సాధకుని వివరములు 03560...India
ప్రాక్టీషనర్ 03560…India ఫిజిక్స్ లో డిగ్రీ, సిస్టమ్స్ డెవలప్‌మెంట్‌లో పీజీ డిప్లొమా పొందారు. ఫార్మాస్యూటికల్ సేల్స్ విభాగంలో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి, అనంతరం IT రంగంలోకి ప్రవేశించి, అమెరికాలో పోర్ట్‌ఫోలియో మేనేజర్ హోదా వరకు ఎదిగారు.
2015లో ఆయన అత్తగారు భారతదేశం నుండి స్వామివారి చిత్రపటాన్ని తీసుకువచ్చి వారి ఇంటి పూజామందిరంలో ప్రతిష్ఠించినప్పటి నుండి ఆయనకు శ్రీ సత్యసాయి బాబాతో అనుబంధం ప్రారంభమైంది. ఆ సమయంలో స్వామివారి గురించి ఆయనకు పెద్దగా
పరిచయం లేదు. అయన భార్య యొక్క సౌలుజర్నస్ కార్యక్రమాలపై గల ఆసక్తి, వాట్సాప్ వీడియోలు, అలాగే అప్పుడప్పుడు స్థానిక సాయి కేంద్రానికి వెళ్లడం వంటి వాటి వల్ల ఆయనకు స్వామివారి గురించి కొంత అవగాహన ఏర్పడింది.
అయితే, 2017 మార్చిలో ఆయన జీవితంలో ఒక కీలక మలుపు తిరిగింది. ఆయన భార్య పన్నెండు సంవత్సరాలుగా కీళ్లవాతం (ఆర్థ్రైటిస్)తో బాధపడుతున్నారు. అలోపతి, ఆయుర్వేద చికిత్సలు తీసుకున్నప్పటికీ ఆశించిన ఉపశమనం లభించలేదు. ఒక రోజు Souljournsలో "What is Vibrionics" వీడియోను చూసిన తరువాత వారు ఒక వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ని సంప్రదించారు. మొదట నాలుగు వారాల పాటు శరీరము నుండి విషపదార్థములు (టాక్సిన్స్) తొలగించడం కోసం రెమెడీ ఇచ్చి, తరువాత ఆర్థ్రైటిస్‌కు సంబంధించిన రెమెడీ TDS అందించారు. కేవలం రెండు నెలల్లోనే ఆమె ఆరోగ్యం 80 శాతం మెరుగుపడింది.
ఈ అద్భుతమైన కోలుకోవడం ఆయన హృదయాన్ని ఎంతగానో స్పృశించింది. స్వామివారి పట్ల విశ్వాసం, సంపూర్ణ సమర్పణ మరింత పెరిగి, వైబ్రియానిక్స్ ద్వారా మరెంతో మంది ప్రయోజనం పొందాలని ఆయనలో బలమైన అంతరంగ ప్రేరణ కలిగింది. 2017 అక్టోబరులో ఆయన AVP శిక్షణ పూర్తి చేశారు. ప్రారంభంలో అమెరికాలో రోగులను కనుగొనడం కష్టంగా అనిపించింది. రోజుకు కనీసం ఒక్క రోగినైనా పంపించాలని ఆయన స్వామివారిని ప్రార్థించారు. ఆ ప్రార్థనకు త్వరలోనే ఫలితం లభించింది. కొద్ది కాలంలోనే ఆయన వారాంతాలు రోగులతో నిండిపోయాయి. అలాగే అయన స్థానిక సాయి కేంద్రంలో నారాయణ సేవ, ఆఫ్రికాకు పంపేందుకు కళ్లద్దాలను శుభ్రపరచేటటు వంటి సేవ వంటి కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొన్నారు.
2019లో, 57 సంవత్సరాల వయస్సులోనే ముందస్తు పదవీ విరమణ చేసి, భారతదేశంలో వున్న వారి వృద్ధ కుటుంబ సభ్యుల సంరక్షణతో పాటు వైబ్రియానిక్స్ సేవకు పూర్తిస్థాయిలో అంకితమయ్యారు. 2020 జనవరిలో VP, 2022 మార్చిలో SVPగా ఎదిగారు. అనంతరం పరిపాలనా బాధ్యతలు పెరగడంతో రోగుల సంఖ్యను తగ్గించాలని స్వామివారిని ప్రార్థించారు. స్వామివారు ఆయన ప్రార్థనకు స్పందించి, ప్రత్యక్ష వైద్యసేవ నుండి సంస్థకు అత్యంత కీలకమైన IT సేవ వైపు ఆయనను మళ్లించారు.
