Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ల విభాగము 11653...भारत


జె. దేవనాధన్ 11652…ఇండియా , వీరికి స్వస్థపరిచే సేవ ఒక క్లినిక్‌లో ప్రారంభం కాలేదు – అది పంట పొలాల్లో ప్రారంభమైంది. విద్యాపరంగా ఆయన ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ అయినప్పటికీ  జీవితం ఒక అనుకోని మలుపు తిరిగి తనకు ఎంతో సంతృప్తినిచ్చే సేంద్రీయ వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుని, పంటలు పండించడంతో పాటు సాంప్రదాయిక చెక్క గానుగ నూనెలను తయారు చేయడం ప్రారంభించడమ్ వరకు కొనసాగింది. ఆ జీవిత దశలోనే వీరికి సాయి వైబ్రియానిక్స్ వార్తాలేఖ పరిచయమైంది. వైబ్రియానిక్స్ వెనుక ఉన్న శాస్త్రీయ అంశాలకన్నా, అది పూర్తిగా ఉచిత సేవగా వేలాది మందికి చేరుతూ, అనేక స్వస్థత కథలను సృష్టిస్తున్న విధానం ఆయనను ఎక్కువగా ఆకర్షించింది. ఆ సేవాస్ఫూర్తి ఆయన హృదయాన్ని తాకగా నిశ్శబ్దంగా ప్రేరణ పొంది ఆయన, ఈ పవిత్ర సేవలో భాగస్వామి కావాలని నిర్ణయించుకుని, 2023 ఏప్రిల్ నుండి AVPగా సేవలందిస్తున్నారు. చిన్నదే అయినప్పటికీ ప్రభావవంతమైన తన సేవా ప్రయాణాన్ని ఆయన మనతో ఇలా పంచుకుంటున్నారు.

నేను ఇంకా వైబ్రియానిక్స్‌లో కొత్తవాడినే ఐనప్పటికీ అతి కొద్దిమంది మానవ రోగులకే చికిత్స చేసినప్పటికీ, ఆ అనుభవాలు నా మనసుపై చెరగని ముద్ర వేశాయి. దాదాపు పది సంవత్సరాలుగా తీవ్రమైన, పునరావృతమయ్యే తలనొప్పులతో బాధపడుతున్న నా బంధువుల్లో ఒకరికి CC11.3 Headaches + CC12.1 Adult Tonic ఒక్క మోతాదు ఇచ్చాను. ఆమెకు వెంటనే ఉపశమనం లభించింది. ఆమె ఒక నెలపాటు ఆ మందును కొనసాగించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమెకు తలనొప్పి తిరిగి రాలేదు. మరో సందర్భంలో, నిరంతర వాంతులతో బాధపడుతున్న ఒక రోగికి CC4.6 Diarrhoea + CC15.1 Mental & Emotional Tonic ఒక్క మోతాదు ఇచ్చాను. అతనికి తక్షణ ఉపశమనం లభించింది. ఈ అనుభవం నా విశ్వాసాన్ని మరింత బలపరిచింది.

  నేను పెంచుకొనే ఆవుల్లో ఒకటి దాదాపు మూడు సంవత్సరాలుగా గర్భం దాల్చలేదు. ఎంతో సహనంతో ప్రార్ద్ధిస్తూ CC1.1 Animal Tonic + CC8.2 Pregnancy Tonic మందులను దానికి  ఇచ్చాను. కొన్ని నెలల్లోనే ఆ ఆవు గర్భం దాల్చి, 2025 ఫిబ్రవరిలో ఆరోగ్యవంతమైన దూడకు జన్మనిచ్చింది. ఇప్పుడు అది మళ్లీ సూడితో ఉంది. 2026 ఫిబ్రవరిలో రెండవ దూడకు జన్మనివ్వనుంది. నాకు ఇది యాదృచ్ఛికం కాదు – ఇది స్వామి కృప కార్యరూపం దాల్చిన దృష్టాంతం. జంతువులంటే నాకు ఎంతో ప్రేమ. అందుకే నా ఆవులను ఎంతో శ్రద్ధగా పోషిస్తూ, సంరక్షిస్తూ ఉంటాను. అవి ఇక దూడలను కనలేని స్థితికి చేరినప్పుడు సాధారణంగా ఎదుర్కొనే వధశాలల దురదృష్టకరమైన గమ్యాన్ని తప్పించగలిగితే ఎంతో సంతోషంగా భావిస్తాను.

నా పొలాలు కూడా స్వస్థతకు సంబంధించిన తమదైన నిశ్శబ్ద కథను వినిపిస్తాయి. పాలకూర, వంకాయ వంటి పంటలకు CC1.2 Plant Tonic + CC21.7 Fungus మందులను, సేంద్రీయ ఎరువులు మరియు సహజ పురుగుమందులతో కలిసి క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నాను. అలాగే, పశువుల పేడ్లలో చీమలు మరియు ఈగలను నియంత్రించడానికి CC21.4 Stings & Bites మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ మందును నీటిలో కలిపి పశువులపై చల్లడం ద్వారా ఈగలు మరియు పేనుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు గమనించాను.

నా పంటల మధ్య, నా పశువుల మధ్య నిలబడి ఉన్నప్పుడు నేను ఎంతో వినమ్రతను అనుభవిస్తాను. స్వామియే నిజమైన వైద్యుడు, స్వస్థపరిచేవారు ఆని పరిపూర్ణంగా విశ్వశిస్తాను. నేను కేవలం ఒక సాధనం మాత్రమేనని భావిస్తాను. మానవులకు, జంతువులకు, అలాగే నిశ్శబ్దంగా జీవనాధారాన్ని అందించే మొక్కలకు కూడా అవసరమైన చోట స్వాంతన మరియు స్వస్థతను అందించే అవకాశాన్ని కల్పించినందుకు స్వామికి కృతజ్ఞుడిగా ఉంటాను.