వంధత్వము 03572...Gabon
బాధాకరమైన రుతుస్రావంతో బాధపడుతున్న38-ఏళ్ల-మహిళకు 2015 అక్టోబర్ లో ఆమె కుడి అండాశయంలో 5 సెంటీమీటర్ల తిత్తి ఉన్నట్లు నిర్ధారణ అయింది; హార్మోన్ల టెస్ట్ ఫలితాలు సాధారణముగానే ఉన్నాయి. గైనకాలజిస్ట్ తిత్తి కోసం, లుటెనైల్ 10 రోజులు తీసుకోవలసిందిగా ఆమెకు సూచించినప్పటికీ అది సహాయం చేయలేదు. ఆమెకు 8-ఏళ్ల-కుమార్తె ఉంది మరియు 2017 ఫిబ్రవరి నుండి రెండవ బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నారు. 2018 జూన్ నాటికి ఆమె గర్భం దాల్చకపోవడంతో, ఆమె HSG పరీక్ష చేయించుకోగా తన రెండు ఫెలోపియన్ ట్యూబ్‌లు పూర్తిగా బ్లాక్ అయ్యాయని వెల్లడించారు. ఆమె ఋతు చక్రాన్ని నియంత్రించడానికి మరియు అండోత్సర్గము పెంచడానికి ఆమెకు మూడు నెలల పాటు క్లోమిడ్ మరియు డుఫాస్టన్ సూచించబడింది. అయితే, ఆమె గర్భం ధరించలేదు లేదా ఋతు చక్రంలో ఎటువంటి మార్పు లేదు. ఆమె కుటుంబంలో ఈమె పట్ల చాలా అసూయ ఉన్నందున, ఎవరో తనపై మంత్రాలు ప్రయోగించారని కాబట్టి తను గర్భం దాల్చలేకపోయినట్లు అనుమానించారు. 2018 సెప్టెంబర్ 15న ఆమె ప్రాక్టీషనరును సంప్రదించగా ఈ క్రింది రెమిడీ ఇచ్చారు:
#1. CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders…TDS
ఆమె ఏ ఇతర ఔషములు తీసుకోలేదు. 2019 మే 10 న, ఆమె ఋతుస్రావం ఇక బాధాకరంగా లేదని మరియు ఒక ఫెలోపియన్ ట్యూబ్ తెరుచుకోగా, మరొకటి బ్లాక్ చేయబడే ఉందని గైనకాలజిస్ట్ కనుగొన్నారని ఆమె తెలిపారు. రెమిడీ క్రింది విధంగా మెరుగుపరచబడింది:
#2. CC8.5 Vagina & Cervix + #1…TDS
జూన్‌లో డాక్టర్ ఆమెకు ఓపెన్ ఫెలోపియన్ ట్యూబ్‌లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందని కనుగొన్నారు మరియు దానిని తొలగించాలని, అలాగే ట్యూబ్‌ను కూడా తీసివేయాలని సూచించారు. శస్త్రచికిత్స తర్వాత ఆమెకు 10 రోజుల పాటు నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్ చికిత్స అందించబడింది. ఈ అనుభవం తర్వాత కూడా, ఆమె బిడ్డను పొందాలని కృతనిశ్చయం తో వైబ్రియోనిక్స్ కొనసాగించాలని ధృఢంగా నిర్ణయించుకున్నారు. ప్రాక్టీషనరు రెమిడీని ఇలా మార్చారు:
≠3. CC8.4 Ovaries & Uterus + CC8.5 Vagina & Cervix + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders…TDS
సెప్టెంబర్ 30 న, ఆమె గర్భ ధారణ పరీక్ష పాజిటివ్ అని ప్రాక్టీషనర్‌కి తెలియజేస్తూ ఆమె హర్షం వ్యక్తం చేసారు. గైనకాలజిస్ట్ బ్లాక్ చేయబడిన ఫెలోపియన్ ట్యూబ్‌తో గర్భం దాల్చడం ఎలా సంభవించిదో అర్ధాంకాక ఆశ్చర్యానికి లోనయ్యారు. పిండం కూడా ఎంతో ఆరోగ్యవంతంగా ఉంది. ఆమె రోగితో ఇలా అన్నారు, "మేడమ్, మీరు గర్భవతి కావడం నిజంగా ఒక అద్భుతం." డాక్టర్ అధిక రక్తపోటును గుర్తించినందున, ఆమెకు ఆల్డోమెట్ సూచించబడింది. గర్భధారణ పూర్తి కాలము, మరియు ప్రసవం అనంతరం ఒక నెల వరకు తీసుకోవలసినదిగా సూచిస్తూ #3 ను క్రింది రెమిడితో భర్తీ చేసారు.
గర్భ ధారణ కోసం
#4. CC8.2 Pregnancy tonic + CC8.9 Morning sickness + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders…TDS
అధిక రక్త పోతుకోసం
#5. CC3.3 High Blood Pressure (BP) + CC3.5 Arteriosclerosis + CC3.7 Circulation + CC4.2 Liver & Gallbladder tonic + CC10.1 Emergencies + CC17.2 Cleansing…TDS
1 ఏప్రిల్ 2020 న ఆమె ఆరోగ్యవంతమైన మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె మే 1 న #4 తీసుకోవడం మానేసారు కానీ బిపి కొంచెం ఎక్కువగా ఉన్నందున #5 ని కొనసాగించాలని సూచింప బడ్డారు. జూన్ 1 న BP సాధారణము కావడంతో #5 తీసుకోవడం ఆపివేశారు. 2021జులై నాటికి, ఆమె మరియు బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.