ప్రాక్టీషనర్ల వివరాలు 02786...Russia
ప్రాక్టీషనర్స్ 02786…రష్యా ఈ జంట దాదాపు 12 సంవత్సరాలుగా రష్యాలో వైబ్రియోనిక్స్ సేవ చేస్తోంది. టెక్స్‌టైల్ ఇంజనీర్ అయిన భర్త, డిజైన్ జనరల్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసి, పదవీ విరమణ అనంతరం పత్తి మిల్లుకు సాంకేతిక డైరెక్టర్‌గా చాలా
సంవత్సరాలు పనిచేశారు. శిక్షణ ద్వారా మ్యాథ్స్ టీచర్ అయిన భార్య తన సబ్జెక్టు విషయంలో పెద్దగా పని చేయలేదు గానీ బదులుగా చెస్(చదరంగం) బోధనను కొనసాగించారు.
ఈ జంటను 2002 వేసవిలో వారి స్నేహితులు స్వామికి పరిచయం చేశారు. అదే సంవత్సరం డాక్టర్ ఫణి బండ వ్రాసిన పుస్తకం 'విజన్ ఆఫ్ ది డివైన్' మరియు హోవార్డ్ మర్ఫెట్ యొక్క 'సాయి బాబా, మ్యాన్ ఆఫ్ మిరకిల్స్' పుస్తకం చదివిన తరువాత వారు క్రిస్మస్ సందర్భంగా పుట్టపర్తిని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ఇది ప్రతీ శీతాకాల సెలవుల్లో, ఆశ్రమానికి వారి వార్షిక సందర్శనలకు నాంది అయ్యింది. 2009 లో, భర్త పెన్షనర్ అయిన తరువాత, వారు ప్రశాంతి నిలయంలో నివసించాలనే వారి కలను సాకారం చేసుకొనడానికి భారతదేశానికి మకాం మార్చారు.
ఆశ్రమంలో, ఈ జంట కొంతమంది రష్యన్ ప్రాక్టీషనర్లను కలుసుకొనగా వారు సాయి వైబ్రియానిక్స్ అభ్యసించడానికి వీరిని ప్రోత్సహించారు, చివరికి ఇది వారి జీవితాన్నే అర్ధవంతం చేసింది. జూలై 2009 లో వారు ప్రాక్టీషనర్లు కావడానికి శిక్షణ పొందారు. ఈ సేవ పట్ల వారి అంకితభావం ఎంత గొప్పది అంటే, కేవలం ఏడు నెలల్లో వీరు ఎస్వీపీలుగా పదోన్నతి పొందారు. వారు మిషనరీ ఉత్సాహంతో ఈ వైబ్రియోనిక్స్ సేవలో నిమగ్నమై ఐదేళ్ళలో, ఆశ్రమం లోపల మరియు పుట్టపర్తిలో మూడు వేల మంది రోగులకు చికిత్స చేశారు. వారు వైబ్రియానిక్స్ చికిత్స కోసం హ్యాండ్‌బుక్‌లను చాలా వివరంగా అధ్యయనం చేశారు, వారి సూచనలు తరువాత వైబ్రియోనిక్స్ 2016 లో పుస్తకంలో పొందుపరచబడినవి. ఈ జంట 2014 లో రష్యాకు వెళ్లి తిరిగి వెనక్కి రాలేదు. వారి వైబ్రియానిక్స్ సేవ కూడా పరిమిత మయ్యింది, అంతేకాక, ప్రస్తుత మహమ్మారి కారణంగా ఇది మరింత తగ్గింది. 1986 లో చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్లో ప్రమాదం తరువాత రేడియోధార్మిక వర్షం కారణంగా వారు నివసించే నగరం అధిక స్థాయిలో రేడియేషన్ కలిగి ఉంది. అందువల్ల, చాలా మంది స్థానికులపై వైబ్రియానిక్స్ కంపనాలు పనిచేయవని వీరు కనుగొన్నారు. అయినప్పటికీ, కొద్దిమందిలో వైబ్రియానిక్స్ కంపనాలు పనిచేస్తూ ఉండడంతో ఈ రోగులు క్రమం తప్పకుండా చికిత్స కోసం వస్తుంటారు. వారు రష్యాలో అనేక ప్రాంతాలలో ఉన్న రోగులకోసం రెమిడీలు పంపుతూ ఉండడమే కాక భారతదేశంలోని వారి రోగులకు ఇండియా సందర్శించే రష్యన్ భక్తుల ద్వారా రెమిడీలు పంపుతూ మంచి ఫలితాలు పొందుతున్నారు.
