Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ 11632...India


39 ఏళ్ల సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ తన లాప్ టాప్ లో రోజుకు 16 గంటల పాటు ఒక సంవత్సర కాలంగా పనిచేస్తు ఉన్న సందర్భంలో 2020 అక్టోబర్ లో ఆమె కుడి చేతి చూపుడు వ్రేలు మరియు మధ్య వ్రేలు పై నొప్పి మరియు వాపు వచ్చాయి. అంతే కాక ఆమె చూపుడు వేలు వణుకుకు గురౌతోంది. పరిస్థితి రానురాను విషమించి ఆమె టైపింగ్ కోసం రెండువేళ్లు ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడింది. ఐదు నెలల కంటే ఎక్కువ కాలం ఆమె ఇతర వేళ్ళ ద్వారా మాత్రమే టైప్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె ఔషధ గుణాలు కలిగిన నూనెను రాయడం ద్వారా కొంత ఉపశమనం పొందారు. వాపు అరచేతి మొత్తము వ్యాపించడంతో 2021 ఏప్రిల్ 5న ఆమె వైద్యుడిని సంప్రదించగా అది కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ వ్యాధిగా నిర్ధారించారు. నోటి ద్వారా తీసుకొనే కొన్ని మందులను వైద్యుడు సూచించగా వాటి దుష్ప్రభావాల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఆమె వాటిని ఉపయోగించ లేదు. ప్రత్యామ్నాయ వైద్యం కోసం  కోసం ఆమె ఎంతో ఆత్రంగా వెతుకుతున్న సందర్భంలో స్నేహితురాలి ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నారు. 2021 మార్చి 5వ తేదీన ప్రాక్టీషనరును సంప్రదించగా వారు క్రింది రెమిడీ ఇచ్చారు: 

#1. CC10.1 Emergencies + CC20.3 Arthritis...TDS 

#2. CC20.3 Arthritis...BD కొబ్బరి నూనెలో బాహ్య అనువర్తనం కోసం  

మే 21న ఆమె అన్ని లక్షణాలలో 40 శాతం ఉపశమనం పొందడంతో పాటు అప్పుడప్పుడు రెండు వేళ్ళ ను కూడా ఉపయోగించ గలిగే వారు. మరో వారంలో మరింత గణనీయమైన మెరుగుదల కలిగి ఆమె తన చేతిని మరింత స్వేచ్ఛగా ఉపయోగించ గలుగుతున్నారు. మరొక నెల తరువాత జూన్ 27నాటికి ఆమె మొత్త మీద 90% మెరుగైన ఉపశమనం పొందడంతో తన మునుపటి పనులన్నీ సులువుగా చేసుకొన గలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. సెప్టెంబర్ 5నాటికి వ్యాధి లక్షణాలన్నీ పూర్తిగా మాయమయ్యాయి. నవంబర్ 13 నాటికి పై రెండు రెమిడీలు ఆపివేయ బడ్డాయి. ల్యాప్ టాప్ పై రోజుకు 16 గంటలు పని చేసినప్పటికీ పై వ్యాధిలక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు.