Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ఆహారపు అలెర్జీ 03518...Canada


57 సంవత్సరాల మహిళ 2015 లో ఆమె ప్రయాణపు సమయాలలో ఆమె బుగ్గలపై మంట ఏర్పడి అది ఎర్రగా మారి మండుతున్న భావనతో వాపు ఏర్పడింది. ఆమె  స్నేహితురాలు ఐన ఒక చర్మ వ్యాధి నిపుణురాలు ఆమె ముఖం యొక్క చిత్రం చూసి అది తామర గా గుర్తించి ఒక   స్టెరాయిడ్ క్రీమును సూచించగా ఆమె దానిని వారం రోజులు ఉపయోగించారు. కొంత కాలం తర్వాత లక్షణాలు తిరిగి రావడంతో ఆమె ప్రతీ  రోజూ కొత్తిమీర ఆకుల రసాన్ని మరియు మృదువైన ఆహారం తీసుకొనసాగడంతో ఒక వారంలో ఆమె బాగానే ఉన్నారు. తర్వాత 2015 మార్చిలో ఆమె AVP గా అర్హత సాధించిన తర్వాత లక్షణాలు కనిపించిన ప్రతీ సారి ఈ క్రింది రెమిడీ తీసుకొనసాగారు:

#1. CC21.3 Skin allergies + CC21.6 Eczema…6TD 

లక్షణాలు నాలుగు రోజుల్లో తగ్గిపోతూ ఉండడంతో ఆమె క్రమంగా మోతాదు తగ్గిస్తూ వచ్చేవారు. అయితే లక్షణాలు తిరిగి ఏర్పడుతూ ఉండేవి. ఇది అలర్జీ కారణంగా జరుగుతున్నట్లు ఆమె గ్రహించారు. జాగ్రత్తగా అధ్యయనం చేయడం ద్వారా ఆమె వేరుశెనగ, తెల్ల చక్కెర, మైదా ఉత్పత్తులు లేదా ప్యాక్ చేసిన ఆహారం తిన్నప్పుడు తనకు ఈ లక్షణాలు వస్తున్నట్లు కనుగొన్నారు. కాబట్టి ఈ ఆహారాలు తినడం మానివేసి ఆహారంలో ఆరోగ్యకరమైన మార్పులు చేసారు. కానీ కొన్నిసార్లు ఆమె వ్యాపార కార్యక్రమాలు మరియు ప్రయాణాలలో అనుకోకుండా తీసుకుంటూ#1 ద్వారా ఈ సమస్యను అధిగమించ గలుగుతున్నారు. అయితే 2020 ఆగస్టులో కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఆమె తన నివాసం వేరే దేశానికి మారుస్తూ విపరీతమైన ఒత్తిడికి లోనైనప్పుడు సుమారు ఒక నెల పాటు వేరుశెనగలు, ప్యాకేజ్ చేసిన అల్పాహారం మీద ఆధార పడ్డారు. దీనితో లక్షణాలు ఎక్కువ తీవ్రతతో పునరావృతం అయ్యాయి. ఆగష్టు 17 న ఆమె క్రింది అభివృద్ధి పరచబడిన కోంబో తీసుకున్నారు:

 #2. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + #1...6TD 

రెండు రోజుల్లో ఎరుపుదనం మరియు వాపు 70%  తగ్గాయి మరియు  మంట 100% తగ్గింది. మోతాదు TDS కి తగ్గించబడింది మరో వారంలో ఎరుపు మరియు వాపు నుండి 90% ఉపశమనం లభించడంతో ఆగస్టు 25న మోతాదు BD కి మరియు సెప్టెంబర్  7న OD కి తగ్గించబడి 100% మెరుగు అనిపించగానే 2020 సెప్టెంబర్ 30న రెమిడీ ఆపివేశారు. ఆమె ప్రతీరోజూ కొత్తిమీర రసాన్ని తీసుకుని ముఖానికి ఆలోవీరా జెల్ రాసుకునే వారు.

2022 జనవరి నాటికి ఆమె స్నాక్స్ గా వేరుశెనగలు మామూలుగా తీసుకుంటున్నారు, అలాగే వైట్ షుగర్ తో చేసిన తనకు ఇష్టమైన  స్వీట్స్ తింటూనే ఉన్నా ఏ ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నారు.