మనతో పంచుకోవడానికి వారికి అనేక ఆసక్తికరకమైన కేసులు ఉన్నాయి. ఒక సందర్భంలో, చర్మముపై అలెర్జీ ఉన్న ఒక యువ అధిక బరువు గల స్త్రీకి CC21.3 Skin allergies ఇవ్వబడ్డాయి, దీనికి ఆమె సోరియాసిస్ రూపంలో పుల్లౌట్ అనుభవించింది. ఇది ఆమెకు చిన్నతనంలో ఏర్పడిన వ్యాధి. రెమిడీ NM41 Psoriasis కు మార్చబడింది, ఇది సోరియాసిస్ మరియు అలెర్జీ రెండింటినీ నివారించడమే కాక ఆసక్తికరంగా ఆరు నెలల తరువాత, ఆమె తన అదనపు బరువును కూడా తగ్గించ గలిగింది! మరొక సందర్భంలో, కారు ప్రమాదంలో కుక్క మరణించడం ప్రత్యక్షంగా చూసిన ఎనిమిదేళ్ల అమ్మాయిలో కొన్ని నెలల క్రితం నాడీ సంకోచము(టిక్స్) అభివృద్ధి అయ్యింది. ఐతే ఈ నాడీ సంకోచాలు యుక్తవయసులో కూడా కొనసాగుతాయి కనుక, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia, తో ఆమె ఒక నెలలోనే ఆరోగ్యంగా అయ్యింది.
కణితులకు సంబంధించి క్రింది రెమిడీలు అద్భుతంగా పనిచేస్తాయని ప్రాక్టీషనర్లు తెలుసుకున్నారు: #1. NM108 Visc Alb (M&F) 8X + NM110 Essiac 3X + SR576 Tumours...TDS and #2. NM110 Essiac 10MM...OW. 38 ఏళ్ల వ్యక్తికి 10 సెంటీమీటర్ల థైరాయిడ్ గ్రంధి కారణంగా అన్నవాహిక నొక్కుకొనిపోయి లాలజలాన్ని మ్రింగడం కూడా కష్టం అయ్యేది. CC12.4 Autoimmune diseases + #1 మరియు #2 తీసుకున్న నెల రోజుల లోపే ఈ గ్రంధి మాయమయ్యి అతనికి ఎంతో ఉపశమనం కలిగింది. మరొకకేసులో 79 ఏళ్ల మహిళకు ప్రేగుల వద్ద కణితి ఉంది. ఒక ప్రక్కకు తిరిగినప్పుడు ఒక ముద్ద లాగా అనిపిస్తూ అది క్రమంగా పెరిగి పిడికిలి పరిమాణానికి మారింది. ఆమెకు NM111 Portal Clearance + CC4.4 Constipation + #1 మరియు #2. ఇవ్వబడింది. చాలా నెలల వరకూ ప్రాక్టీషనర్లు రోగిని చూడడం తటస్థించలేదు, ఐతే ఒకరోజు ఆమెకు చిన్నతనం నుండి ఉన్న క్షయ (TB) వ్యాధి నిమిత్తం చికిత్స కోసం వచ్చింది. గ్రంధి గురించి విచారణ చేయగా అది చాలాకాలం క్రితమే తగ్గిపోయిందని ఆమె చెప్పారు. ఆమెకు CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic ఇవ్వబడింది కానీ నెల తరువాత పుల్లౌట్ కారణంగా భయపడి మానివేసింది. కొంతకాలం తరువాత ఆమెకు తీవ్రమైన జలుబు, దగ్గు ఏర్పడగా నివారణ కోసం తను 50 సంవత్సరాలుగా మందులు వాడుతున్న TB హాస్పిటల్ కు వెళ్లింది. వైద్య పరీక్షలు మరియు ఫ్లూరోగ్రఫీ తరువాత డాక్టర్లు అత్యంత సంభ్రమ ఆశ్చర్యలతో ఆమెకు తీవ్రమైన బ్రాంఖైటిస్ మాత్రమే ఉందని ఆమెకు క్షయ పూర్తిగా తగ్గిపోయిందని కనుక రిజిస్టర్ నుండి ఆమె పేరును తొలగిస్తున్నట్లు తెలిపారు.
