Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ఆత్మవిశ్వాసం లోపించడం 03582...South Africa


అంతర్ముఖురాలైన 13 ఏళ్ల అమ్మాయికి ఆత్మవిశ్వాసం లోపించడంతో మూడు సంవత్సరాల వయస్సు నుండి తన సొంత కుటుంబం మరియు స్నేహితులతో కూడా మాట్లాడటానికి భయపడేది. స్కూల్లో పరీక్షలు రాయడం కూడా చాలా ఒత్తిడితో కూడుకున్నవి గా పాప భావించింది. ఈ పాప యొక్క ఆంటీ ఆమెను 2021 ఆగస్టు 3న ప్రాక్టీషనర్ వద్దకు తీసుకు వెళ్లారు. ఆమెకు ఈ క్రింది రెమిడీ అందించబడింది:  

CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic…TDS

 ఒక నెల తర్వాత సెప్టెంబర్ 5న ఆమె పూర్తి పరివర్తన గురించి ఆమె తల్లి నుండి విన్న తరువాత ప్రాక్టీషనర్ ఎంతో సంతోషించారు, క్రింద పేర్కొన్న పాప తల్లి యొక్క వ్యాఖ్యని చదవండి. ఈ రెమిడీని నవంబర్ లో ఆమె పరీక్షలు పూర్తయ్యేవరకూ TDS గా కొనసాగించి ఆ తరువాత నిర్వహణ మోతాదు OD కి తగ్గించబడింది.  

పేషంటు తల్లి యొక్క వ్యాఖ్య:  

“ఆశ్రయ ఎప్పుడూ అంతర్ముఖిరాలిగా ఉంటూ అందరితో కలవడానికి విముఖత చూపుతూ వెనుక నిలబడి చూడడానికి మరియు వినడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఖచ్చితంగా అవసరమైతే తప్ప ఆ సంభాషణ పట్ల ఆసక్తి చూపదు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సహా గుంపులో మాట్లాడటానికి ఆమెకు కష్టంగా ఉండేది. ఆమె చేతులు తడిగా మారిపోయి ఆమె నుదుటిపై చెమట  బిందువులు ఏర్పడతాయి. ఆమె అభిప్రాయాలను కలిగి ఉంటుంది కానీ తన అభిప్రాయాలను తనలోనే దాచుకోవడానికి ఇష్టపడుతుంది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోడానికి వైబ్రియానిక్స్ రెమిడీ తీసుకోవడం ప్రారంభించినప్పటి నుండి ఇవన్నీ మారిపోయి అప్పటి నుండి ఆమె ఒక ఆత్మ విశ్వాసం కలిగిన యువతిగా మారిపోయింది. ఆమె ఇప్పుడు వివిధ అంశాలపై ఆరోగ్యకరమైన చర్చల్లో పాల్గొంటున్నది. ఆశ్రయ కూడా తన గొంతును వినిపిస్తూ ఉద్వేగభరితమైన విషయం అయినప్పటికి మాట్లాడానికి భయపడడం లేదు.  ఉపాధ్యాయులు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు కూడా ఆమె ఖచ్చితంగా ఆమె భయం అనే గూడు నుండి బయటకు వచ్చిందని గమనించారు. మా చిన్న అమ్మాయి ఒక అందమైన ఆత్మ విశ్వాసం కలిగిన యువతిగా వికసించి ఇప్పుడు ఈ ప్రపంచమంతా తనదేనని భావిస్తోంది. వైబ్రియానిక్స్ గురించి మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు స్వామి”