ప్రస్తుతం సంస్థలోని ఐదుగురు గవర్నర్లలో ఒకరిగా, SVIRT కార్యదర్శిగా వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సంస్థకు సంబంధించిన ఐటీ వ్యవస్థలు, మూడు ఆన్‌లైన్ యాప్‌లు, కేంద్రీకృత డేటా నిల్వ, ఇ-మెయిల్ వ్యవస్థలు, డేటాబేస్ నిర్వహణ, ద్వైమాసిక వార్తాలేఖ రూపకల్పన, దానిని పలు భాషల్లోకి అనువదించే ప్రక్రియ సమన్వయం వంటి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అదనంగా, స్వామివారి శతజయంతి సందర్భంగా సమర్పించబోయే మూడు వైబ్రియానిక్స్ గ్రంథాల కోసం వ్యాసాలను సేకరించే పనిలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన అంకితభావం, సాంకేతిక నైపుణ్యం వైబ్రియానిక్స్ బృందానికి అమూల్యమైన ఆస్తిగా నిలిచాయి.
తన AVP శిక్షణ ప్రారంభ దశలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఆయన గుర్తుచేసుకుంటారు. 2018లో, 65 సంవత్సరాల వయస్సు గల తన బావమరిదికి కుడికాలిపై తీవ్రమైన గాయం ఏర్పడి రక్తస్రావం జరుగుతుండేది. నొప్పితో కుంటుతూ నడుస్తున్నప్పటికీ, "ఇవి కేవలం చక్కెర మాత్రలే" అని నోటి ద్వారా తీసుకునే వైబ్రియానిక్స్ మందులను ఆయన తిరస్కరించారు. ఆ రాత్రి ప్రాక్టీషనర్ "Move Well" రెమెడీ కలిపిన నీటిని గాయంపై స్ప్రే చేశారు. మరుసటి ఉదయం తనకు ఏ మార్పు వచ్చిందో కూడా తెలియకుండా ఆయన ఎటువంటి నొప్పి లేకుండా, కుంటకుండా వైద్యుని వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. పరీక్షించిన వైద్యుడు గాయం ఆనవాళ్లు కూడా కనిపించకపోవడంతో, ఇది ఒక అద్భుతమైన కోలుకోవడమని ఆశ్చర్యపోయాడు. ఆ సంఘటనతో ఆయన బావమరిది సందేహాలన్నీ తొలగిపోయాయి. ఆ తరువాత మూత్రాశయ క్యాన్సర్ చికిత్స సమయంలో కూడా వైబ్రియానిక్స్‌ను తరచుగా ఉపయోగించి మంచి ఫలితాలను పొందారు.
ఇలాంటి ఎన్నో అద్భుతమైన స్వస్థతలను ఆయన ప్రత్యక్షంగా చూశారు. 2019లో, ఏడు సంవత్సరాలుగా రోజుకు కేవలం నాలుగు గంటలే నిద్రపోగలిగిన 53 ఏళ్ల మహిళకు, పడుకునే సమయంలో అరగంట వ్యవధితో CC15.1 Mental & Emotional Tonic మరియు CC15.6 Sleep Disorders నాలుగు మోతాదులు ఇచ్చారు. కేవలం ఒక రోజులోనే ఆమె నిద్రలేమి పూర్తిగా తగ్గిపోయింది. అలాగే, వెన్నెముక సమస్యలు మరియు విఫలమైన శస్త్రచికిత్స కారణంగా నాలుగు సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన 61 ఏళ్ల మహిళకు CC10.1 Emergencies + CC12.1 Adult Tonic + CC15.1 Mental & Emotional Tonic + CC18.5 Neuralgia + CC20.5 Spine + CC20.7 Fractures కేవలం 15 రోజుల పాటు ఇచ్చారు. అనంతరం ఆమె స్వయంగా నడవడం ప్రారంభించారు. రద్దీ వాతావరణంలో తీవ్రమైన తలతిరుగుడు కారణంగా రెండేళ్లుగా ఇంటి బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్న 55 ఏళ్ల మహిళకు CC18.7 Vertigo ఇచ్చారు. ఐదు నెలల్లోనే ఆమె పూర్తిగా కోలుకున్నారు.