వయోజనుడైన ఒక తండ్రి ఈ ప్రాక్టీషనర్ల చేత తన వ్యాధికి విజయవంతంగా చికిత్స పొందిన అనంతరం కొన్ని నెలల క్రితం స్ట్రోక్ కారణంగా ఒక చెవిలో వినికిడి శక్తి కోల్పోయిన తన కుమారుని తీసుకురాగా CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.4 Paralysis ఇచ్చారు. కొన్ని నెలల తరువాత తన కొడుకుకు వినికిడి తిరిగి వచ్చిందని తల్లి ప్రాక్టీషనర్లకు తెలిపింది. ఒక రోజు కారు నడుపుతున్నప్పుడు, అతను ఇంజిన్ శబ్దాన్ని వినగలుగుతూ దానిలో ఏదో సమస్య ఉందని గుర్తించాడు. ఇది అతనిని కలవరపెట్టింది కానీ అంతలోనే అతను మళ్ళీ తను ఆ చెవితో శబ్దాలను వినగలుగుతున్నానని గుర్తించి ఆశ్చర్య పోయాడు. అప్పటి నుండి, అతను దేవుణ్ణి విశ్వసించడం ప్రారంభించి మరుసటి సంవత్సరం తన తల్లితో బాబా ఆశ్రమాన్ని సందర్శించాడు. ప్రశాంతి నిలయం నుండి బయలుదేరిన సమయంలో, అతను ప్రాక్టీషనర్లతో "సజీవమైన దేవుణ్ణి చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది!" అని తెలిపాడు. రోగికి చెవిలో రక్తం గడ్డకట్టి వినికిడి లోపానికి గురిచేసిందని ప్రాక్టీషనర్లు విశ్వసిస్తూ వారు అతనికి సూచించిన రెమిడీలలో ఉన్న SR271 Arnica దానిని కరిగించి వేసి ఉంటుందని సంతృప్తి వ్యక్తం చేసారు.
ప్రాక్టీషనర్లు 108 సిసి బాక్స్ చాలా ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఒక సాధారణమైన కొంబో CC3.6 Pulse irregular గుండె శస్త్రచికిత్స నుండి ఒక మనిషిని రక్షించింది. వంధ్యత్వంతో బాధపడుతున్న మహిళలు తగిన రెమిడీలు పొందిన తరువాత సురక్షితంగా గర్భవతి అయ్యి మాతృత్వం యొక్క ఆనందాన్ని పొందారు. వారి అనుభవంలో CC15.3 Addictions ఖచ్చితంగా మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గిస్తుందని తెలుసుకున్నారు.
కోవిడ్ -19 బాధిత రోగుల కోసం, ఈ జంట రోగుల ఫోటోలను విట్నెస్ గా ఉపయోగించి బ్రాడ్కాస్టింగ్ చేస్తూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. మొట్టమొదటి రోగి భారతదేశానికి చెందిన ఒక మహిళ, కోవిడ్ లాంటి లక్షణాలు 39.5C (103.1F ) ఉష్ణోగ్రత, దగ్గు మరియు తీవ్రమైన గొంతుమంటతో బాధ పడుతున్నారు. రెమిడీ తీసుకున్న మరుసటి రోజు నుండి జ్వరం తగ్గడం ప్రారంభమై అదేరోజు, సాధారణీకరించబడింది. గొంతు మరియు దగ్గు కొద్ది రోజుల్లోనే నయమయ్యాయి. ఇటువంటి లక్షణాలతోనే ఇరాన్ నుండి 12 మంది రోగులు వివిధ రకాల వ్యాధి తీవ్రతలు మరియు లక్షణాలతో చికిత్స కోరగా బ్రాడ్ కాస్టింగ్ ప్రసారం ప్రారంభమైన వెంటనే, ప్రతీ రోగి మెరుగుపడ్డాడు. ఇదే సమయంలో కోవిడ్ -19 తో పాటు వివిధ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగా ఉన్నాయని ప్రాక్టీషనర్లు కనుగొన్నారు. ముందస్తు నివారణకోసం 124 మందికి రెమిడీలు పోస్ట్ చేయబడగా వారిలో ఎవరికీ అనారోగ్యం లేకుండా కోలుకున్నారు.
కృతజ్ఞతతో కూడిన రోగుల ముఖాలను చూసినప్పుడు, అది వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ప్రాక్టీషనర్లు పేర్కొంటున్నారు. ఏ రోజైనా ఎవరికైనా 'మంచి' చేయని రోజుగా గడిచినట్లయితే, అది ఫలించని రోజని వారు భావిస్తారు. ఇంత గొప్ప సేవలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వీరు స్వామికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.