో ఉంటాము. మీ సాధనములుగా మమ్ము ఎంచుకున్నందుకు మా ధన్యవాదాలు, స్వామి.

సాయి సేవలో,

జిత్ కే అగ్గర్వాల్