Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 2 సంచిక 4
July 2011


ప్రియమైన చికిత్సా నిపుణులకు,

మన ప్రియమైన స్వామి తమ భౌతిక శరీరాన్ని విడిచి పెట్టారే కానీ మనందరిని ఒంటరిగా విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఎన్నో సంవత్సారులగా స్వామి, సేవను మించిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ మరొకటి లేదని మళ్ళి మళ్ళి మనందరికీ గుర్తుచేస్తూనే ఉన్నారు. "మరొకరికి సేవ చేయడానికి, సహాయపడడానికి, ఓదార్చడానికి లేదా ప్రోత్సాహించడానికి మీరు చెయ్యెత్తినప్పుడు, మీరు సాక్షాతూ దైవం కోసం ఎత్తినట్లే అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరులో దేవుడు ఉన్నాడు కనుక" అని స్వామి చెప్పారు. నిస్వార్థ ప్రేమతో ఇతరులకు సేవను అందించటమే మనం స్వామికి సమర్పించుకునే ప్రణామాలు.

మనందరికీ గత మూడు నెలలు ఎంతో కఠినంగా గడిచింది. ఎన్నో తీపి జ్ఞాపకాలతో మనసు నిండిపోతోంది. ముఖ్యంగా స్వామి మరియు వైబ్రియానిక్స్ సంభందించిన జ్ఞ్యాపకాలు. 1994 జూలై లో, బ్రిందావన్ సాయి రమేష్ హాలులో, విశ్వానికే ప్రభువైన మన స్వామి, వైబ్రియానిక్స్ పోటేన్టైసేర్ యొక్క మొదటి నమూనాను దీవించడానికి కిందకి ఒంగారు. (ఆరు రోజులుగా స్వామీ యొక్క దీవెనలు కోసం ఎదురు చూస్తున్న నేను సంబరాశ్చర్యాల కారణంగా యంత్రాన్ని నేలనుండి పైకి ఎత్తలేక పోయాను) మరుసటి రోజిచ్చిన ఇంటర్వ్యూలో స్వామి "OM7 Heart" కార్డును యంత్రంలోనున్న కన్నంలో పెట్టటం ద్వారా యంత్రాన్ని ప్రయోగించారు.

మరోసారి ఇంటర్వ్యూ గదిలో స్వామి "ఈ ఔషధం  డయాబెటిస్ ను నయం చేస్తుందా?" అని చాలా అమాయకంగా అడిగారు. తమ విద్యార్థులకు మరియు భక్తులకు వైబ్రియానిక్స్ చికిత్సపై శిక్షణ ఇవ్వవలసిందిగాను మరియు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో తమ వైద్యులకు ఈ చికిత్స పై ఒక ప్రసంగం ఇవ్వవలసిందిగాను నన్ను ఆదేశించారు. దీని తరువాత నుండి స్వామి అడుగడుగునా తమ మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తూనే ఉన్నారు.

గత 17 సంవత్సరాలుగా, వైబ్రియానిక్స్ కు సంభందమై స్వామి తరచుగా నాకందించిన ఆదేశాలను మరియు దీవెనలను వైబ్రియానిక్స్ చికిత్సా నిపుణులతో పాల్పంచుకోవటం నా కర్తవ్యం. అటువంటి క్షణాలను, తదుపరి వార్తాలేఖల్లో మీ అందరితోను పాల్పంచుకుంటాను.

స్వామి మనకు సేవ చేయడానికి ఒక అద్భుతమైన సాధనాన్ని ప్రసాధించారని మనం భావిస్తే కనుక, మన పాత్రలను మరింత తీవ్రంగాను మరియు మరింత అంకిత భావంతోను పోషించే ప్రయత్నాన్ని చేయడానికి ఇదే సమయం.

