Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

కండర చీలిక 03601...Nepal


2018 ఆగస్టు లో 52 ఏళ్ల మహిళ మోటార్ సైకిల్ ప్రమాదానికి గురయ్యారు. ఆమె కుడి మోచేయి నేలకు బలంగా తాకింది. రెండు రోజుల్లో నొప్పి బాగా పెరగడంతో ఆమెకు ఎక్స్రే తీయబడింది. ఎముకకు ఎటువంటి పగుళ్ళను ఇది నిర్ధారించలేదు,  కానీ మోచేతి వద్ద కండరంలో చీలిక ఏర్పడినట్లు డాక్టర్ నిర్ధారించారు. సూచింప బడిన మందులు వేసుకుంటూ ఆయింట్మెంట్ ఒక నెల రోజుల పాటు వాడారు. ఇది ఆమెకు నొప్పి నుండి 50% ఉపశమనం కలిగించింది కానీ వంట గదిలో బరువైన వస్తువులు ఎత్తడం కష్టంగా ఉంది. 2018 అక్టోబర్ లో నొప్పి తీవ్రమైనందున ఆమె హెర్బల్ రెమిడీ మరియు మసాజ్ ఎంచుకున్నారు.  అది ఆమెకు సహాయపడింది కనుక నొప్పి కలిగినప్పుడల్లా ఈ మందు వాడుతూ జీవితాన్ని వెళ్లబుచ్చసాగారు. 2019 జూన్ లో నొప్పి బాగా తీవ్రమై అరకేజీ కూరగాయలు కూడా ఆమె లేపలేక పోయేవారు. డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చారు అది కొంత ఉపశమనం కలిగించింది కానీ అది తాత్కాలికమే. 2019 నవంబర్ లో నొప్పి మళ్లీ ఏర్పడింది. సంప్రదాయ వైద్యుని వద్ద నుండి మూలికా చికిత్స తీసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఇది పని చేసినట్లు అనిపించింది. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో ఆమెకు ప్రయాణం చేయడంలో ఇబ్బంది ఉన్నందున ఈ చికిత్స కొనసాగించలేకపోయారు. అందుచేత నొప్పి ఆమె కుడి భుజము, మెడ మరియు వీపు  పైభాగానికి వ్యాపించి ఆమె తన మెడను ప్రక్కకు వంచడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. 2021 ఆగస్టు 9న నొప్పి భరించలేనిదిగా  ఉండడంతో వైద్యుని సందర్శించాలని ప్రణాళిక వేసుకున్నారు. అదే రోజున ఆమె AVP గా కొత్తగా అర్హత సాధించిన తన సోదరుడి నుండి ఇమ్మునిటీ బూస్టర్ (IB) అందుకున్నారు. ఆమె ఆ రాత్రి ఒక మోతాదు IB తీసుకున్నారు. అద్భుతంగా ఆమె నొప్పి పూర్తిగా మాయమైంది. 2021 సెప్టెంబర్ 15న ఆమె తన దీర్ఘకాలిక పరిస్థితికి తన సోదరుడు నుండి క్రింది రెమిడీ అందుకున్నారు:  

CC12.1 Adult tonic + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.4 Muscles & Supportive tissue + CC20.7 Fractures…BD

 ఆమె IB ని OD గా కొనసాగిస్తూనే ఉన్నారు. వారం తర్వాత 5-6 కిలోల కూరగాయలు, మరియు రెండు వారాల తర్వాత 25 కిలోల బ్యాగ్ ని తీసుకెళ్లగలిగారు. తన ఇంటి పనులన్నీ ఇబ్బంది లేకుండా చేసుకో గలుగుతున్నారు. అక్టోబర్ 15 నుండి ప్రారంభించి ఒక నెల రోజులలో మోతాదు క్రమంగా OW కి తగ్గించబడింది. 2021 డిసెంబర్ నాటికి OW నిర్వహణ మోతాదుగా IB ని OD గా కొనసాగిస్తున్నారు. ఇప్పుడామె ఎటువంటి నొప్పి లేకుండా చాలా చక్కగా ఉన్నారు.