మానసిక ఆందోళనతో బాధపడే రోగులకు ఆయన తరచుగా CC15.1 Mental & Emotional Tonic + CC17.2 Cleansingను నీటి స్ప్రే రూపంలో ఇచ్చి, దానిని "ఫీల్ గుడ్ స్ప్రే" అని పిలుస్తారు. ప్రతిరోజూ తమపై స్ప్రే చేసుకోవడం, వారానికి ఒకసారి ఇంటి చుట్టూ కూడా స్ప్రే చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగి మంచి ఫలితాలు వస్తాయని ఆయన నమ్ముతారు. అనేక శారీరక వ్యాధులకు మూలం మనస్సేనని ఆయన విశ్వసిస్తారు. చర్మవ్యాధుల రెమెడీలను తయారు చేసే సమయంలో CC4.2 Liver & Gallbladder టానిక్ ను కలపడం వల్ల గాయాలు త్వరగా మానుతాయని ఆయన చెబుతారు. కీళ్ల నొప్పుల విషయంలో నూనె కంటే నీటితో తయారుచేసిన స్ప్రేలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆయన అనుభవం.
కాలక్రమేణా రెమెడీల ఎంపికలో తర్కం కంటే అంతర్‌ప్రేరణపై ఎక్కువగా ఆధారపడడం నేర్చుకున్నారు. వైద్యం ఫలప్రదంగా ఉండేందుకు అవసరమైన జీవనశైలి సూచనలపై కూడా నిరంతరం అవగాహన పెంచుకుంటున్నారు. దూరప్రాంతాల్లో ఉన్న రోగులకు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ, రెమెడీస్ని కొరియర్ ద్వారా పంపి అవి చేరుకునేలోపు వారికి వెంటనే ప్రసారం (Broadcasting) ద్వారా వ్యాధినుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తారు.
అతను ప్రతి ఒక్కరినీ వైబ్రియానిక్స్ దృక్కోణంలో చూస్తారు — వారికి ఎలా ఉత్తమంగా సహాయం చేయగలరో ఆలోచిస్తారు. ఫలితంగా, ఇప్పుడు అతని స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు అన్ని రకాల తీవ్రమైన అనారోగ్య సమస్యల కోసం ముందుగా వైబ్రోను ఆశ్రయిస్తున్నారు; తరచుగా వారికి మరే ఇతర చికిత్స కూడా అవసరం పడటం లేదు. వైబ్రియానిక్స్‌లోని సరళత మరియు ప్రభావశీలత కారణంగా, అది స్వతంత్రంగా లేదా ఇతర చికిత్సా విధానాలతో కలిపి, ఒక ప్రాథమిక వైద్య విధానంగా సేవలందించగలదని ఆయన విశ్వసిస్తున్నారు.
వైబ్రియానిక్స్ తనను మరింత దయగల వ్యక్తిగా మార్చిందని, వస్తువుల కంటే మనుషులకు ఎక్కువగా విలువ ఇవ్వడం నేర్పిందని ఆయన చెబుతారు. ఆయన అభిప్రాయం ప్రకారం వైద్యం విజయవంతం కావడానికి రెండు మూలస్తంభాలు ఉన్నాయి— ప్రాక్టీషనర్ విశ్వాసం, రోగి కోలుకుంటాననే నమ్మకం. రోగికి ధైర్యం చెప్పడమే చికిత్సలో సగం భాగాన్ని పూర్తి చేస్తుందని, మిగతా పని రెమెడీ చేస్తుందని ఆయన నమ్మకం.
వైబ్రియానిక్స్ సంస్థ సజావుగా నడవాలంటే ప్రతి ప్రాక్టీషనర్ అడ్మినిస్ట్రేటివ్ సేవలకు కూడా కొంత సమయం కేటాయించాలని ఆయన గట్టిగా సూచిస్తున్నారు.
తోటి ప్రాక్టీషనర్లుకు ఆయన సందేశం: “సేవ పట్ల అంకితభావంతో కొనసాగండి. మిగతాదంతా విశ్వమే చూసుకుంటుంది.”
Cases to share:
- బోదకాలు, ఫైలేరియా వల్ల కలిగిన కీళ్లవాతం
- మడమ ఎముక ముళ్లు (కాల్కానియల్ స్పర్స్ ), గుండ్రటి మచ్చలుగా జుట్టు రాలడం