డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
Vol 2 సంచిక 2
March 2011
ప్రియమైన సాధకులకు,
మీ అందరికి ప్రశాంతి నిలయం నుండి సాయి రామ్ ! ఒక అందమైన అనుభూతితో నూతన సంవత్సరం ప్రారంభమైనది మరియు మరోసారి కొన్ని అద్భుతమైన వైబ్రో సమాచారాలను మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. వైబ్రియానిక్స్ శిక్షణ పొందిన సాధకుల సంఖ్య, చికిత్స పొందిన రోగుల సంఖ్య మరియు సేవ చేసిన సమయం వంటి వివరాలతో కూడిన మా వార్షిక నివేదికను, ప్రతి సంవత్సరం మేము స్వామికి సమర్పించే విషయం మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరం, జనవరి 19న స్వామి తమ దివ్య హస్తాలలో నివేదికను అందుకొని చదివారు మరియు "చాలా సంతోషం" అని అతిసుందరమైన చిరునవ్వు చిందిస్తూ చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా, సాక్షాతూ భగవంతుడు నేరుగా మనకిచ్చిన బహుమతి ఇది. స్వామీ ఈ సేవా కార్యక్రమాన్ని కేవలం ఆశీర్వదించడమే కాకుండా మనం చేసే సేవను చూసి సంతోషించడం మనందరికీ ఈ సేవను మరింత ఉత్సాహంతో చేయడానికి ఒక ప్రోత్సాహకం.
వ్యక్తిగత స్థాయిలో, ఎన్నో అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయని విన్నాము. ఒక వైబ్రో చికిత్సా నిపుణులు 2792 108CC బాక్సును తీసుకున్న వెంటనే బాక్సులో ఉన్న ప్రతియొక్క సీసా చుట్టూ విభూతి రావడం జరిగింది(వెనుక పేజీలో పటం చూడండి) లండన్లో మరొక చికిత్సా నిపుణులు తయారు చేసే ప్రతియొక్క వైబ్రో మందుపై లేదా రోగి యొక్క నమోదు పత్రంపై విభూతి రావడం జరుగుతోంది. అనేక విధాలుగా తమ మద్దతును మరియు సర్వవ్యాపకత్వాన్ని చూపించి మనందరిని ఆశీర్వదిస్తున్నందుకు స్వామికి కృతజ్ఞ్యతల్ను తెలుపుకుంటున్నాము.
మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేరళ రాష్ట్రంలో నిర్వహించ బడిన ప్రథమ AVP శిక్షణా శిభిరం పూర్తైన ఒక నెల తర్వాత, శిక్షణ పొందిన సాధకులు తమ సొంత వార్తాలేఖను ప్రారంభించారు. ఈ అద్భుతమైన చొరవను అభినందిస్తూ, ఇతర వైబ్రో చికిత్సా నిపుణులకు ఇది స్ఫూర్తి కలిగిస్తుందని ఆశిస్తున్నాము.
మా పాత వెబ్సైట్ చిరునామా www.sairam.freeuk.com ఇకపై ఉండదని మరియు మా కొత్త URL www.vibrionics.org అని గమనించగలరు. ప్రస్తుతం ఈ కొత్త వెబ్సైట్ ను నవీకరించే ప్రక్రియ జరుగుతున్నది. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే మీకు ప్రకటన ఇవ్వబడుతుంది.
చివరిగా ఒక జ్ఞాపిక - మనము వైద్యులు కాము, స్వామి యొక్క సాధనములు. స్వామియే రోగులను నయంచేసే ప్రధాన వైద్యుడు.
మీ ఇ-మెయిల్స్ ను మాకు పంపుతూ ఉండండి మరియు స్వామిని ఎంతో సంతోషపర్చే మీ సేవను కొనసాగించండి!
ప్రేమపూర్వకంగా సాయి సేవలో
జిత్ అగ్గర్వాల్