చర్మము పై దురద 03578...France
45 – ఏళ్ల - మహిళ గత 25 సంవత్సరాలుగా తన శరీరంలోని వివిధ భాగాలలో చర్మం మీద దురదతో బాధపడుతున్నారు, ఇది చేతులు మరియు కాళ్లపై చాలా ఎక్కువగా ఉంది. ఒక సంవత్సరం క్రితం ఇది తీవ్ర సమస్యగా అయ్యేంతవరకూ కూడా ఇది ఆమెను పెద్దగా బాధించలేదు. ఆమె తన చర్మము పైన నిరంతరం గోకుతూ ఉంటుంది, ఇది రాత్రులలో ఎక్కువగా ఉండి, నిద్రలేమి కలుగుతూ ఉండేది. ఆమె విభిన్న అల్లోపతి చికిత్సలు ప్రయత్నించారు కానీ అవి ఏమాత్రం ఉపశమనం ఇవ్వలేదు. ఆరు నెలల క్రితం ఆమె క్లీనింగ్ కు సంబంధించిన ఒక ఉద్యోగములో చేరినప్పుడు, శుభ్రపరిచేందుకు వాడే రసాయనములు ఉత్పత్తుల వాడకం వల్ల, ఆమె పరిస్థితి మరింత దిగజారింది. దురద భరించలేనిదిగా మారడంతో, ఆమె 2019 జులై 12 న ప్రాక్టీషనరును కలిసినప్పుడు ఆమె దాదాపు కళ్లనీళ్ళ పర్యంతం అయ్యారు. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC21.3 Skin allergies…6TD ఒక వారం అనంతరం TDS
#2. CC21.3 Skin allergies…TDS బాహ్య అనువర్తనం కోసం కొబ్బరినూనెలో
జూలై 21 నాటికి ఆమెకు దురదలో 20% మాత్రమే మెరుగుదల ఉంది కానీ ఆమె ఇప్పుడు బాగా నిద్రపోగలుగుతున్నారు. అయితే, మేల్కొన్నప్పుడు, దురద మొదలవుతుంది. మరో ఎనిమిది రోజుల తర్వాత, ఉపశమనం చాలా తక్కువగా ఉన్నందున, #2 క్రింది విధంగా మెరుగుపరచ బడింది.
#3. CC10.1 Emergencies + #2…TDS బాహ్య అనువర్తనం కోసం కొబ్బరినూనెలో
రెండు వారాల తరువాత, దురద విషయంలో 70% మరియు మరో నెల తర్వాత 90% ఉపశమనం కలిగింది. ఆమె రెండు రెమిడీల మోతాదును OD కి తగ్గించాలని భావించారు. అక్టోబర్ 11 న, ఆమె చర్మంపై దురద పూర్తిగా తొలగిపోయిందని సంతోషంగా తెలియజేసారు. మరో రెండు వారాల తర్వాత, 2019 డిసెంబర్ 15 న రెమిడీ ఆపే వరకు మోతాదు OW కి తగ్గించబడింది. 2020 జులైలో వారి చివరి సంప్రదింపుల సమయానికి, రెమిడీ నిలిపివేసిన ఏడు నెలల తర్వాత కూడా వ్యాధి పునరావృతం కాలేదు.