Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

నీటిలో కీటకముల ద్వారా ఇన్ఫెక్షన్ 12051...India


ఒక చిన్న గ్రామంలోని చాలా మంది నివాసితులు దాదాపు నెల రోజులుగా శరీరమంతటా తీవ్రమైన దురద మరియు దద్దుర్లతో బాధపడుతున్నారు. తమ గ్రామంలోని మొత్తం 41 నీటి ట్యాంకులలో (41 వ్యక్తిగతమైనవి, ఒకటి అందరికీ చెందినది) నీరు రంగు మారిపోయి పురుగులతో కూడి ఉన్నాయని గుర్తించారు. గ్రామస్తులలో ఒక ప్రధాన వ్యక్తి 2021 జూలై 17న ప్రాక్టీషనర్ ను సంప్రదించగా క్రింది రెమిడీ అందించారు: 

NM36 War + NM101 Skin-H + NM102 Skin Itch + SM2 Divine Protection + SM41 Uplift + SR272 Arsen Alb 30C + SR293 Gunpowder + SR311 Rhus Tox 200C + SR497 Histamine…TDS బాహ్య అనువర్తనం కోసం, విభూతిని ట్యాంకులలో కలపడం కోసం …2TW

41 మంది గ్రా మస్తులు మౌఖికంగా ఔషధాన్ని ఉపయోగించారు. 20 రోజుల్లో ఆ బృందం లోని పిల్లలు మరియు మధ్యవయస్కులు వ్యాధి లక్షణాల నుండి పూర్తిగా విముక్తి పొందగా వృద్ధులు 100% మెరుగుపడటానికి మరో పది రోజులు పట్టింది. గ్రామస్తులు OD  మౌఖిక నిర్వహణ మోతాదుగా కొనసాగించాలని సూచించారు.

విభూతి తో చేర్చిన పై రెమిడీ ఒక చిన్నపేకట్టును మొదట ఒక లీటరు నీటిలో కలిపి ఆ నీటిని ట్యాంకులో చేర్చి ఆ నీటిని కర్రతో బాగా కదిలించారు.  ఈ పద్ధతి మొత్తం 41 ట్యాంకులలో వారానికి రెండు సార్లు చొప్పున 4 వారాలు అనుసరించారు. కొన్ని ట్యాంకులు ఒక వారంలోనే పురుగుల నుండి విముక్తి కాగా మరికొన్ని 10 రోజులలో విముక్తి పొంది ఆ నీరు సురక్షితంగా ఉపయోగించబడింది. వారానికి ఒకసారి పై పద్దతి అనుసరించాలని సూచించ బడింది. ఈ నీటిని తాగడానికి తప్ప అన్నీ గృహ అవసరాలకు ఉపయోగించారు. ఇలా నెల రోజులు చేసిన తరువాత ఆ నీటిని వడకట్ట కుండానే ఉపయోగించడం కొనసాగించారు. వారు భవిష్యత్తులో నీటి చికిత్స కోసం స్థానిక అధికారులు సహాయం కూడా కోరలేదు. 

గ్రామస్థుల నుండి ప్రశంశా పూర్వక సాక్ష్యము:  మీ మార్గదర్శకత్వంలో 11 మంది పిల్లలకు 13 మంది యువకులకు మరియు 17 మంది వృద్ధులకు నీటిలో ఉండే పురుగుల కారణంగా చర్మానికి ఏర్పడిన రుగ్మత నిమిత్తం వైబ్రియానిక్స్ ఔషధం అందించినట్లు తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. మా అవసరానికి అనుగుణంగా అభ్యర్థించిన వెంటనే మీరు అందించిన ఔషధం చాలా చక్కగా పనిచేసింది.  నిత్యమూ రోజుకు రెండుసార్లు చొప్పున రెండు వారాల పాటు మేము దీనిని తీసుకున్నాము. కేవలం 20 రోజులలో  100% నివారణ పొంది నందుకు సంతోషంగా ఉంది. మీ సూచన మేరకు వారానికి రెండుసార్లు ఈ రెమిడీని 40 ట్యాంకులలో కలిపాము. మేము ఈ నీటిని పరీక్షించి చూడగా ఆ నీరు పూర్తిగా స్వచ్చంగా మారిపోయి ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంది.  మేము ఈ ఔషధం పైన పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాము కనుక ఇటువంటి మరి ఏ ఇతర పరిస్థితులలో కూడా  వైబ్రియానిక్స్ ఔషధాన్ని అందజేయ వలసిందిగా అభ్యర్ధిస్తున్నాము.

గ్రామస్తులు అందించిన పై వ్యాఖ్యకు వీడియో లింకు: https://photos.app.goo.gl/vfYrTwY8v9octcr87

108CC బాక్సు ఉపయోగిస్తున్నట్లైతే : CC21.1 Skin tonic + CC21.10 Psoriasis + CC21.11 Wounds & Abrasions; ఇవ్వండి.

సంపాదకుని వ్యాఖ్య: NM103 Stings & Bites లేదా CC21.4 Stings & Bites అదనంగా జోడించినట్లైతే వేగవంతమైన ప్రతి స్పందన వచ్చిఉండేది.