మేము మా వంతుగా, కొత్త చికిత్సా నిపుణులకు ఒక నవీనమైన శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాము. నేను ప్రశాంతి నిలయంలో అన్ని తరగతులకి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తూ ఉండేవాడిని.  ఇప్పుడు, అర్హత పొందిన ఉపాధ్యాయుల ద్వారా, అనేక ప్రాంతాలలో తరచుగా శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నాము. యాదృచ్ఛికంగా, స్వామి నాణ్యతపై దృష్టిని ఉంచాలని పరిమాణం పై కాదని ఎల్లప్పుడూ నాకు చెప్పేవారు. నేను ఇప్పటికే సీనియర్ చికిత్సా నిపుణులకు, ఉపాధ్యాయులుగా అర్హత పొందడానికి శిక్షణ ఇవ్వటం ప్రారంభించాను. 108 కామన్ కాంబోలలో శిక్షణ పూర్తి చేసిన నిపుణులు, సాయిరామ్ వైబ్రియానిక్స్ యంత్రాన్ని ప్రయోగించే శిక్షణ పొందడాని కై, దరఖాస్తును పంపవచ్చు. ఈ శిక్షణ పూర్తయిన తరువాత మీరు ఉపాధ్యాయుల శిక్షణ పొందడానికి అర్హులవుతారు.

స్వామి యొక్క  వైబ్రియానిక్స్ వ్యవస్థను భారత దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరికి తెలియచేయడానికి, మాకు ఉపాధ్యాయుల అవసరముంది కనుక, భవిష్యత్తులో నేను ఉపాధ్యాయుల శిక్షణా శిబిరాలు నిర్వహించడానికి ఆసక్తిగా ఉన్నాన.  అంకిత భావంతో సేవనందిస్తున్న చికిత్సా నిపుణులు, వైబ్రియానిక్స్ లో తదుపరి స్థాయికి శిక్షణ పొందాలని ఆసక్తిగా ఉంటే కనుక, దరఖాస్తు పత్రం కొరకు నాకు నేరుగా [email protected] వద్ద వ్రాయండి. దయచేసి మీ వ్యక్తిగత నమోదు సంఖ్యను, ఈ వార్తాలేఖ యొక్క విషయం(సబ్జెక్ట్) లైన్లో ఉన్న విధంగా, వ్రాసి పంపండి. పాఠకులు మన వార్తాలేఖలో మరిన్ని అసాధారణమైన రోగ చరిత్రలను చూడాలన్న కోరికను వ్యక్తం చేసారు. ఇతరులను ప్రేరేపించే నిమిత్తమై, రాబోయే వార్తాలేఖల్లో ప్రచురణ చేయడానికి, విజయవంతమైన రోగ చరిత్రలను లేదా ఆకట్టుకునే విధంగా ఉన్న రోగ చరిత్రలను నా ఇమెయిల్  చిరునామాకు పంపండి.

స్వామి మనపై కురిపించిన అపారమైన దివ్య ప్రేమకు చెల్లింపు ఏ విధంగా ఇవ్వగలము?  స్వామి మనకోసం తీసుకున్న శ్రమ వృధా కాలేదని ఏ విధంగా చూపించగలం? మనలో ప్రతియొక్కరు అంతర్గతంగా మనలోనున్న స్వామిని గుర్తించాలి మరియు ఇతరులలోనూ స్వామిని చూడాలి. అంతేకాకుండా స్వామి స్వయంగా ఏ విధంగానైతే నడుచుకునేవారో అదే విధంగా మనం నడుచుకోవాలి. చికిత్సా నిపుణులారా! మనమందరము ఐక్యత, సామరస్యం మరియు అంకితభావంతో వైబ్రియానిక్స్ సేవను అందించటం ద్వారా స్వామి యొక్క దివ్య ప్రేమను ఈ ప్రపంచమంతా వ్యాపింప చేయాలి.

ప్రేమపూర్వకంగా సాయి సేవలో,

జిత్ అగ్గర్వాల్.