తామర 11629...India
25 ఏళ్ల స్త్రీకి దురద, పొడిగానూ మరియు పొలుసులుగా ఉండే చర్మం, ప్రధానంగా ఆమె వీపు పైభాగంలో ఏర్పడ్డాయి. ప్రభావిత భాగాలు ఆమె సాధారణ చర్మం రంగు కంటే పేలవంగా ఉండేవి. క్రమంగా ఇవి ముందు వైపు కూడా వ్యాపించడం ప్రారంభించాయి (చిత్రాలు చూడండి). ఈ పరిస్థితి ఒక సంవత్సరం క్రితం తామరగా నిర్ధారించబడి ఆమెకు మాత్రలు మరియు లేపనం రెండూ సూచించబడ్డాయి. అయితే, చర్మం ఎర్రబడినప్పుడు మరియు పొక్కులు వంటివి ఏర్పడినప్పుడు మాత్రమే ఆమె వీటిని ఉపయోగిస్తుస్తున్నారు; ఇది ప్రతీ నెలా ఏర్పడుతూ అల్లోపతి చికిత్స తర్వాత 8-10 రోజులకు తీవ్రత తగ్గుతుంది. 2020 ఏప్రిల్ 7 న, ఆమె ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు:
CC21.2 Skin infections + CC21.6 Eczema…TDS
మే 4 నాటికి, ఆమె వ్యాధి లక్షణాలు అన్నింటినుండి 100% మెరుగుదల ఏర్పడి ఆమె చర్మం సాధారణమయ్యింది. (చిత్రాలు చూడండి). మోతాదు OD కి తగ్గించబడింది, ఆమె ఇలానే కొనసాగించడానికి ఇష్టపడ్డారు. ఆరు నెలల తర్వాత కూడా ఎలాంటి లక్షణాలు పునరావృతం కానందున, ఆమె నవంబర్ చివరి వారంలో నివారణను నిలిపివేసారు. 2021 ఆగష్టు నాటికి, ఆమె ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉన్నారు.
సంపాదకుని సూచన: చర్మ సంబంధిత రుగ్మతలలో, బాహ్య అనువర్తనం కూడా సిఫారసు చేయడం మంచిది.